You Are Here: Home » సినిమా » పాటలు » మేరీ మాత (1971)- సాగరతీర సమీపాన

మేరీ మాత (1971)- సాగరతీర సమీపాన

పల్లవి :
సాగరతీర సమీపాన
తరగని కావ్య సుధా మధురం
కాల చరిత్రకు సంకేతం
కరుణకు చెరగని ప్రతిరూపం
॥సాగరతీర॥

చరణం : 1
పచ్చని వృక్షములలరారు
బంగరు పైరులు కనరారు
॥పచ్చని ॥
మాయని సిరులే సమకూరు
వేలాంగణ్ణి అను ఊరు
॥సాగరతీర॥

చరణం : 2
విరితావులను వెదజల్లి
వీచే చల్లని చిరుగాలి (2)
ఆవు దూడల ప్రేమగని
పాడెను మమతల చిన్హమని
॥సాగరతీర॥

చరణం : 3
మట్టిని నమ్మిన కర్షకులు
మాణిక్యాలు పొందేరు (2)
కడలిని నమ్మిన జాలరులు
ఘన ఫలితాలు చెందేరు (2)
॥సాగరతీర॥

చరణం : 4
పాలు తేనై కలిశారు
అనురాగములో దంపతులు (2)
తోడూ నీడై మెలిగారు
చవి చూశారు స్వర్గాలు
॥సాగరతీర॥

చిత్రం : మేరీ మాత (1971)
రచన : రాజశ్రీ
సంగీతం : జి.దేవరాజన్
గానం : కె.జె.ఏసుదాస్, బృందం

e-mail: sakshisong@gmail.com
నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top