You Are Here: Home » ఇతర » యాహూ! యూరో! గ్రీస్‌లో ‘న్యూ డెమోక్రటిక్‌’ కు ఆధిక్యం

యాహూ! యూరో! గ్రీస్‌లో ‘న్యూ డెమోక్రటిక్‌’ కు ఆధిక్యం

ప్రశాంతంగా ఉన్న సరస్సులో ఒక తరంగం ఏర్పడితే అది కొంత సేపటి దాకా అలా విస్తరిస్తూనే ఉంటుంది. పరిస్థితులు దానికి అనుకూలిస్తే అల్లకల్లోలం ఏర్పరుస్తుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా అలానే రూపుదిద్దుకుంది. బలహీనంగా ఉన్న పేకముక్కల మేడ అది. ఎక్కడ ఏ ముక్క కదిలినా పతనం తప్పదు. పేకముక్కలు అలా కదలకుండా ఉండేందుకు ఎన్నో దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటారుు. అవసరమైతే బెరుులవుట్‌ పాే్యకజీలు ప్రకటిస్తుంటారుు. (కఠిన షరతులు షరా మామూలే!) అరుునా అప్పుడప్పుడూ ఆ పేకమేడ కూలుతూనే ఉంటుంది. ఇటీవలి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని దానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

అమెరికాలో ఆరంభమైన సంక్షోభం యావత్‌ ప్రపంచాన్ని చుట్టివచ్చింది. తాజాగా గ్రీస్‌లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కూడా అలాంటిదే. దాన్ని అలాగే వదిలేస్తే అది యావత్‌ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇటీవల గ్రీస్‌లో జరిగిన ఎన్నికల్లో బెరుులవుట్‌, యూరోజోన్‌ అనుకూల పార్టీ అరుున న్యూ డెమోక్రసీ అరకొర ఆధిక్యంతో విజయం సాధించింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. గ్రీస్‌ దేశం యూరోజోన్‌ నుంచి వైదొలు గుందేమోనని ఇన్నాళ్ళూ ఆందోళనకు గురైన పాశ్చాత్య ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. గ్రీస్‌ మన రాష్ట్ర విస్తీర్ణంలో సగం కూడా ఉండదు. జనాభా కోటి దాకా ఉంటుంది. అక్కడెక్కడో ఏదో జరిగితే మనెకందుకు ఇంత ఆందోళన అంటారా… అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే…

ప్రపంచంలోని రెండు వందల యాభెైకి పెైగా దేశాల్లో ఒక చిన్నదేశం గ్రీస్‌. గ్లోబ్‌లో సూది మొన అంత కూడా ఉండదు. అయినా నేడు యావత్‌ భూగోళం చూపూ దాని పెైనే. అన్ని దేశాలు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అని ఎదురు చూశాయి. అందుకు కారణం… ఆ దేశం ఆర్థిక సంక్షో భంతో కొట్టుమిట్టాడుతుండడమే. ప్రపంచీకరణ ఫలి తంగా ఒక దేశంలో ఏదెైనా సంక్షోభం నెలకొంటే అది మెల్ల మెల్లగా అన్ని దేశాలపెై కూడా పడుతుంది. గ్రీస్‌ విషయానికి వస్తే దాని తక్షణ ప్రభావం యూరోజోన్‌పెై పడుతుంది. కారణం అది యూరో జోన్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉండడమే.

ఆంటోనిస్‌ సమరాస్‌ విజయం
Unaగ్రీస్‌ దేశంలో జరిగిన ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్‌ పార్టీ కి స్వల్ప ఆధిక్యం లభించింది. పూర్తి మెజారిటీ రాకపో యినప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు యత్నిస్తోం ది. ఈ పార్టీకి ఆంటోనిస్‌ సమరాస్‌ నేతృత్వం వహిస్తు న్నారు. వివిధ దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందిస్తున్న ప్యాకేజీలను అందుకొని దేశాన్ని గట్టెక్కిం చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రధాన విపక్షం వామపక్ష సిరిజా మాత్రం ఈ ప్యాకేజీలను యథాతథం గా అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవస రమైతే యూరోజోన్‌ నుంచి బయటకు రావాలని, సొం తంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని వాది స్తోంది.అలెక్సిస్‌ సిప్రాస్‌ దీనికి నేతృత్వం వహిస్తు న్నారు. ప్రభుత్వ బలనిరూపణకు మూడు రోజుల సమ యం లభించింది.

