You Are Here: Home » ఇతర » మోక్ష మార్గం

మోక్ష మార్గం

ముకో్కటి నాడు ముకో్కటి వ్యవహారాలున్నా మానుకొని శ్రీమహావిష్ణూవుని ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తే ముకో్కటి దేవతలూ దీవిస్తారు. మాసంలో వచ్చే ప్రతి ఏకాదశి ముఖ్యమైనది. మన మనస్సుని, బుద్ధిని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైన అంశం. అరుుతే పుష్యమాసపు శుక్ల ఏకాదశికి ఒక వైలక్షణ్యం ఉంది. దీనిేక వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముకో్కటి దేవతలు అని మన శాస్త్రాలు చెబుతారుు. వారంతా స్వామిని సేవించుకొని తాము తరించాము అని భావిస్తారు. భగవంతుడు ఉత్తర ద్వారాలు తెరిపించి వైకుంఠంలోంచి బయలుదేరి కోరుకున్న వారిని ఆ ద్వారం నుండి లోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడతారు. ఇది ఈ నాటి ప్రత్యేకత. వారు ఎలాంటి వారైనా సరే, పుణ్యాత్ములా…పాపాత్ములా అనే ప్రశ్నే లేదు. ఎవడైతే స్నానమాచరించి స్వామి నామాన్ని తలుస్తాడో వాడికి మోక్షం ఇస్తాడట. అందుేక ఈరోజు కాకి కూడా స్నానం చేస్తుంది. సామాన్యంగా ఈ రోజు ఎవరిపైన కోపం వచ్చి ఉపనాసం చేసినా మోక్షమే. అంత పవిత్రమైన రోజు ఈ రోజు. హిందువుల పండుగలలో వైకుంఠ పద పూర్వములైనవి రెండు ఉన్నారుు. ఒకటి వైకుంఠ చతుర్థశి. రెండోది వైకుంఠ ఏకాదశి. దీన్నే తెలుగువారు ముకో్కటి ఏకాదశిగా వ్యవహరిస్తారు.

ముక్కోటి అంటే?
Vaikunta-(2)ఈ ఏకాదశికి ఈ పేరు వచ్చింది? మూడు (సంస్కృతం) కోటి ప్రాణగొడ్డం వంటిది. మూటికి కోటికి సంబంభ మేర్పడిన తర్వాత ఏకాదశి కలుసుకొన్నది. ముక్కోటి అనగా మూడుకోట్లు. మూడు కోట్ల దేవతలు ఈ రోజున వెైష్ణవ దివ్యక్షేత్రాలను చేరతారని ప్రతీతి. దేవతల సంఖ్య ముప్పది మూడుకోట్లు గదా? మూడు కోట్లకే లెక్క వచ్చిన ఎడల మిగిలిన ముప్పది కోట్లకి ఏకాదశి ముఖ్యం కదా? ముక్కోటి ఏకాదశి పవ్త్రికు ఏమిటి? విష్ణూవు వెైకుంఠం నుండి మూడు కోట్ల దేవతలతో ఈ రోజు భూలోకానికి వచ్చాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు. కానీ ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత కలది కావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ఈ రోజు ప్రాముఖ్యం ఎందుకు?
23Col-Fవెైకుంఠ ఏకాదశి రోజే ఎందుకైంది ఇంత పవిత్రం ఈ రోజు? ఎందుకు పరమాత్మ ఉత్తర ద్వారంలోంచే రావాల్సి వచ్చింది. తూర్పు ద్వారం లేదా? ఏ కారణంగా ఉత్తర ద్వారం తెరువాల్సి వచ్చిం ది? ఈ విషయాన్ని మనకు శ్రీపంచరాత్ర ఆగమ సంహి తల్లో శ్రీ ప్రశ్నం అనే ఒక సంహిత ఒక అందమైన విషయా న్ని తెలుపుతుంది. ఒకనాడు భగవం తుడు సృష్టి చేద్దాం అని అనుకున్నాడు. సృష్టి అనేది ఆయన నేరుగా చేయడు. సృష్టి అనేది రెండు విడతలుగా చేస్తాడు. కొంత తాను నేరుగా చేస్తాడు. మిగతాది ఒకరి ద్వారా చేయిస్తాడు. తాను మొదట ముడిపదార్థాన్ని తయారు చేసి ఇస్తాడు. దాన్ని తయారుచేసే విధానం ఇతరకు రహస్యంగానే ఉంచుతాడట. దాన్ని తాయారు చేసే విధానం వేదాల్లో ఉంటుంది. కానీ దాని అర్థం చేసుకోవడం ఎవర్వరికీ రాదట. పాలకడ లిలో పవళించి ఉన్న పరంధాముడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం. కావల్సిన భోగ, భోగ్య, భోగ ఉపకరణ వస్తువులని తయారు చేసి, తన నాభిలోంచి బ్రహ్మగారిని బయట కు తీస్తాడు.

