You Are Here: Home » ఇతర » యాంకర్ టు రైటర్

యాంకర్ టు రైటర్

‘వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు..ఆ నానుడిని నిజం చేస్తూ ఎంతోమంది వైద్యులు ఇప్ప టికీ ప్రాణాలు పోస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవ సర సమయాల్లో ఎంతో మంది రోగులకు సరైన చికిత్స ప్రాణాలు కాపాడే వారే వైద్యులు. దేవుని తరువాత అందరూ వైద్యు లపైనే ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. వైద్యరంగంలో ఎంతోమంది వైద్యులు తమ కుటుం బాలను పక్కన పెట్టి మరీ వైద్యవృత్తికి అంకితమైన వారూ ఉన్నారు. మన రాష్ట్రానికిి చెందిన ఎంతోమంది వైద్యులు రోగులకు ‘లైఫ్‌ సేవర్స్‌’గా మారుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యులైన వారి జీవన చిత్రాలను ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌ మాధవి సిద్దం తనదైన శైలిలో రచించారు. ఏడాదిపాటు విరామం లేకుండా ‘లైఫ్‌ సేవర్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని అందు బాటు లోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ సోమాజిగుడలోని ఫార్ట్యూన్‌ కత్రియ టల్‌లో నేడు (ఆదివారం) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ‘ధీర’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..

DSC54 అతివలు అన్ని రంగాల్లో కెరటాల్లా దూసుకువస్తు న్నారు. అంతరిక్షం నుంచి అభ్యుదయ రచనల వరకు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఏ రంగం లోనూ తాము తీసిపోమంటూ ప్రగతిపధంలో పయనిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్‌టివి, వనిత టెలివిజన్‌ ఛానల్స్‌లో లక్షలాది మంది ప్రేక్షకులకు సుపరిచతమైన ప్రముఖ యాంకర్‌ మాధవి సిద్దం ‘లైఫ్‌ సేవర్స్‌’ పుస్తకాన్ని రచించారు. సీనియర్‌ రిపోర్టర్‌గా, ప్రజెంటర్‌గా, న్యూస్‌ రీడర్‌గా, స్క్రిప్ట్‌ రైటర్‌ ఎన్నో పాత్రలు పోషిస్తోన్న మాధవి సిద్దం ఎన్నో తెలుగు దినపత్రికలు, మ్యాగజైన్స్‌లో హెల్త్‌ ఆర్టికల్స్‌ను రాశారు.

సకళ…
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మాస్టర్స్‌ ఇన్‌ కామర్స్‌ పూర్తి చేసిన మాధవి సిద్దం లెక్చరర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంతోమంది విద్యార్ధులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలను రాసేలా వారిని తీర్చిదిద్దారు. మాధవి రచయిత కావడంతో పాటు కూచిపూడి నృత్యకారిణిగా కూడా ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. వైద్యరంగంలోని విద్యార్ధులు, మెడికోలు, జూనియర్‌ డాక్టర్లు, ఇలా ప్రతి ఒక్కరికీ ఇది ‘కాఫీ టేబుల్‌’ బుక్‌గా నిలుస్తుందని చెబుతోంది మాధవి. ఈ లైఫ్‌ సేవర్స్‌లో నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు, గ్లోబల్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కంచర్ల రవీంద్రనాధ్‌, కేర్‌ ఆసుపత్రి ఎండి డాక్టర్‌ భూపతిరాజు.

సోమరాజు, ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ గుళ్లపల్లి ఎన్‌ రావు, సన్‌షైన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.వి గురవారెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ యలమంచలి సవితాదేవి, డాక్టర్‌ గోపీచంద్‌ మన్న, డాక్టర్‌ చిగురుపాటి మోహనవంశీ, డాక్టర్‌ ఎజికె గోఖలే, డాక్టర్‌ బూర నరసయ్య, డాక్టర కె. అనూరాధ, డాక్టర్‌ సవితా దేవి, డాక్టర్‌ కాసు ప్రసాదరెడ్డి వంటి ఎందరో ప్రముఖుల జీవితాలను ఆవిష్కరించారు మాధవి.

