You Are Here: Home » చిన్నారి » కవితలు » యువ శక్తి

యువ శక్తి

ఒక ఆకస్మిక భీతి మనిషిపై దుమికి
హృదయాన్ని పిడికిట్లో పెడ్తుంటే
బుద్ధి ద్వారాలు తెరుచుకోవాలి!
భవిష్యత్స్‌హచారిణిగా ఉండదగిన అనురాగం
సంయోజిత వర్ణాలలో ప్రకాశవంతం.
సుందర చిత్రానికి లేత ఛాయగా
నిరర్గళమై ఉన్నది, ఊర్ధ్వ ముఖంలో!
స్ర్తీ పురుష యుగళ ప్రేమలు
కాంతి విహీనతల్లో గాదు

మునగాల్సింది.
ఉజ్వల మేధస్సులో
ఆనంద డోలికల్లో కాదు తేలాల్సింది.
ఆచరణాంబుధిలో!
కౌటుంబిక నిండుదనంతో!
జ్యోతిసై్సనా, యశో కీర్తులైనా
అమితత్వంతో కాదు
నడవాల్సింది, సమర్ధతా చేతనంలో!
ఈ సంవేదిత సంకుచిత లోకంలో

నిస్తేజపు విలువలు,
త్రొక్కబడుతున్న ప్రేమపూరిత కదలికలు
అపనమ్మక జీవన చిత్రాలుగా కాదు
అడ్డంకులు లేకుండా
కుంచె ఆగకుండా
వర్ణ రంజితంగ.
ఓపికతో, మందహాసంతో!
మనసులన్నీ గెలవగ!!
ఇక ఆలోచించాల్సిందే,

ఇక బోధించాల్సిందే!
ఇక అందరి ప్రేమను సాధించాల్సిందే!!
యువతకు లేని శక్తి లేదు
యువతకు లేని యుక్తి లేదు
యువత విజ్ఞతకు ఎదురే లేదు
కొన్ని ఆనందాలకు
కొన్ని చేయగల మంచి పనులకు
ఉద్యమించాలి! ప్రజ్వలించాలి!!

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top