అంటే సృష్టికి అవసరమైన పంచభూతాలని, కావల్సిన వస్తువులని తయారు చేసి, ఇకపెై సృష్టి చేయడానికి బ్రహ్మగారిని నిర్ణయించుకుంటాడు. ఆయనకు వేదం చెప్పి సుర, నర తిర్యక్‌ స్థావరాలను సృజింపచేస్తాడు. బ్రహ్మగారికి సంశయాలు ఏర్పడితే తొలగిస్తూ ఉంటాడు. వేద ఉపదేశం ద్వారా, అయితే అప్పుడప్పుడూ బ్రహ్మ పరాకు వల్ల వేదాన్ని కోల్పోతే తాను ఆయా పరిస్థితి బట్టి ఒకసారి చేపవలె. ఒకసారి హంసవలె, ఒకసారి గుర్రంవలే ఎన్నో రూపాలు దాల్చి వేద ఉపదేశం చేశాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కో కల్ప ఆరంభం అయినప్పుడు ఒక్కోసారి వేదోపదేశం చేస్తాడు పరమాత్మ. అయితే వేదాన్ని కొంత అశ్రద్ధతో వింటే, జరిగే సృష్టిలో కొంత తప్పులు ఏర్పడతాయి. బ్రహ్మగారు చేసే అశ్రద్ధ గురించి శ్రీసుఖ మహర్షి పరిక్షిత్తుతో చెబుతాడు భాగవతంలో. ఇట్లా బ్రహ్మగారికి వేద ఉపదేశం అనేది ఎన్నో సార్లు చేస్తాడు పరమాత్మ.

సృష్టికి…
Vaikunta-(4)ఇలా ఓసారి బ్రహ్మ పరాకుతో విన్నాడట. అప్పుడు ఆయన చెవుల్లోంచి ఇద్దరు వచ్చారట. వారి పేర్లు మధు మరియూ కైతభ. విజ్ఞానాన్ని మనం చెైతన్యమూర్తులని భావిస్తాం. బ్రహ్మ ఉపదేశం చేసిన వేదం మానవ ఆకృతి దాల్చి ఉన్న నలుగురు బాలకుల వలె ఉందట. ఆ నలుగురిని ఎత్తుకొని ఈ మధు కైతభ అనే అసురులు వెళ్లిపోయారు. వారిని సముద్రంలో దాచి ఉంచారు. భగవంతుడు బ్రహ్మకు ఉపకారం చేయడానికి మశ్చ్య రూపం దాల్చి వారితో పోరాడాడు. అయితే వారు పుట్టింది సరియైన సృష్టికార్యంలో కాదు. వారు అసురీ ప్రవృత్తి కలిగి ఉన్నారు. ఎంతకూ చావడం లేదు. అయితే ఇంత దెబ్బలాట ఎందుకు అని భగవంతుడు వారిని వేదాలను అందిస్తే ఒక వరం ఇస్తా అని చెప్పాడు. దానికి తోడు మరొక వరం వారే అడిగాడు. అందుకు ఒప్పుకున్నాడు పరమాత్మ. మొదటి వరంగా భగవంతుణ్ణి తనకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. అసుర ప్రవృత్తి కలవారికి మోక్షం ఎలా వస్తుంది.

