You Are Here: Home » ఇతర » యవ్యనంగా ఉండాలంటే…

యవ్యనంగా ఉండాలంటే…

Youngవయసు మీద పడినా నిత్య యవ్వనులుగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే రోజూ ఉసిరికాయ తినండని వెైద్యులు చెబుతు న్నారు. రోజూ ఒక ఉసిరికాయ తీసుకుంటే యంగ్‌గా ఉండొచ్చును. ఇంకా, ఉసిరికాయ లోని విటమిన్లు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఉసిరికాయలో సి విటమిన్‌ వుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, విటమిన్‌ బి కాంప్లెక్స్‌ వంటివి ఉన్నాయి. ఇవి నీరసం, అలసటను తగ్గిస్తాయి. అంతే కాకుండా ఉసిరికాయ జ్యూస్‌ తీసుకుంటే అలసత్వానికి చెక్‌ పెట్టవచ్చునని వెైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరానికి చలువనిస్తుంది. శిరోజాలను సంరక్షిస్తుంది. అందుకే ప్రస్తుత హెయిల్‌ ఆయిల్‌ బ్రాండ్లలో ఉసిరికా య కీలక పాత్ర పోషిస్తోంది. ఎసిడిటీ, జీర్ణ సంబంధిత వ్యాధులకు రోజువారీగా ఉసిరికాయ పొడిని లేదా జ్యూస్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరికాయ గుండెకు ఎంతో మేలుచేస్తుంది. హౄఎద య కండరాలను పటిష్టం చేస్తుంది. రక్తంలోని హీమో గ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. ఉసిరిలో యాంటీ-బ్యాక్టీ రియా లక్షణాలను కలిగివుండటం ద్వారా మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరం లోని ఉష్ణాన్ని తగ్గించి, వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top