You Are Here: Home » ఇతర » యక్షగాన కళా సరస్వతి చిందు ఎల్లమ్మ

యక్షగాన కళా సరస్వతి చిందు ఎల్లమ్మ

చిందు యక్షగానాల కళా సరస్వతి, తెలంగాణ మెన్నత కళా మూర్తిమత్వం పేరే చిందు ఎల్లమ్మ. 1923లో ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో మాదిగ ఉపకులమైన చిందు కులం లో జన్మించారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ మండలంలోని ఆమ్దాపురం గ్రామంలో స్థిరపడ్డారు. ఆమె అసలు పేరు సరస్వతి. రేణుకాదేవి వారి కులదైవమైనందున ఆమె పేరు ఎల్లమ్మగా మార్చారు. చిన్నప్పట్నుంచే యక్షగానాన్ని ఆలపించేవారు ఆమె.

Unta16వ ఏట మొదటిసారిగా నాయిక పాత్రను ధరించారు. ఈమె స్ర్తీ, పురుష పాత్రలను తన అభిన యంతో రక్తి కట్టించేవారు. సాక్షాత్తూ నాట్యాచార్య నటరాజ రామకృష్ణ ఆర్మూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈమె అద్భుత అభినయాన్ని చూసి విస్మయం చెందారు. ఆయన తన ఒంటి మీద ఉన్న ఖరీదెైన శాలువాను తీసి అక్కడికక్కడే ఆమెను సన్మానించడం విశేషం.చిందు ఎల్లమ్మ చిన్నతనంలోనే రంభ వంటి వేషాలు కట్టి అందరినీ ఆకట్టు కునేది. మగ పాత్రలనూ పోషించి రక్తి కట్టించేది. సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, చెంచులక్ష్మీ లాంటి స్ర్తీ పాత్రలు ధరించి కోమలంగా హొయలొలికిస్తుంది. అర్జునుడు, నరసింహుడు, వాలి, శంకరుడు లాంటి పురుష పాత్రలలో గాంభీర్యాన్ని రాజసాన్ని తొణికించారు.

నిమిషాల తేడాతో రెండు పాత్రలను ఆడి మెప్పిం చడం ఆమె నటనా కౌశల్యానికి ఆనవాలు. చెంచు లక్ష్మీగా చెట్టు లెక్కగలవా… అంటూ సుమ సుకుమారిలా లాలిత్వాన్ని ముగ్ద మోహనంగా అభిన యించే చిందు ఎల్లమ్మ ఐదు నిమిషాలు తేడాతో నరసింహు స్వామి వేషం కట్టి ఆ పాత్రలో ఒదిగి పోయి నన్ను పెండ్లాడదవే చెంచితా…నీ పాదములు పట్టెదను చెంచితా… అంటూ పురుష సహ సిద్ధ గాంభీర్యాన్ని, అంగి కాన్ని ప్రదర్శించి మన్ననలు అందుకుంది. గాంధర్వ గానంతో ఆసమాన నటనతో, అపురూ పంతో ఏ పాత్ర చేసినా అందులో జీవించేది. ఆ దేవతా మూర్తులను కళ్ల ముందే భ్రమింపజేసేది. జిగేల్‌ మనే ఆభరణాలు రంగు రంగుల ఆహార్యం, అబ్బుర పర్చే అంగికం, ఇరువెై మంది కళాకారులు ఆరు గంటల వరకు ప్రదర్శన సాగేది. ప్రతి ఊళ్లో రెండు ప్రదర్శనల తర్వాత దళిత దెైవమైన ఎల్లమ్మ కథ ఆడటం రివాజు.

తన జీవితాంతం అలుపెరగక శ్రమించి చిందు భాగోతానికి, యక్షగానానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టిన ఈ కళా తపస్విని 2005 నవంబర్‌ 9న తుది శ్వాస విడిచారు. ఆ మహోన్నత కళాకారిణికి బతుకమ్మ నీరాజనాలు…ఊళ్లో రెండు ప్రదర్శనల తర్వాత దళిత దెైవమైన ఎల్లమ్మ కథ ఆడటం రివాజు. చిందు ప్రదర్శన వల్ల ఊరంతా సస్యశ్యామలంగా ఉంటుందనేది గ్రామీణుల నమ్మకం. కరెంటు దీపాల మధ్య పట్టుకొని అడుక్కుంటారు. హరిశ్చంద్ర పాత్రలో సర్వం దానం చేసి దాతృత్వాన్ని అభినయించిన కళాకారుడు ఆ ఊరి దొర ఇంటి ఎదుట ‘ఓ పాత అంగి ఉంటే ఇప్పించండి’ అని ఆర్థించడం విషాదం. ఇదే జీవన విధానం. మా కళను… మా ఆటను… మా పాటను లోకానికి అర్పిస్తాం. అంటారు.

