You Are Here: Home » ఇతర » మేరా పరివార్‌ మహాన్‌!

మేరా పరివార్‌ మహాన్‌!

ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ముందు, రాజకీయాల్లోంచి నిష్ర్కమించే ముందు ఆయా నాయకులకు పెద్దగా ఆస్తిపాస్తులు ఉండేవి కావు. రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న మహామహులూ ఉన్నారు. ప్రజాసేవ చేసేందుకు పదవే కావాలన్న ధ్యాస వారికి ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ప్రజాసేవల చేయాలంటే పదవి ఉండాల్సిందే. అది కూడా అధికారంతో కూడుకున్నదే కావాలి. తాను ఒక్కడే ప్రజాసేవ చేస్తే చాలదు. కుటుంబం, బంధుగణం కూడా ప్రజాసేవలో తరించాలి. ఇదీ నేటి రాజకీయ నాయకుల ధోరణి. దేశమంతటా ఇదే వైఖరి. ఉత్తరప్రదేశ్‌నే ఉదాహరణగా తీసుకుంటే ములాయం సింగ్‌ యాదవ్‌ యావత్‌ కుటుంబం, బంధుగణం ప్రజాసేవలో తరిస్తున్న వైనాన్ని గమనించవచ్చు. ఆ కుటుంబం కహానీపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

akkiఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన ఘనత ములా యం సింగ్‌ యాదవ్‌కే దక్కింది. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. యునెైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లో ఆయన రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు. ఒకప్పుడు సమున్నత ఆశయాలతో ఉన్న పార్టీల్లో ఆయన ఉన్నప్పటికీ చివరకు ఆయన కూడా బంధుప్రీతికి లోను కాకతప్పలేదు. నేడు యూపీ రాజకీయ రాజకీయాల్లో ఆయన కుటుంబం, బం దుగణందే కీలక పాత్ర.

మల్లయోధుడు కాబోయి..
ములాయం తండ్రి ఆయనను ఓ చక్కటి కండలు తిరిగిన మల్ల యోధుడిగా చూడాలనుకున్నారు. ములాయం మాత్రం కాకలు తీరిన రాజకీయ యోధుడిగా మారిపోయారు. ఒక రెజ్లింగ్‌ మ్యాచ్‌లో ములాయంను చూసిన ఆయన రాజకీయ గురువు నట్టూసింగ్‌ ఆయన కండబలాన్ని చూసి ముచ్చటపడ్డారు. జస్వంత్‌ నగర్‌ నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి వీలు కల్పించారు. 1977లో ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. 1980 లో లోక్‌దళ్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత అది జనతాదళ్‌లో కలసిపోయింది.

సోషలిస్టు యోధులతో కలసి…
jkఆరంభంలో ములాయం సింగ్‌ ప్రముఖ సోషలిస్టు నాయకులు రాజ్‌ నారాయణ్‌, రామ్‌ మనోహర్‌ లోహియాల నేతృత్వంలో పని చేశారు. వారితో పాటు చౌదురి చరణ్‌సింగ్‌కు కూడా సన్ని హితంగా మెలిగేవారు. 1989లో ఆయన తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991 ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. 1992 అక్టోబర్‌ 7న ఆయన సొంతంగా సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. 1993లో జరిగిన ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ లేనప్పటికీ ఆయన సీఎం కాగలిగారు. కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. 2003లోనూ ఆయన తిరిగి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఆయన ఎంపీగా ఉండడంతో ఎమ్మెల్యే అయ్యేందుకు గున్నౌర్‌ అసెంబ్లీస్థానం నుంచి పోటీ చేసి 1,83,899 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. పోలెైన ఓట్లలో 92 శాతం ఆయనకు అనుకూలంగా వచ్చాయి. నేటికీ ఓ రికార్డుగా నిలిచి పోయింది.

అఖిలేష్‌ యాదవ్‌
qwతండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అఖిలేష్‌ అనతి కాలంలోనే సీఎం పదవినీ చేపట్టగలిగారు. తండ్రీకొడుకుల్లో ఎవరు సీఎం అవుతారన్న విషయంలో మొదట కొంత సందిగ్ధత నెలకొన్నా, ఆ తరువాత చివరకు అఖిలేష్‌ ఆ పదవిని చేపట్టాలని నిర్ణయించారు. 2000 సంవత్సరంలో ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. కనౌజ్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందారు.

విశిష్ట రీతిలో పార్టీ ప్రచారం
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల ప్రచా రానికి ఆయనే సారథ్యం వహించారు. ప్రచారం తీరుతెన్నుల్లో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా పార్టీకి సరికొత్త ఇమేజ్‌ను తీసుకురావడంలో విజయం సాధించారు. రాష్ర్టవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైకిల్‌ ర్యాలీలు నిర్వహించారు. బహిరంగ సభల్లో జోరుగా ప్రసంగించారు. ఆయన నిర్వహించిన రథయాత్ర విజయవంతమైంది. యువ ఓటర్లు ఆయన ప్రభావానికి లోనయ్యారు. సమాజంలోని అన్ని వర్గాలను కూడా సమాజ్‌వాదీ పార్టీ తన అక్కున చేర్చుకోగలిగిం ది. 2007 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 97 సీట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను 224 స్థానాలను పార్టీ గెల్చుకోగలిగింది.

ముఖ్యమంత్రిగా…
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లలోనే తానేంటో నిరూపించుకోగలిగారు. రాష్ట్రానికి అతి పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది.

మామ బాటలోనే కోడలు
ghములాయం సింగ్‌ కోడలు, అఖిలేష్‌ భార్య డింపుల్‌ కూడా రాజకీ యాల్లోకి ప్రవేశించారు. ఇటీవలే ఆమె ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఉత్తర ప్రదేశ్‌కు కుటుంబ వారసత్వ రాజకీ యాలు కొత్త కానప్పటికీ, ఏకకాలంలో ఒకే కుటుంబానికి చెందిన వారు కీలకపాత్ర పోషించడం మాత్రం ఇదే ప్రథమం.

సమీపబంధువులు కూడా…
ములాయం సింగ్‌ సమీప బంధువులు కూడా రాజకీయల్లో ఉన్నారు. ప్రొఫెసర్‌ రామ్‌ గోపాల్‌ యాదవ్‌, శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ లాంటివారిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. శివపాల్‌ ములాయం సింగ్‌కు సోదరుడు. మయావతి సీఎంగా ఉన్నప్పుడు శివపాల్‌ అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు.

ములాయం తండ్రి ఆయనను ఓ చక్కటి కండలు తిరిగిన మల్ల యోధుడిగా చూడాలనుకున్నారు. ములాయం మాత్రం కాకలు తీరిన రాజకీయ యోధుడిగా మారిపోయారు. ఒక రెజ్లింగ్‌ మ్యాచ్‌లో ములాయంను చూసిన ఆయన రాజకీయ గురువు నట్టూసింగ్‌ ఆయన కండబలాన్ని చూసి ముచ్చటపడ్డారు. జస్వంత్‌ నగర్‌ నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి వీలు కల్పించారు. 1977లో ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు.

తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అఖిలేష్‌ అనతి కాలంలోనే సీఎం పదవినీ చేపట్టగలిగారు. తండ్రీకొడుకుల్లో ఎవరు సీఎం అవుతారన్న విషయంలో మొదట కొంత సందిగ్ధత నెలకొన్నా, ఆ తరువాత చివరకు అఖిలేష్‌ ఆ పదవిని చేపట్టాలని నిర్ణయించారు.ములాయం సింగ్‌ కోడలు,
అఖిలేష్‌ భార్య డింపుల్‌ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top