You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » రంజనీయ గాయత్రం

రంజనీయ గాయత్రం

రంజనీయ గాయత్రం

 

ఆ ఇద్దరు సోదరీమణులు వోకల్‌ మరియూ వయొలీన్‌ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్‌ నుంచే వీరిద్దరూ వయొలీన్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవారుుద్యంగా కూడా వయోలీన్‌ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్‌ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు. వారే కర్నాటకుకు చెందిన రంజని- గాయత్రి సోదరీమణులు.
aswaతల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం, మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక సంగీత విద్వాంసురాలు. వైలెన్‌ విద్వాంసులుగా తమ 9వ ఏటనుంచే నేర్చుకోవడం ఆరంభించారు ఈ సోదరీమణులు. ముంబాయి షన్ముఖానంద సంగీత విద్యాలయానికి చెందిన టి.ఎస్‌.కృష్ణస్వామి గురువు వద్ద ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ సంగీత సాధన ఆరంభించారు. 1997 సంవత్సరం నుంచి ఈ అక్కచెల్లెళ్లు తమ ప్రదర్శనలివ్వడం ఆరంభించారు. అచిరకాలంలోనే ఈ అక్కచెల్లెళ్లు తమ వైలెన్‌ కృతులతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. లెక్కకుమిక్కిలిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇటీవల సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ రవీందభ్రారతిలో నిర్వహించిన సంస్థాగత వార్షికోత్సవాలలో రంజని – గాయత్రి గాత్రం రాగ రంజితంగా సాగితే సంజయ్‌ సుబ్రహ్మణ్యం గానం సాహిత్య భావ మాధుర్యాన్ని పంచింది.

మైసూర్‌ నాగరాజ్‌, డా.మంజునాధ్‌ వయొలిన్‌ కచేరిలో నాదవాదనా మధురిమలు చిలికించారు. రంజని-గాయత్రి ద్వయం తమ సంగీత శిక్షణలో మెళకువలు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పద్మభూషణ్‌ పి.యస్‌. నారాయణస్వామి వద్ద నేర్చి సంగీతంలో ఇంతటి కీర్తినార్జించి ప్రముఖుల ప్రశంసలు పొందటం అభినందనీయం. అరుదుగా గానం చేసే సరసిజనాభ నాటరాగ వర్ణంలో రంజని – గాయత్రి తొలుతనే ఆకర్షవంతంగా చక్కని స్వరజతులతో అందించారు. ఆంధ్ర నాట ప్రముఖమైన ముఖారిరాగ అన్నమాచార్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము సాహిత్య భావంతో అందించినా, పదలా పల్కులో స్పష్టత లేదనిపించింది. మనసా ఎటులోర్తునే మలయమారుత రాగ త్యాగరాజ కృతిలో స్వరకల్పనా సామర్థ్యాన్ని వెల్లడిజేస్తూ రాజస తామస పదాలకు సొబగుల ద్దారనవచ్చు. అనంతరం నీలాంబరి రాగ తంజావూర్‌ పొన్నయ్య పిళ్ళై తమిళరచన అంబ నీలాంబరి అత్యంత భక్త్భివంతో గానం చేశారు. ప్రధానాంశంగా షణ్ముఖపయ్ర రాగ స్వాతి తిరునాళ్‌ రచన మా మీద కరుణయాలో చక్కని నెరవు, స్వరకల్పనలందించి గ్రాహభీరాన్ని పాటించి గాన మాధుర్యాన్ని పంచారు.