ఎల్లవ్వ వేషం వేసిందంటే అచ్చం దేవత దిగినట్లే. శరీరమంతా బొట్లు… తెల్ల చీర, తెల్ల రెైక… ఒడి బియ్యంతో నడుస్తుంటే ఊరంతా ఆమె వెనుకనే వచ్చేదని చెప్పుకుంటారు. తన జీవితాన్ని యావత్తూ చిందు కళా సేవకే అంకితం చేసిన పరిపూర్ణ కళాకారిణి. జానపద కళామతల్లికి నిలు వెత్తు నిదర్శనం. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన చిందు భాగవత కళాకారిణి. చిందుని యింటి పేరు చేసుకొని తనభినయించిన ఎల్లమ్మ పాత్రని సొంత పేరు చేసుకొని తనకంటూ ఏమీ మిగుల్చుకోలేక కళకే అంకితమైన సరస్వతిని నేటికీ మరువలేకపోతున్నారు ప్రజలు. ‘తాలెళ్లాలో …శివతాలెళ్లాలో’…మాదిగనయ్యా…. మాదిగని అనే అంటి ముట్టరాని రాజుల వద్ద కళ్యాణి కున్నది నా వారు. నే అంటి ముట్టరాని రెడ్డి కులంలో బారెడు జోడయ్య నా వారు. నే అంటి ముట్టరాని కోమట్ల వద్ద నట్ట నడింట్ల నా వారు.

నే అంటి ముట్టరాని బ్రాహ్మణకులంలో జంజానికున్నది నా వారు’ ఇట్లా అన్ని కులాలకూ, వృత్తు లకు తోలు వారు వస్తువులుగా అందించే మాదిగల మీద ఆధారపడి ఉన్నదని, వెైదిక,బ్రాహ్మణ, హిందూ మతాల సృష్ట్టి వాదన తప్పని చెప్పే ఉగ్రమైన తిరుగుబాటు కళారూపం చిందు భాగవతం. ఈ పాపానికి రూపమిచ్చి ఉర్రూతలూగించిన ఎల్లమ్మ బోధన్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామం నిజామా బాద్‌ జిల్లా వాసి. 11 సంవత్సరాల వయస్సులోనే ఆమెకు వివాహం జరిగింది. కానీ చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వెైవాహిక జీవితానికి స్వస్తి పలికింది. తన వల్ల తన భర్త నష్ట పోకూడదనే ఉద్దేశ్యంతో స్వయంగా చెల్లెలు రావమ్మను ఇచ్చి తన భర్తకు వివాహం చేసింది. చిందు భాగవతంలో ప్రధాన పాత్రలు పోషించేవారు పవిత్రంగా ఉండాలనేది ఆమె విశ్వాసం.

జీవితంలో కడు బీదరికం, ఆకలి, అవమానాలకు అధిగమించి చిందు భాగవత యక్షగాన సంప్ర దాయాన్ని దశాబ్ధాలుగా పదిలపరిచి ముందు తరాలకు అందించింది. చిందు ప్రదర్శనలతో సంచార జీవితం గడిపే కుటుంబం సభ్యులతో ఊరూరా తిరుగుతూ రాగాలు.. తాళాలు… పాటలు, పదాలు … ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో సమానమై కఠోర శిక్షణతో, నృత్యగానాలను ప్రదర్శించే కళాకారిణిలను జోగినులుగా సంబోధిస్తారు. జాంబవంతుడనే రాజు నీలారు కన్యక అనే జోగిత తమ వంశానికి మూలమైన జంట అని వీరి నమ్మకం. హరిజనులపెై ఆధారపడి జీవించే కళాకారుల తెగ వీరిది. సరళమైన భాష, సులభతరమైన తాళ, లయ, విన్యాసం చిందులు ఆటలు బహుజన రంజకం. చిందు ప్రదర్శన వల్ల ఊరంతా సస్యశ్యామలంగా ఉంటుందనేది గ్రామీణుల నమ్మకం. కరెంటు దీపాల మధ్య పట్టుకొని అడుక్కుంటారు.

హరిశ్చంద్ర పాత్రలో సర్వం దానం చేసి దాతౄఎత్వాన్ని నిర్వచనాన్ని అభినయించిన కళాకారుడు ఆ వూరి దొర ఇంటి ఎదుట ’ఓ పాత అంగి ఉంటే ఇప్పించండి’ అని ఆర్థించడం విషాదం. ఇదే జీవన విధానం. మా కళను… మా ఆటను… మా పాటను లోకానికి అర్పిస్తాం. అంటారు. ఎల్లవ్వ వేషం వేసిందంటే అచ్చం దేవత దిగినట్లే. శరీరమంతా బొట్లు తెల్ల చీర, తెల్ల రెైకా ఒడి బియ్యంతో నడుస్తుంటే ఊరంతా ఆమె వెనుకనే వస్తుండేవారు. మంగళ వాయిద్యాలతో డప్పుల చప్పుళ్లతో ఊరంతా పండుగ వాతావరణం ఉండేది. పెత్తనం చేసేది మగ వాడయితే ఆ పాత్ర నేనే ఎందుకు వేయకూడదు. అనుకొని ఆక్రోశంతో పురుష పాత్రలోని గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top