మోక్షానికి ఒక మార్గం ఉంది. పరమపదానికి వెళ్ళాలంటే అర్చిరాది మార్గాల్లో ఇలా పన్నెండు లోకాలని దాటుతూ విరజానది దాటి ఐరంమదం అనే సరస్సులో అలకరించుకొని కదా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ ఏర్పర్చినవే కానీ నియమాలని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం ఆడే ఆటల్లో నియమాల్ని మనమే పెట్టుకుంటాం. నియమాలని విడిచి ఆడే ఆటలో ఉత్సాహం అనేది ఉండదు. అట్లానే భగవంతుడు తాను ఏర్పచిన నియమాలని విస్మరించడు. కానీ ఈ అసురులు ఇద్దరూ మోక్షం కావాలనే కోరారు. అందుకు భగవంతుడు ఒక సులభమైన ఒక ఉపాయం వెతికాడు. వెైకుంఠానికి ఉత్తరం వెైపు ద్వారాలని తెరిపించి ఆయన వచ్చి వారిని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు.అసలు మోక్షాన్ని ఎవరు కోరుతారు.

వెైకుంఠ ద్వార ప్రతీతి
Vaikunta-Dwaramఉత్తర ద్వారం గుండా వెళ్లి వెైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వెైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడెైన మహావిష్ణూవు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వెైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవెై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణూవుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వెైకుంఠ ఏకాదశి నాడు ‘వెైకుంఠ ఏకదశీ వ్రతం’ ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వెైఖానసుడనే రాజు ఈ వత్రాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలగించాడని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యుని ఉత్తరాయణానికి…
సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వెైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశినాడు చేసే విష్ణూపూజ, గీతాపారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.

పరమపదం
Vaikunta-(1)అయితే పరమపదంలో ఉన్న స్వామిని మనం ఎట్లా చూడగలం. అయితే భగవంతుడు ఉండేది ఐదు స్థానాలో. పరమపదంలో ఆయనే ఉంటాడు. పాలకడలిలో ఆయనే ఉంటాడు. అవతారాల్లో ఆయనే ఉంటాడు. మనలో అంతర్యామిగా ఆయనే ఉండాడు. ఈ నాలుగు స్థానాలు అందరికీ ఉపకరించవు. అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికే విగ్రహ రూపంలో ఉంటాడు. పరమపదంలోకి స్వామికి ఆర్భామూర్తికి తేడా లేదు అని పాంచర్త్రా ఆగమాలు తెలిపాయి. అందుకోసమే ఈ రోజు ఆలయాల్లో స్వామి ఉత్తర ద్వారం ద్వారా బయటకు వచ్చి మండపంలో ఉన్న భక్తులని తీసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండానే లోనికి వెళ్తాడు. అట్లా వచ్చే స్వామిని సేవిస్తే చాలు. భూమిమీద మొదటగా అవతరించిన అర్చామూర్తి అయిన శ్రీరంగనాథుడు కూడా బయటకి వచ్చి భక్తులని తరిపంచేస్తాడు. అట్లానే అనేక స్థానాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు అనేక ఆలయాల్లో. స్వామి ఉన్న గర్భాలయాన్ని పరమపదం అనే భావిస్తారు. స్వామి అర్చా రూపంలో వచ్చినా ఆయన పూర్ణత్వంలో లోటు ఉండదు. అట్లా వచ్చే స్వామిని సేవించుకుంటే చాలు తరించిపోతాం. దానికి తోడు ఆయన నామాల్ని పాడితే ఆయనెంతో సంతోషిస్తాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top