You Are Here: Home » సినిమా » పాటలు » రక్తచరిత్ర

రక్తచరిత్ర

రక్త చరిత్ర

చిత్రం ; రక్తచరిత్ర
గానం :రామ్ గోపాల్ వర్మ
రచన :కలువ సాయి
దర్సకత్వం : రామ్ గోపాల్ వర్మ

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికి రా పయనం
ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా
మిగిలేది శూన్యం నిజం
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి

విలువైన బతుకు వెల లేనిధైతే
మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవరు పగవాడు కాడు
పోయినోడు కూడా రా
ఈ నడుమ నీవు విధి ఆట లోనా
పావైతే వోడెవురా
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

పగ అన్నదెపుడు ఏమిచ్చే నేస్తం
నష్టాన్నే మిగిలించే రా
క్షణ కాలమైన మనశ్శాంతి లేని
బతుకెంత బరువవ్వు రా
బతికేందుకే ఈ బతుకుందని
చచ్చాకా తెలిసేమి రా

కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం కాటికి రా పయనం
ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా
మిగిలేది శూన్యం నిజం
కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం

బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top