You Are Here: Home » సినిమా » పాటలు » రంగం (2011)- నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే

రంగం (2011)- నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే

పల్లవి :
నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే
రోజాపూలు ఆ ముళ్లచాటులో విరబూసే
తేనా ముళ్లు ఈ లేత పువ్వులా విరిసే
మళ్లీ మళ్లీ నిను చూడమంటూ కనులడిగే
గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే

చరణం : 1
పాదం నీవైపున్నా మది పంపదు అటు కాస్తై
నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషాన
వాగుల దరిలో ఉన్నా
జడివానలు ముంచేస్తున్నా
నినుచూడని ఏ క్షణమైనా ఎండమావేనా
హే… గువ్వ గువ్వ గువ్వ గువ్వ పసిగువ్వ
హే… నువ్వా నువ్వా నువ్వా నువ్వా ప్రతి దోవా
ఓ… నిరంతరం హుషారుగా తోచే
ప్రతి కల నిజాలుగా వేచే
అటు ఇటు షికారులే చేసే నా మనసే
ఓ… నిను నను ముడేసిన ఆశే
పదే పదే వయస్సునే పిలిచే
ఇవాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే॥

చరణం : 2
కాలికి మువ్వల గొలుసు
ఆ స్వరములు నేలకు తెలుసు
ఆ సడి విని వర్ణించైనా నీ ప్రతి సొగసు
జాబిలి నింగిని విడిచే హరివిల్లులు నాతో నడిచే
నువు నా జతలో నిలుచుంటే అవి నాకలుసే
హే… పువ్వా పువ్వా పువ్వా పువ్వా సిగపువ్వా
హే మువ్వ మువ్వ మువ్వ మువ్వ సిరిమువ్వ
హే… అలుండని సముద్రమే లేదు
తపించని తనువిక చేదు
గతించిన క్షణం ఇక రాదు రారాదు
సరేనని వరించని పొద్దు
సుఖాలకే విధించకే హద్దు
ప్రతిక్షణం పంచేసుకో నాతో నీ ముద్దు॥

చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి, సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top