గతంలో ప్రభుత్వం దివాళా తీసేం దుకు న్యూ డెమమోక్రాటిక్‌ తదితర పార్టీలే కారణమన్న అభిప్రాయం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఆ పార్టీ ఆధ్వర్యం లో ప్రభుత్వం ఏర్పడితే భారీస్థాయిలో వీధిప్రదర్శనలు చెలరేగే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా ఉన్నా యి. తాజా ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్‌ పార్టీకి 129 స్థానాలు (29.7 శాతం ఓట్లు), సిరిజా పార్టీకి 71 సీట్లు (26.9 శాతం ఓట్లు), పసొక్‌ పార్టీకి 33 సీట్లు (12.9 శాతం ఓట్లు) లభించాయి. పసొక్‌ మద్దతుతో న్యూ డెమోక్రటిక్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం స్థానాల సంఖ్య 300.

యూరోజోన్‌ అంటే…
యురోపియన్‌ యూనియన్‌గా ఏర్పడిన దేశాలు తమ ఉమ్మడి కరెన్సీగా యూరోను నిర్ణయించుకున్నాయి. ఈ కరెన్సీ అమల్లో ఉన్న దేశాలను యూరోజోన్‌గా వ్యవహ రిస్తుంటారు. ప్రస్తుతం 17 దేశాలు అధికారి కంగా యూరోను కరెన్సీగా కలిగి ఉన్నాయి. ఆస్ట్రియా, బెల్జి యం, సైప్రస్‌, ఈస్టోనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌ , జర్మనీ, గ్రీస్‌, ఐర్లాండ్‌, ఇటలీ, లగ్జెంబర్గ్‌, మాల్టా, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, స్లొవేనియా,స్పెయిన్‌ ఇందులో చేరాయి. యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ యూరోజోన్‌ కరెన్సీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది .ఒక దేశంలో చో టుచేసుకునే విపరిణామాలు వెనువెంటనే ఇతర దేశాల పెై కూడా పడే అవకాశం ఉంది. గ్రీస్‌ సంక్షోభ ఫలితం యూరోజోన్‌పెై, దాని ప్రభావం డాలర్‌పెై…ఇలా అన్ని రకాల కరెన్సీలపెై పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం భారత్‌ తదితర వర్ధమాన దేశాలపెై కూడా ఉంటుంది.

బెయిలవుట్‌ పెై వ్యతిరేకత
alaaగ్రీస్‌లోని వామపక్షాలు వివిధ దేశాల, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బెయిలవుట్‌ ప్యాకేజీలను వ్యతిరేకించడా నికి సహేతుక కారణాలు ఉన్నాయి. గతంలో ఈ తరహా బెయిలవుట్‌ ప్యాకేజీలు పొందిన దేశాలెన్నో ఆర్థికంగా మరింత పతనమయ్యాయి. ఆయా దేశాల్లో సంస్కర ణల పేరిట సబ్సిడీలను ఎత్తివేయడంతో పేదలు ఇక్కట్ల కు గురయ్యారు. ప్రభుత్వ వ్యయంపెై నియంత్రణ పెరి గింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు లాంటి వాట న్నింటిపెై యూజర్‌ ఛార్జీల పేరిట రుసుము చెల్లించక తప్పదు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పరోక్షంగా ఆయా ఆర్థిక సంస్థల పెత్తనం పెరిగిపోతుంది. ఇలాంటి వాటిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఈ ప్యాకేజీల నుంచి అర్ధం తరంగా తప్పుకున్నాయి.

గ్రీస్‌ దేశంలో జరిగిన ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్‌ పార్టీ కి స్వల్ప ఆధిక్యం లభించింది. పూర్తి మెజారిటీ రాకపో యినప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు యత్నిస్తోం ది. ఈ పార్టీకి ఆంటోనిస్‌ సమరాస్‌ నేతృత్వం వహిస్తు న్నారు. వివిధ దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందిస్తున్న ప్యాకేజీలను అందుకొని దేశాన్ని గట్టెక్కిం చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.యూరోపియన్‌ యూనియన్‌గా ఏర్పడిన దేశాలు తమ ఉమ్మడి కరెన్సీగా యూరోను నిర్ణయించుకున్నాయి.

ఈ కరెన్సీ అమల్లో ఉన్న దేశాలను యూరోజోన్‌గా వ్యవహ రిస్తుంటారు. ప్రస్తుతం 17 దేశాలు అధికారికంగా యూరోను కరెన్సీగా కలిగి ఉన్నాయి.గ్రీస్‌లోని వామపక్షాలు వివిధ దేశాల, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బెయిలవుట్‌ ప్యాకేజీలను వ్యతిరేకించడా నికి సహేతుక కారణాలు ఉన్నాయి. గతంలో ఈ తరహా బెయిలవుట్‌ ప్యాకేజీలు పొందిన దేశాలెన్నో ఆర్థికంగా మరింత పతనమయ్యాయి. ఆయా దేశాల్లో సంస్కర ణల పేరిట సబ్సిడీలను ఎత్తివేయడంతో పేదలు ఇక్కట్ల కు గురయ్యారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top