You Are Here: Home » సినిమా » పాటలు » యోగి వేమన (1947)- జీవహింస మానండి

యోగి వేమన (1947)- జీవహింస మానండి

పల్లవి :
జీవహింస మానండి (2)
జీవుల మీవలె ప్రేమించండి
జీవహింస మానండి

చరణం : 1
జీవహింసతో బ్రతికేవారు
శివుని మెప్పు కనలేరండి (2)
జీవులలో శివుడున్నాడండి (2)
జీవుడే శివుడని కొలువండి (2)
జీవహింస మానండి (2)

చరణం : 2
నేనూ నీవని పొరపడకండి
మనలో భేదము లేదండి (2)
అందరిలోపల ఆరక వెలిగే
ఆత్మ ఒక్కటే తెలియండి
పరమాత్మ ఒక్కటే తెలియండి
జీవహింస మానండి (2)

చిత్రం : యోగి వేమన (1947)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top