You Are Here: Home » ఇతర » ‘యాపిల్‌’ డివైజ్‌లపై ఎఫ్‌బిఐ నిఘా

‘యాపిల్‌’ డివైజ్‌లపై ఎఫ్‌బిఐ నిఘా

ప్రపంచంలో 1.2 కోట్ల యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుదారులపై అమెరికా ఫెడరల్‌ పోలీసు సంస్థ ఎఫ్‌బిఐ నిఘా పెట్టినట్లు హ్యకర్లు బట్టబయలు చేశారు. ఎఫ్‌బిఐ ఉన్నతాధికారికి చెందిన ల్యాప్‌ టాప్‌ను హ్యాక్‌ చేసి అందులో యాపిల్‌ డివైజ్‌లకు చెందిన యు.డి.ఐ.డిలను ఎఫ్‌బిఐ నిలువ చేసిన సంగతిని హ్యాకర్లు వెల్లడిచేశారు. యు.డి.ఐ.డిలు నిజమైనవే అని చెప్పడానికి ఒక మిలియన్‌ యుడిఐడిలను కూడా తమ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీనిపై యుఫ్‌బిఐ మాకేపాపం తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తుంది.

Hacaయాపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసినవారి కొనుగోలు ప్రవర్తన లపై నిఘా పెట్టడానికి యాపిల్‌ కంపెనీ తమ ఉత్పత్తుల్లో యుడిఐడి టెక్నాలజీని ప్రవేశపెట్టింది. యాపిల్‌ అప్లికేషన్లను తయారు చేసి కంపెనీలకు ఈ యుడిఐడిలను యాపిల్‌ అప్పజెబుతుంది. ఈ టెక్నాలజీయే అమెరికా ప్రభుత్వానికి ప్రజలపై నిఘా పెట్టే సాధనంగా మారిపోయిందని తేలింది. ఈ టెక్నాలజీ చివరకి కొనుగోలుదారుల కార్యకలాపాలపైన నిఘా వేయడానికి పోలీసులకు, గూఢచారులకు సాధనంగా మారి పోయింది. ఎఫ్‌బిఐ అధికారి ల్యాప్‌టాప్‌ను హ్యాక్‌ చేసిన వివరాలను హ్యాకర్లు వివరించారు. యుడిఐడిలతో పాటు వినియోగదారుల పేర్లు, యాపిల్‌ పరికరం పేరు, జిప్‌కోడ్లు, సెల్‌ ఫోన్‌ నెంబర్లు, చిరునామాలు అన్నీ ఎఫ్‌బిఐ అధికారి కంప్యూటర్‌లో భద్రపరిచారని హ్యాకర్లు తెలిపారు.

ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉత్పత్తులు ప్రజా జీననాన్ని సులభతరం చేయడం ఒక అంశం అయితే, ఉత్పత్తుల విని యోగం కంపెనీలు, ప్రభుత్వాలు నిర్దేశించిన పరిధుల మేరకే ఉపయోగించేలా అదృశ్య పరిమితులు నిధించడం మరొక అంశం. ఐఫోన్‌, ఐపాడ్‌లపై నిఘా వేయడం ద్వారా వినియోగ దారుల సమస్త కార్యకలాపాలపై ఎఫ్‌.బి.ఐ. నిఘా వేసిందని తేలింది. యాపిల్‌ వినియోగదారులూ తస్మాత్‌ జాగ్రత్త.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top