You Are Here: Home » సఖి » అందం » మేను మెరుపుకోసం

మేను మెరుపుకోసం

వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు చర్మం కమిలిపోయి నల్లబడుతుంది. చర్మ సంరక్షణ విషయంలో కాస్తంత నిర్లక్ష్యం చేస్తే చాలు…తిరిగి నిగారింపును పొందటానికి చాలా సమయం పడుతుంది. వేసవిలో చర్మం నల్లబడకుండా ఉండటాని కొన్ని చిట్కాలు.

summe

  • క్రమం తప్పకుండా పిగ్మెంటేషన్‌ పరీక్షలు తప్పక చేయించుకోవాలి. చర్మం నల్లబడకుండా సంరక్షించడంలో తోడ్పడుతుంది.
  • చర్మం మరీ సున్నితమైనదైతే సన్‌టాన్‌ లోషన్‌ను వాడాలి. ఇది హైరేడియేషన్‌ నుంచి కాపాడుతుంది. ముఖానికి అప్లయ్‌చేసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు దీన్ని ఉంచాలి.
  • స్విమ్మింగ్‌ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి చర్మసమస్యలు లేకుండా ఉంటే మంచిది. లేదంటే ఎలర్జీ వచ్చే ప్రమాదముంది.
  • పెదాలకు సాధ్యమైనంత వరకు లిప్‌స్టిక్‌ రాయకుండా ఒట్టిగానే వదిలేయడం మంచిది.
  • జుట్టుకు, చర్మానికి సంబంధించి ఏవైనా ప్రొడక్ట్‌‌స ఉపయోగించాలనుకుంటే ముందుగా వాటిని పరీక్షించి వాడాలి.
  • సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ప్రతి రెండు మూడు గంటలకొకసారి ఉపయోగిస్తే మంచిది.
  • కీరదోసకాయతో ముఖానికి మసాజ్‌ చేసుకుంటే బాగుంటుంది. దాంతో పాటు రోజ్‌వాటర్‌ను కూడా అప్లయ్‌చేస్తే మంచిది.
  • కీరదోసకాయ రసాన్ని పాలతో కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది.
  • మాయిశ్చరైజర్‌తో మసాజ్‌చేసుకుని గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్నిశుభ్రపరుచుకుని సన్‌స్క్రీన్‌ లోషన్‌ను అప్లయ్‌చేస్తే మంచిది.
  • శరీరానికి హాని కలిగే ఎలాంటి క్రీములు వాడరాదు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top