You Are Here: Home » ఇతర » యువతకు ఊతం

యువతకు ఊతం

filler3సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం దేశ ప్రగతి అయినా, ఆ దేశంలోని యువతీయువకుల ప్రతిభా సామర్ధ్యాలు, శక్తియుక్తు లపైనే ఆధారపడి ఉంటుందంటూ మాజీ రాష్టప్రతి అబ్దు ల్‌ కలామ్‌ తరచు చేసే ప్రకటనలు మన కన్నా విదేశీయులనే ఎక్కువ ప్రభావితం చేస్తున్నా యేమో ననిపిస్తోంది. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడా నికి పోజటివ్‌ యూత్‌ డవలెప్‌మెంట్‌ (పివైడి) పేరిట వివిధ రంగాల్లో యువతను ప్రోత్సహించే కార్యక్రమం అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇప్పుడు అమలుజేస్తు న్నారు.యువకుల మనోభావాలను గ్రహించి కట్టలు తెగిన ప్రవాహం వంటి వారి శక్తి సామర్ధ్యాలను ఏ విధంగా సమాజ కల్యాణానికి ఉపయోగించుకోవాలో లోతైన అధ్యయనం చేసిన అనంతరం వివిధ కార్య క్రమాలను రూపొందిస్తున్నారు. విధాన నిర్ణయాల్లోనూ, కొత్త విషయాలను కనుగొనడంలోనూ యువకులకు ప్రమేయం కల్పించడం జరుగుతోంది.

ఈ విషయంలో భారతీయులకు ఉన్న అంకితభావాన్నీ, పని మీద ఉండే శ్రద్ధాసక్తులను గ్రహించడం వల్లనే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన ప్రభుత్వ యంత్రాంగంలో ప్రవాస భారతీయులు పెక్కు మందికి కీలకమైన పదవులను ఇచ్చారు. అమెరికాలో ఆరోగ్య, మానవవనరుల మంత్రి త్వ శాఖలు యువజనాభ్యుదాయనికి సానుకూల వైఖరు లను అనుసరిస్తున్నాయి. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే యువకుల్లో నిరాశానిస్ఫృహలు ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా, వారికి తీరిక లేకుండా చేయడం కోసం వివిధ రంగాల్లో వారికి శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగావ కాశాలు లభించేట్టు చేయడం, అందుకు తగిన రీతిలో వారికి సలహాలూ, సూచనలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యువతకు మంచి భవిత ఇంకా మరింత పెరుగుతుందన్నమాట.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top