You Are Here: Home » ఇతర » మోడల్‌ ఫొటోగ్రఫీ క్రేజ్

మోడల్‌ ఫొటోగ్రఫీ క్రేజ్

F1 మోడల్‌ ఫొటోగ్రఫీ అంటే సులభం కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. మనిషి ప్రతిబింబాన్ని విచిత్ర రూపాల్లో చిత్రీకరించి మెచ్చుకునేలా తీయడమే మోడల్‌ ఫొటోగ్రఫీ. అందుేక ప్రతి ఫొటోలోనూ కొత్తదనం కనిపించేలా ఉండాలని ఫొటోగ్రాఫర్‌ నిరంతరం శ్రమిస్తాడు. మోడలింగ్‌ రంగంలోకి రావాలనుకునే యువతీ, యువకులకు ఈ ఫొటోషూట్‌లు ఎంతో అవసరం. వేల రూపాయలు వెచ్చించి మరీ ఫొటోలు తీరుుంచుకుని మోడలింగ్‌లో అవకాశాల కోసం యువత పరుగులు తీస్తోంది. ఇందుకు తగ్గట్లుగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మోడలింగ్‌ ఫొటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా స్టూడియోలు వెలుస్తున్నారుు. కాలేజీలో చదువుతూనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు నేటి యువతరం ఉవ్విళ్లూరుతోంది. దీంతో మోడలింగ్‌ ఫొటోగ్రీఫీకి ్రేకజ్‌ పెరుగుతోంది. ఆ వివరాలు ఈ వారం ‘స్టైల్‌’లో మీ కోసం…’

13FEA-Fఫొటోలు తీయడం కూడా ఒక కళ. తమ మేధస్సుతో తీసే ఆ చిత్రాలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. అందరూ తీసే ఫొటోల కు భిన్నంగా ఉంటేనే వాటికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ ఇటీవలి కాలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మారు తున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ రంగంలోకి అడుగుపెట్టేవారి సంఖ్య కూడా పెరుగు తోంది. తమ కెమెరాలతో అత్యద్భుత ఫొటోలను చిత్రీకరించేందుకు పోటీపడుతున్నారు. మోడలింగ్‌ రంగంలో అవకాశాల కోసం వచ్చే వారి నుంచి సినిమాల్లో నటించాలని కలలు కనే యువతీ, యువకులకు ప్రత్యేకంగా ఫొటోలను తీసేందుకు భాగ్యనగరంలో ప్రత్యేకంగా స్టూడియోలు వెలుస్తున్నాయి. విభిన్న రూపాల్లో వారిని అబ్బురపరిచేలా ఫొటోగ్రాఫర్లు వారి ఫోటోలను తీస్తున్నారు. సినిమాలు, టెలివిజన్‌ సీరియల్స్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫోటోషూట్‌లు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన యూత్‌కు ఇవి అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి.

వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత
13FEAfF1ఇతర ఫొటోల కన్నా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఫొటోలకు ఎంతోస్ధానం ఉంటుంది. జీవితాంతం గుర్తుండే తీపి గురుతులుగా ఉండే వీటి విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కలకాలం తమ జ్ఞాపకాలుగా ఉండాలని పరితపిస్తారు. ఈ తరుణంలో వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫొటోలు సరికొత్త రీతిలో తయారవుతున్నాయి. దంపతులకు కలకాలం తీపి గురుతులుగా ఇవి మిగిలేలా ఫోటోలను తీర్చిదిద్దుతున్నారు. మరింకెందుకు ఆలస్యం. మీకు ఇష్టమైన ఫొటోలు తీయించుకునేందుకు సిద్ధం కండి మరి.

ఫ్యాషన్‌షోలతో పెరుగుతున్న ఆసక్తి
భాగ్యనగరంలో జరుగుతున్న ఫ్యాషన్‌షోలను సైతం తిలకిస్తున్న యూత్‌ వారిలాగా తామూ ర్యాంప్‌పై కనిపించాలన్న తపన పెరుగుతోంది. దీంతో ఎంత ఖర్చయినా సరే ఫోటోషూట్‌ చేయించుకుని ఆల్బమ్‌లను తయారుచేసుకుని అవకాశాల కోసం పరుగులు తీస్తున్నారు. సినిమాల్లో కాకున్నా టెలివిజన్‌ సీరియల్స్‌, ప్రముఖ సంస్ధల ఉత్పత్తుల్లోనైనా అవకాశం వస్తుందన్న ఆశతో ఫోటోస్టూడియోల బాట పడుతున్నారు. అలాంటి వారి కోసమే ప్రత్యేక సెట్టింగ్‌లతో ఫోటో స్టూడియోలు వినూత్న రూపాల్లో వారిని చిత్రీకరిస్తున్నాయి. కొన్ని ఫొటోలు చూడగానే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎంతో నైపుణ్యంతో ఆ ఫొటోగ్రాఫర్‌ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే ఫొటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత పెరుగుతోంది. చిత్రకళతోపాటు ఫొటో ప్రదర్శనలకు కూడా భాగ్యనగరం వేదికగా మారుతోంది.

ఇస్కా రాజేష్‌బాబు, ‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, శరత్‌, ఎ. రమణాచారి

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top