You Are Here: Home » సినిమా » సినిమా రివ్యూ » యువతరం లక్ష్యంగా “లవ్‌లీ”

యువతరం లక్ష్యంగా “లవ్‌లీ”

యువతరం లక్ష్యంగా లవ్‌లీరివ్యూ: లవ్‌లీ
తారాగణం: ఆది, శాన్వి, డా. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్…
దర్శకత్వం: బి.జయ
నిర్మాత: బి.ఎ.రాజు
కథ: కోట్లకు అధిపతి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్). ఫారిన్‌లో నిరంతరం వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉండే మహారథికి ఇండియాలో ఉండే కూతురు లావణ్య(శాన్వి) అంటే పంచప్రాణాలు. లావణ్య తన ప్రతిబింబంగా భావిస్తుంటాడు మహారథి. అందుకు తగ్గట్టే లావణ్యకు కూడా తండ్రి అంటే ప్రాణం. దూరంగా ఉన్నా… అభిరుచులు, గుణగణాలూ అన్నీ తండ్రివే. ఈ తండ్రీకూతుళ్ల జీవితాల్లోకి ఆకాష్(ఆది) తుఫాన్‌లా ప్రవేశిస్తాడు. ఆకాష్ మంచి కుర్రాడే కానీ… తొందరెక్కువ.. కాస్త అల్లరి ఎక్కువ. లావణ్య, ఆకాష్‌ల మధ్య అనుకోకుండా ఏర్పడిన స్నేహం.. క్రమంగా ప్రేమగా మారుతుంది.

తండ్రి వద్ద ఏ విషయాన్నీ దాచని లావణ్య.. మహారథికి ఆకాష్ విషయం చెప్పేస్తుంది. అతని ఫొటోని కూడా మెయిల్ చేస్తుంది. అంతే.. కూతురు ఇష్టపడిన అబ్బాయి గురించి తెలుసుకోవడానికి మహారథి హుటాహుటిన ఇండియా బయలుదేరతాడు. తన తండ్రిని ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకోమని ఆకాష్‌ని పంపుతుంది లావణ్య. స్వతహాగా ఉన్న తొందరపాటుతనం వల్ల తొలి పరిచయంలోనే మహారథి వద్ద చెడు అభిప్రాయాన్ని సంపాదించుకుంటాడు ఆకాష్. కూతురుకి డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలని నిరంతరం తపించే మహారథి తన కూతురి ప్రేమకు ఎలాంటి ముగింపునిచ్చాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందిన చిత్రమిది. ప్రతి సన్నివేశంలోనూ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. కెమెరా పనితనం బావుంది. అలాగే అనూప్ రూబెన్స్ పాటలు వినడానికే కాదు… విజువల్‌గా కూడా బాగున్నాయి. తొలి సినిమా కంటే ఆది మెరుగ్గా నటించాడు. స్వతహాగా తను మంచి డాన్సర్ అవ్వడంతో పాటల్లో చక్కని ఈజ్ చూపించాడు. హీరోయిన్‌గా శాన్వి ఓకే. రాజేంద్రప్రసాద్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. మిగిలిన నటీనటులు కూడా పరిధి మేరకు నటించారు. కథ బాగుంది. కథనంలో స్పీడు ఉంటే ఇంకా బాగుండేది. ద్వితీయార్థంలో రాజేంద్రప్రసాద్‌పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు మింగుడుపడవ్. ఇక సంభాషణల్లో అనవసరపు పంచ్‌లు ఎక్కువయ్యాయి. ఏది ఏమైనా బి.జయ దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ‘లవ్‌లీ’ ఫర్వాలేదనే చెప్పాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top