You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » యాజ్ఞసేని ఆత్మకథ

యాజ్ఞసేని ఆత్మకథ

యాజ్ఞసేని ఆత్మకథ

 

ప్రదర్శన విషయంలో ఆచితూచి మలచిన తీరు…పద్యనాటక ఒరవడిలో కొత్త పంథాగా చెప్పొచ్చు. పద్య పఠనంలో…సన్నివేశాల రూపకల్పనలో… ఆహార్యంలో… వేషధారణలో పూర్తిగా ప్రయోగాత్మకతను గుప్పించిన నాటకం. ఇది పాత తరానిేకగాక నేటి తరానికి కూడా పద్యనాట కాన్ని అలవాటు చెయ్యాలన్న దృక్పథంతో సంగీత నృత్యభరి తంగా…ప్రయోగాత్మకంగా నాటక ప్రేక్షకుల ముందర ఆవిష్కరించారు.. అదే యాజ్ఞసేని ఆత్మ కథ…
kalaయాజ్ఞసేని జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన అద్భుతమైన నాటకం యాజ్ఞసేని ఆత్మకథ. అనాదిగా స్ర్తీ ఎదుర్కొంటున్న సమస్యను పౌరాణిక పాత్ర మాటున విశదీకరించిన నాటకం ఇది. ఏ కాలంలోనైనా సామాజిక స్థితిగతులను బట్టి స్ర్తీని తదనుగుణంగా వివక్షకు గురిచేయడాన్ని అంతర్నిహితంగా ప్రశ్నించిన యాజ్ఞసేని ఆత్మకథ. స్వర్గారోహణంలో పాండవులతో సమానంగా అడుగు వేయలేకపోయిన తాను తన జీవితంలో కోర్కెలను… సుఖాలను చంపుకుని ఎన్ని విధాలుగా రాజీ పడాల్సి వచ్చిందో వివరించడమే ఈ యాజ్ఞసేని ఆత్మకథ. ద్రుపదుడు ద్రోణాచార్యునిపై పగ తీర్చుకోవడానికి అర్జునుణ్ణి అల్లుడిగా ఒప్పించిన దగ్గరనుండి, అర్జునుడు స్వయంవరంలో మత్యయంత్రాన్ని ఛేదించి అమ్మ అనుజ్ఞకోసం యాజ్ఞసేనిని తీసుకెళ్లడం, ఆ తర్వాత తన ఇష్టాఇష్టాలతో పనిలేకుండా శ్రీకృష్ణుడు, కుంతి, ద్రుపదుడూ కలిసి సోదరులందరికీ తనని పంచడం వంటి ఎన్నో విభిన్న కోణాల్ని ప్రస్థావిస్తుందీ నాటకం.

kala0యాజ్ఞసేని ఆత్మకథ వేసిన సూటి ప్రశ్నలతో…ఐదుగురు భర్తలు తమతమ బలహీనతలతో తనని కట్టిపడేయడం, ధర్మరాజు తనని ఓడి అడవులపాలవ్వడం, జయద్రదుడి బారినపడి తప్పించుకుని, కీచకుడు వంటి వారిని భీమసేనుని సాయంతో చంపడంలాంటి ఎన్నో పరిణామాల్ని దృశ్యబంధనం చేయడమే ఈ నాటకం. అంతేకాదు శ్రీకృష్ణుడు కౌరవులతో పాండవులను యుద్ధానికి సన్నద్ధం చేసేటప్పుడు తనని పావుగా వాడటం, అన్నీ ముగిశాక యుద్ధ జ్వాలల్లో బలైన తన కుమారుల గురించి శోకించడం వంటి అనేక ఘట్టాలను చూపుతూ…ద్రౌపది ఆత్మగా భిన్న కోణాల్లో ప్రశ్నించిన వైనం నిజంగా నాటకరంగ చరిత్రలో ఓ పౌరాణిక పాత్ర ద్వారా మన ముందుకొచ్చిన వినూత్న రచనా సౌరభం. ఇంతకాలం పాంచాలి పంచభర్తృకగా చూసిన ద్రౌపదిని ఒక యాజ్ఞసేని ఆత్మకథగా సహేతుకంగా మలచిన గొప్ప రంగస్థల ప్రయోగమిది.

జనపథం నుంచే జానపద కళలు పుట్టాయి. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం దర్పణం పట్టింది. ఇంకా చెప్పాలంటే నాటకం జీవన ధ్యానమైంది. శ్వాస పీలుస్తూ శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం అంటున్నారు. జీవితాన్ని అనుభవిస్తు జీవితాన్ని దర్శించడం నాటకం ద్వారా సాధ్యమవుతుంది. వర్గ సమాజంలో పాలకులు – పాలితులు ఏర్పడిన తర్వాత, జన జీవితంలో అంతర్భాగమైన జానపదకళలు పాలకులకు వినోద సాధనాలుగా మిగిలిపోయాయి. నాగరికత ముసుగులో అంతరాన్ని సృష్టించి, ఉన్నత జీవితాన్ని అనుసరిస్తున్నామనుకున్న పాలకవర్గం, తమ భావజాలానికి అనుగుణంగా కళలను మలచడానికి తీవ్రంగా కృషి చేసింది. చరిత్ర మనకు చెబుతున్నది అదే. ఇచ్చిపుచ్చుకునే మర్యాదపూర్వక సాంస్కృతిక స్థాయి, ధనస్వామ్య పాలనలో అమ్ముకుని కొనుక్కునే వస్తు సంస్కృతి స్థాయికి దిగజార్చింది.

aashajee1పెట్టుబడిదారీవర్గం యంత్రాలతో పాటు సమాంతరంగా యాంత్రిక జీవితాన్ని అలవాటు చేసింది. ఇక ఇప్పుడు పోటీ మార్కెట్‌ సంస్కృతే జనజీవన విధానమని నేటి ప్రపంచీకరణ పాలక వర్గం ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నది.ఫలితంగా మనిషి శ్రమైక జీవన సౌందర్యం నుండి క్షణక్షణం దూరమవుతున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిలో మనిషితనం లోపించి పరారుూకరణం చెందుతున్నాడు. ఆట పాటలేని జీవితం రసహీనంగా మారింది. సమిష్టి ఆనందంలోని రసరమ్యమైన సామాజిక సాంస్కృతిక అల్లిక (ఫ్యాబ్రిక్‌) గల్లంతయి పోతున్నది. జీవితానికి ప్రతిబింబమైన నాటకం కూడా అంతే. పొడి పొడి మాటలకే పరిమితమై పోతున్నది.

స్నేహిత సంస్థ వార్షికోత్సవ సందర్భంగా ఇటీవల రవీంద్రభారతిలో యాజ్ఞసేని ఆత్మకథ పద్యనాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు.

జనపథం నుంచే జానపద కళలు పుట్టారుు. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం దర్పణం పట్టింది. ఇంకా చెప్పాలంటే నాటకం జీవన ధ్యానమైంది. శ్వాస పీలుస్తూ శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం అంటున్నారు.

 

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top