You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » రంగస్ధల రమణి

రంగస్ధల రమణి

రంగస్ధల రమణి

 

స్ర్తీ పాత్రలను పురుషూలు పోషించడం సాధారణం.. కానీ పురుష పాత్రలను స్ర్తీలు పోషించడం అసాధారణం.. ఆ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసింది జమునా రాయలు. రంగస్థల మణిహారంలో మరో ఆణిముత్యం ప్రస్తుతం అప్రతిహతంగా రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు జమునా రాయలు. ఆంధ్ర దేశ నాటక రంగ చరిత్రలో సురభి సమాజానికి ఉన్న ప్రాభవం, ప్రజలలో సురభి కళాకారులకు ఉన్న అభిమానం, ఆదరణ మరువలేనివి.. అలాంటి సురభి కుటుంబం నుంచి వచ్చిన కళాకారిణి శ్రీమతి జమునా రాయలు.
32ssనాటకాలలో స్థానం నరసింహారావుగారు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్ర్తిగారు వీరంతా స్ర్తీ పాత్రల్లో రాణించినవారే. అలాంటి పురుషాధిక్య సమాజంలో రంగస్థలం మీద పురుషులతో సమానంగా శైశవ దశలోనే రంగస్థలం మీద అడుగుపెట్టిన స్ర్తీలలో సురభి సంస్థకు చెందిన మహిళలే ముఖ్యులు అని చెప్పవచ్చు. అటువంటి మహిళలలో మొదటివారు సురభి కమలాబాయి.. కామాక్షి బాయి, పద్మావతీ బాయి, నీలవేణి బాయి, భువన లక్ష్మీబాయి, అనసూయ ఆ తరవాత ఎందరో సురభి కుటుంబ మహిళలు రంగస్థలంపైన రాణించినవారే. ఒక ఊరులోనో, ఒక ప్రదేశంలోనో ఆగిపోయి అక్కడే స్థిరపడడం కాదు.. ఊరూరా.. పర్యటిస్తూ నాటక ప్రదర్శనలు ఇవ్వడం సురభి వారి సంప్రదాయం. అలా గుంటూరులో సురభి సమాజం ఉన్న రోజుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు జమునా రాయలు. విద్యాభ్యాసం అంతగా లేకున్నా చక్కటి ఉచ్ఛారణా, భావయు క్తమైన డైలాగ్‌ డెలివరీ ఆమె సొంతం. ఈమె అద్భుతంగా పద్యాలు పాడగలరు.

పాటలు, పద్యాలు పాడడానికి సంగీతం నేర్చుకోవడం ప్రధానం కాదు. గాత్రం భగవంతుడిచ్చిన వరం.. పాట తల్లిదండ్రుల వారసత్వం, తన పెదబావగారు అయిన గజపతి రాజ కళామండలి మేనేజరుగారి శిక్షణ అని చెప్పే జమునా రాయలు గళం గొంతెత్తి పాడితే ముగ్ధులవని ప్రేక్షకులుం డరు. ఈమె స్వరంలో వీర, క్రోధ, రౌద్ర, శృంగార, కరుణ రసాలు అలవోకగా పలుకుతాయి. 8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం బ్రతుకుతెరువుగా మలచుకుని, చిన్నారి భజస్కంధాలమీద కుటుంబ బాధ్యతలు మోయవలసి రావడం ఒకవిధంగా బాధాకరమైనా అదే నేడు తనకి సమాజంలో ఒక స్థాయినిచ్చిందని అంటారు జమునా రాయలు. మేనమామ సురభి రాయలునే వివాహమాడి, అటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఇటు రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న జమునా రాయలు యుక్త వయస్కురాలు అయ్యాక వేసిన మొదటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు పాత్ర.

dsఆ తరవాత ఆమె శ్రీకృష్ణుడిగా అనేకమార్లు నటించారు. ఆమెకి ఎంతో ఇష్టమైన పాత్ర శ్రీకృష్ణ్ణపాత్ర, ద్రౌపది పాత్ర అని చెప్పారు జమునా రాయలు. ఆమె కేవలం నటే కాదు దర్శకురాలు కూడా. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే కాక అనేక పురస్కారాలను, బహుమతులనూ అందుకుంది. సత్యభామ స్వాతిశయం, సక్కుబాయి, చంద్రమణి సౌమ్యం, రాధలోని ప్రేమ భావం అద్భుతంగా పోషించగల దిష్ట జమునా రాయలు. సత్యభామగా ఆంజనేయరాజుగారితో, రాధగా పీసపాటితో, సుధేష్ణగా వేమూరి రామయ్యతో ఇలా అనేక మంది ప్రముఖులతో నటించే అదృష్ట్టం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్తారు జమునా రాయలు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగి నటించి రాణించి మెప్పించే జమునా రాయలు ఆధునిక రంగస్థల మహిళకు ఆదర్శం. అభినయం, గాత్రం సమానంగా కలిగిన జమునా రాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు పొందారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top