సమాజ హితం కోసమే…
వైద్య రంగంలో ఉన్న వైద్యులు నిత్యం ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. ప్రాణాపాయ స్తితిలో తమ వద్దకు వచ్చే వారికి వైద్యం చేయడంలో వారు తలమునకలవుతారు. అలాంటి వైద్యులు ఆ సమయంలో పడే తపన ఎంతోమంది కుటుంబాల కన్నీళ్లు తుడుస్తుంది. లక్షలు ఇవ్వకపోయినా ప్రాణం కాపాడిన వైద్యుడిని దేవుడిగా కొలుస్తారు జనం. అందుకే వైద్య వృత్తిలో ఉన్న వారిని కష్టనష్టాలను స్వయంగాచూసి ఈ పుస్తకం రచించానని చెబుతోంది రచయిత్రి మాధవి. కుటుంబ సభ్యులు, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మెరైన్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన భర్త, స్నేహితులతోపాటు ఎన్‌టివి ఛైర్మన్‌ నరేంద్రనాధ్‌ చౌదరి ప్రోత్సాహంతో ఏడాదిపాటు రాత్రీ, పగలు తేడా లేకుండా ఈ పుస్తకం కోసం శ్రమించానని అంటోంది.

పుస్తకం రాస్తున్నపుడు వైద్యుల జీవితం ఎలా ఉంటుందో.. అర్ధమైంది.. హార్డ్‌ అవర్స్‌లో ఇంటర్వ్యూలు చేసి ఓ లక్ష్యం సాధించా. బిజీలైఫ్‌స్టైల్‌లోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఇప్పటికి పూర్తిచేసా..’ అని చెప్పుకొచ్చారు మాధవి. పుస్తకం రాయడమన్నది నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా వారు పడే కష్టాలను ఆవిష్కరించానంటారు ఆమె.

డాక్టర్‌ కాబోయి యాంకర్‌గా…
చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ యాంకర్‌ అయ్యా. తేజ, జెమిని టెలివిజన్‌ఛానల్స్‌లో తొలుత పనిచేసి ప్రస్తుతం ఎన్‌టివి, వనిత ఛానల్స్‌లో హెల్త్‌ షోలను నిర్వహి స్తున్నా. భారత్‌లో రోగులు-వైద్యుల నిష్పత్తి తక్కువ. అదే అమెరికా, యుకె తదితర దేశాల్లో అయితే ఈ సమస్య లేదు. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో స్వయం గా చూస్తే తెలిసిందంటారు మాధవి. అక్కడ తొలుత ఫిజీషియన్‌కు చూపించి తరువాత ఏ డాక్టర్‌ వద్ద చూపించాలో తెలుసుకుని వెళతారు. కానీ ఇక్కడ పరి స్థితి అంతా విచిత్రం. ఎవరికి వారే సొంత వైద్యం. నెట్‌లో వైద్యుల సలహాలతో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని చెబుతు న్నారు మాధవి.

‘లైఫ్‌సేవర్స్‌’ ఆవిష్కరణ…
శ్రీ విశాల్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో అప్నా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లైఫ్‌ సేవర్స్‌’ పుస్తకాన్ని ఆదివారం రాత్రి 7గంటలకు హైదరాబాద్‌ సోమాజిగుడలోని ఫార్ట్యూన్‌ కత్రియా హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మంత్రులు కొండ్రు మురళి, గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌. ఎస్‌ సలూజాతో పాటు ప్రముఖులు, వైద్యులు హాజరు కానున్నారు.

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మాస్టర్స్‌ ఇన్‌ కామర్స్‌ పూర్తి చేసిన మాధవి సిద్దం లెక్చరర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంతోమంది విద్యార్ధులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలను రాసేలా వారిని తీర్చిదిద్దారు. మాధవి రచయిత కావడంతో పాటు కూచిపూడి నృత్యకారిణిగా కూడా ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. వైద్యరంగంలోని విద్యార్ధులు, మెడికోలు, జూనియర్‌ డాక్టర్లు, ఇలా ప్రతి ఒక్కరికీ ఇది ‘కాఫీ టేబుల్‌’ బుక్‌గా నిలుస్తుందని చెబుతోంది మాధవి.

-ఇస్కా రాజేష్‌బాబు, ‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top