You Are Here: Home » చిన్నారి » మొదట ‘టీ’ తాగిందెవరు?

మొదట ‘టీ’ తాగిందెవరు?

ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే తప్పకుండా వినిపించే మాట ‘టీ తాగుతారా?’ అని. చాలామందికి టీ లేకుండా రోజు గడవదు. మరి అలాంటి స్థానం సంపాదించుకున్న టీ ఎప్పటి నుంచి వాడకంలో ఉందో తెలుసుకుందామా! టీ ని మొదట చైనా వారు ఉపయోగించారని చెబుతారు. అధికంగా ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం చైనా చక్రవర్తి షెనాంగ్ క్రీస్తు పూర్వం 2737లో టీని కని పెట్టాడు. ఆ చక్రవర్తికి రోజూ మరిగించిన నీళ్లు తాగే అలవాటు ఉండేదట. ఒకరోజు చక్రవర్తి వేరే ప్రాంతానికి వెళ్తూ విశ్రాంతి కోసం పరివారంతో సహా ఒక చోట ఆగాడు.

సేవకులు అక్కడే నీటిని మరిగించే పని మొదలు పెట్టారు. అప్పుడు ఆ పక్కనే ఉన్న తేయాకు పొదల్లో నుంచి ఒక ఎండుటాకు వచ్చి ఆ నీటిలో పడింది. ఆకుతో సహా మరిగిన నీరు లేత గోధుమ రంగులోకి మారింది. అది గమనించకుండానే ఒక సేవకుడు ఆ నీటిని చక్రవర్తికి ఇచ్చాడు. ఆ నీటి రుచి చక్రవర్తికి చాలా నచ్చింది. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అలా టీ సేవనం చైనాలో మొదలైంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో వాడకంలో ఉన్న చైనా నిఘంటువు ప్రకారం ఝౌ రాజ్యం వారు (క్రీ.పూ.1046-256) ఆకులతో చేసిన పానీయాలను వాడేవారు. అలాగే చైనాలో హాన్ రాజవంశీయులు (క్రీ.పూ.206-క్రీ.శ. 220) టీ ని ఔషధంగా వాడేవారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top