You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » మొక్కలు కూడా ఎమోషనల్ – జగదీశ్‌ చంద్రబోస్‌

మొక్కలు కూడా ఎమోషనల్ – జగదీశ్‌ చంద్రబోస్‌

మనిషిలాగే మెుక్కలకూ ప్రాణం ఉందని ..కష్టసుఖా లనకు చలిస్తాయని తన పరిశోధనల ద్వారా లోకానికి చాటి చెప్పిన మహానీయుడు జగదీశ్‌ చంద్రబోస్‌. పరాజయాలే ప్రగతికి పోపానాలను నమ్మే వ్యక్తిత్వం అయనకు సొంతం. భౌతిక, రసాయన శాస్త్రం చదివినా వృక్షశాస్త్ర పరిశోధనలను ద్వారా ప్రపంచానికి తన ఉనికిని చాటి చెప్పాడు.

Untitlea1858 నవంబర్‌ 30న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లు ఉన్న మైమెన్‌సింగ్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే రామాయణ, మహాభారతాలను పారాయణం చేశాడు. కలకత్తాలోని సెయింట్‌ జూనియర్‌ పాఠశాలలో చదివాడు. బాల్యం నుంచే మొక్కల పెంపంపై మక్కువ పెంచుకుని రకరకాలు మొక్కలను నాటాడు. వాటి బాగోగులు చూస్తూ వాటిపై బాగా అభిమానాన్ని పెంచుకున్నాడు. చీడ నుంచి మొక్కను కాపాడేందుకు కత్తెరతో కొమ్మను కత్తిరించినపుడు కొమ్మ నుంచి నీరు కారింది. అప్పుడు మొక్క మనసు బాధ పడుతోందని భావించాడు. మొక్కలకు ప్రాణమున్నది కాబట్టే ఎదుగుతూ పూలు కాయలు పళ్ళు ఇస్తున్నాయని గ్రహించాడు. ప్రాణమున్న మొక్కను బాధిస్తే ఏడవదా మరి అని తలచి మొక్కలపై ఎన్నో పరిశోధనలు చేసేందుకు మానసికంగా చిన్న నాడే నిర్ణయించుకున్నాడు.

కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రాన్ని అధ్యయనం చేసి పై చదువుల కోసం ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలంలో చేరాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక కతకత్తా ప్రెసిడెన్సి కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకుడిగా చేరాడు. యూరోపియన్లతో కలసి సమానంగా పని చేస్తున్నా వేతంలో తేడాలు చూపడంతో బోస్‌ ఉచితంగా 3 సంవత్సరాలు బోధించాడు. చివరకు యాజమాన్యం వారే 3 సంవత్సరాల జీతం ఒకేసారి చెల్లించి అతని ఆత్మగౌరవం ముందు తలవంచారు. 1891లో కలకత్తాలో సొంతంగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసి పరిశోధనలను ప్రారంభించాడు.

విద్యుత్‌ తరంగ గుణాలను గురించి చేతన పాదార్థాలలో ఉన్న సంకోచాన్ని గురించి శాస్త్ర ప్రయోగాలు చేశాడు. 1895లో జర్నల్‌ ఆఫ్‌ ఏషియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌ అనే పత్రికలో స్ఫటికం నుంచి విద్యుత్‌ కిరణపు ధృవీకరణ అనే వ్యాసాన్ని ప్రకటించాడు. మొక్కలతో, జంతువులతో జీవకణ ధర్మాలను గురించి పరిశీలనలను జరిపాడు. 1895లో జరిగిన శాస్తవ్రేత్తల సమావేశంలో తాను రూపొందించిన కొహెరర్‌ అనే యంత్రంతో మార్కొని కంటే ముందే రేడియో తరంగాలను కనిపెట్టాడు. ఎటువంటి తీగలు లేకుండా కొంత దూరం వార్తా ప్రసారం చేసి చూపించాడు.దీంతోఆయన పేరు మారుమ్రోగింది.

1901 మేన 10న రాయల్‌ సొసైటీ సభ్యుల ముందు తాను తయారు చేసిన క్రెస్కోగ్రాఫ్‌ పరికరంతో మొక్కలకు ప్రాణం ఉన్నదనే విషయాన్ని ధృవీకరించాడు. ఒక మొక్కను బ్రోమైడ్‌ ద్రావణంలో ముంచి మొక్కకు ఆ పరికరాన్ని అమర్చాడు. పరికరానికి మరోవైపు. ఉన్న తెరపై మొక్కలోని సంచలనం అటూ ఇటూ దలటం ద్వారా కనబడింది. కొంత సేపటికి సంచలం ఆగి మొక్క చనిపోయింది. ఈ ప్రయోగం చూసి కొందరు హర్షించారు.భౌతిక శాస్తవ్రేత్త జీవశాస్త్ర పరిశోధనలు చేయడమా అని ఆశ్చర్యపోయారు.

సజీవ, నిర్జీవ పదార్ధాలతో స్పందన అనే పుస్తకాన్ని ప్రచురించి మొక్కలకు లోహాలకు ప్రాణం ఉన్నదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పాడు. 1914లో అసిటేటింగ్‌రికార్డర్‌ సాయంతో జంతుశరీరాల్లోని గుండె కొట్టుకొనుటచే రక్తప్రసరణ ఎలా జరుగుతుందో అలాగా మొక్కలలో ద్రవాభిసరణం క్రమ విరామంలో జరిపే ఏర్పాట్లున్నాయని నిరూపించాడు. 1915లో ఆచార్య పదవి నుంచి విరమించాడు. 1920లో రాయల్‌ సొసైటీ సభ్యుడిగా ఎన్నియ్యాడు. లండన్‌ విశ్వవిద్యాలయం జగదీశ్‌ చంద్రబోస్‌ను డాక్టరేట్‌తో గౌరవించింది.

1921లో తాను తయారుచేసిన రెసోనెంట్‌ రికార్డుద్వారా మొక్కలు కూడా జ్ఞానతంతు సంబంధమైన చర్యలు చూపుతాయని తెలిపాడు. 1926లో మొక్కలు నాడిమండల వ్యవస్థ అనే పుస్తకాన్ని రాశాడు. విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన ఆంగ్ల ప్రభుత్వం సర్‌ అనే బిరుదునిచ్చి గౌరవించింది. ఉద్యోగ విరమణ తరువాత కూడా జీవితాంతం పూర్తిగా జీతాన్ని అందించింది. 1937 నవంబరు 23న కలకత్తాలో తన చివరి శ్వాసవరకూ బోస్‌ శాస్త్ర పరిశోధనలకే అంకితమయ్యాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top