You Are Here: Home » ఇతర » యాత్రలు చేద్దాం…

యాత్రలు చేద్దాం…

ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశం. ఇక్కడ ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు మరేదేశం లోనూ లేవు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. కొన్ని ఆలయాలు సంవత్స రంలో కొన్ని రోజులు మాత్రమే దర్శన ప్రత్యేకతను కలిగి ఉంటారుు. ఆ రోజుల్లో అక్కడ దైవదర్శనం చేసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు యాత్రలు చేస్తుంటారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర తరహాలోనే మరెన్నో యాత్రలు కూడా దేశంలో ప్రఖ్యాతి గాంచారుు. భక్తులు ఎన్నో కష్టాలకు లోనవుతూ కూడా ఎంతో ఆనందంగా, భక్తితో ఆ యాత్రలను పూర్తి చేస్తారు. అలాంటి వాటిపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

Unti2
మానససరోవర్‌ యాత్ర
టిబెట్‌ లోని స్వచ్చమైన నీటి సరస్సు. లాసా నుంచి 2000 కి.మీ దూరంలో ఉంటుంది. దీనికి పడమటి వెైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వెైపు కైలాస శిఖరము ఉన్నాయి. మానస సరోవరము సముద్ర మట్టం నుంచి 4556 మీ ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన స్వచ్చమైన నీటి సరస్సు. దాదాపుగా గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధి 88 కి.మీ., లోతు 90 మీ, వెైశాల్యం 320 చ.కి.మీ. ఈ సరస్సులో నీళ్ళన్నీ చలికాలంలో గడ్డకట్టుకొని పోతాయి. మరల వసంత కాలంలోనే తిరిగి నీరుగా మారుతాయి. కైలాసగిరి పర్వత శిఖరం లాగే మానస సరోవరం కూడా యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. భారతీయ ధార్మిక సంప్రదాయం ప్రకారం దీన్ని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు.

ఈ సరస్సులో స్నానం చేసినా, ఆ నీటిని తాగినా అది తమ పాపాలను పటాపంచలు చేస్తుందని యాత్రీకుల విశ్వాసం. ఇందుకు అనుగుణంగా ఏటా కొన్ని వేల మంది ఈ యాత్ర చేస్తుంటారు. హిందూ, బౌద్ధ, జెైన మతాలకు చెందిన వారు కైలాసగిరి ఎంతో పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ఇది సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని హిందువులు విశ్వసిస్తుంటారు. మానస సరోవరం చెంతనే రక్షస్థల్‌ అనే మరో సరస్సు కూడా ఉంది. బ్రహ్మపుత్ర నది పుట్టింది ఈ సరస్సుల నుంచే. గంగా నదికి ఉపనది అయిన కర్నెయిల్‌ నది పుట్టింది కూడా ఇక్కడే.

పండరీపురం యాత్ర
పండరీపురం మహారాష్ట్ర రాష్ట్రంలో షోలాపూర్‌ జిల్లాలో నెలకొంది. మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం భీమా నది) ఒడ్డున ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడి అవతారమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వెైష్ణవ భక్తులు ధ్యానేశ్వర్‌, నామ్‌ దేవ్‌, ఏక్‌ నాథ్‌, తుకారాం, పురంధర దాసు, విజయ్‌ దాస్‌, గోపాల్‌ దాస్‌, జగన్నాథ్‌ దాస్‌ ఈ దేవుడిని కొలిచి తరించారు.
దియోగఢ్‌ యాత్ర
జార్ఖండ్‌లోని ఈ పుణ్యక్షేత్రం బెైద్యనాథ్‌ ధామ్‌ (బడాధామ్‌)గా ప్రసిద్ధి చెందింది. దేవతలు నివసించే స్థలంగా ఇది పేరొందింది. భారత్‌లోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఇక్కడి బెైద్యనాథ్‌ ఆలయం ప్రసిద్ధి చెందింది. భక్తులు సుల్తాన్‌గంజ్‌ నుంచి పవిత్ర గంగాజలం తీసుకువచ్చి శివుడిని అర్చిస్తారు. ఈ యాత్రికులను ‘కన్వారియా’ గా వ్యవహరిస్తారు. 109 కి.మీ. పొడవునా ఈ యాత్ర సాగుతుంది. ఏటా శ్రావణ మాసంలో ఈ యాత్ర జరుగుతుంది. శ్రావణ మేళాను ఘనంగా నిర్వహిస్తారు.

జగన్నాథ రథయాత్ర
ఒడిషాలోని పూరీజగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. పది రోజుల పాటు ఈ రథయాత్ర కార్యక్రమం కొనసాగు తుంది. రథయాత్ర రోజున మాత్రం ఆలయంలోకి హైందవేతరు లను, విదేశీయులను అనుమతించరు.

చార్‌ధామ్‌ యాత్ర
దేశం నలుమూలల ఉన్న బద్రీనాథ్‌, ద్వారక, పూరీ జగన్నాథ ఆలయం, రామేశ్వరంలను చుట్టివస్తూ చేసే యాత్రను చార్‌ ధామ్‌ యాత్రగా వ్యవహరిస్తారు. యమునోత్రి, గంగ్రోతి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రలను కలిపి ఛోటా ధామ్‌ యాత్రగా వ్యవహరిస్తారు.

కైలాసగిరి పర్వత శిఖరం
Untitl45లాగే మానస సరోవరం కూడా యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. భారతీయ ధార్మిక సంప్రదాయం ప్రకారం దీన్ని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేసినా, ఆ నీటిని తాగినా అది తమ పాపాలను పటాపంచలు చేస్తుందని యాత్రీకుల విశ్వాసం. ఇందుకు అనుగుణంగా ఏటా కొన్ని వేల మంది ఈ యాత్ర చేస్తుంటారు. హిందూ, బౌద్ధ, జెైన మతాలకు చెందిన వారు కైలాసగిరి ఎంతో పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ఇది సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని హిందువులు విశ్వసిస్తుంటారు.ఒడిషాలోని పూరీజగన్నాథ రథయా త్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. పది రోజుల పాటు ఈ రథయాత్ర కార్య క్రమం కొనసాగు తుంది. రథయాత్ర రోజు న మాత్రం ఆలయంలోకి హైందవేతరు లను, విదేశీయులను అనుమతించరు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top