రాగం తానం అంశంలో రంజని గాయత్రి బహుదారి రాగాన్ని ఎంచుకొని తమ ప్రావీణ్యతను కామిత గానలోల, పంకజనాభ శౌరి, విదేహ సుత రామ పదాలతో నెరవులు అందించటంలో స్వీయ ప్రతిభను చాటారు. వయొలిన్‌పై హెచ్‌.యన్‌.్భస్కర్‌ చక్కని అనుసరణ చేయగా, ప్రముఖ యువ విద్వాంసులు వంకాయల వెంకట రమణమూర్తి, అణువణువునా వంకాయల వంశ ప్రతిభను చాటార నవచ్చు. తన ఆవర్తనం యువ ప్రతిభకు ధీటుగా నిలిచి వెంకట రమణమూర్తి సునాద వాదనా మాధుర్యాన్ని పంచారు. రంజని – గాయత్రి యుగళం నానాటి బ్రతుకు నాటకము (రేవతి), కబీర్‌ భజన్‌ దుర్గ్‌ రాగంతో తమ కచేరిని శోభాస్కరంగా ముగించారు.

ganamయువ విద్వాంసులు సంజయ్‌ సుబ్రహ్మణ్యం కచేరి స్వరఝరీ ప్రవాహంగా సాగింది. అరుదుగా గానం చేసే బలహంస వర్ణం (సరసుడా) వినసొంపుగా అందించి దీక్షితుల కృతి నాటకు రంజిరాగం బుధమాశ్రయామి సతతం సంక్షిప్త స్వర కల్పనలతో సంజయ్‌ సుబ్రహ్మణ్యం తన కచేరీకి మెరుగులద్దానవచ్చు. జనరంజని త్యాగరాజ కీర్తన విడజాలదురా నా మనస్సు వేగవంతమైన గమకాలతో, రాగాలాపన సొగసులతో సంజయ్‌ గానం ప్రేక్షక రంజకంగా భాసిల్లింది. తోడిరాగ శ్యామశాస్ర్తీ కృతి ప్రధానాంశంగా పాడి, వారాహి, వైష్ణవి పదాలతో నెరవులు అందించిన సంజయ్‌ స్వరకల్పనల్లో మాధుర్యాన్ని చిలికించారు. ముత్తయ్య భాగవతార్‌ కాపీరాగ కీర్తన, సింధుబైరవి తిల్లానా అంశాలతో సుమారు 3 గంటలపాటు సంజయ్‌ సుబ్రహ్మణ్యం కచేరి ఆద్యంతం రసఝరీ ప్రవాహంగా సాగి సికా కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యస్‌.వరదరాజన్‌ వయొలిన్‌పై పాల్‌ఘాట్‌ మహేష్‌కుమార్‌ (మౄఎదంగం), యస్‌.వెంకటకౄఎష్ణన్‌ (కంజీర)పై చక్కని అనుసరణ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ ద్వయం మైసూర్‌ నాగరాజ్‌ డా.మంజునాధ్‌ వాయులీన కచేరి ప్రతిభా సమాన్వితంగా సాగి, సంగీత రసజ్ఞుల పరంపరా హర్షధ్వానాలతో రవీందభ్రారతి ఆడిటోరియం ప్రతిధ్వనించింది. నాలుగు సంవత్సరాలుగా వీరి కచేరి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సికా సంస్థ ఆనాటి కచేరి సంగీత మధురిమలు పంచి వేల చప్పట్లతో ప్రేక్షకులు నిలిబడి తమ స్పందనను తెలియజేశారు. మైసూర్‌ నాగరాజ్‌, డా.మంజునాథ్‌, పాహియాంశ్రీ, జనరంజని రాగ పాపనాశ శివమ్‌ రచనతో తమ వయొలిన్‌ కచేరి ప్రారంభించి తొలుతనే స్వీయ సాధనా పటిమను వెల్లడిచేశారు.

మనసులోని మర్మము తెలుసుకో హిందోళ రాగ త్యాగరాజకీర్తన సాహిత్య భావానికి సున్నితమైన వాదనతో అందించి పూర్వీకళ్యాణి రాగ జ్ఞానమొసగరాదా త్యాగరాజ కీర్తనలో ఉభయులూ ఆలోచనాత్మకు అద్దంపట్టే విధంగా స్వర్రపస్తారం సాగించారు. బిందుమాలిని రాగ త్యాగరాజ కీర్తన ఎంత ముద్దోలో ఇటు రాగ ప్రస్తారం, స్వరకల్పనా చుతరతతో సాహిత్య భావాన్ని వేగవంతంగా పలికించిన తీరు ప్రశంసనీయంగా సాగింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top