You Are Here: Home » చిన్నారి » మేఘాలు తెల్లగా ఎందుకుంటాయి?

మేఘాలు తెల్లగా ఎందుకుంటాయి?

నీలాకాశంలో మేఘాలు తెల్లగా కనిపిస్తుంటాయి. అవి తెల్లగా ఎందుకంటాయో తెలుసుకుందాం. మేఘాలు అవి ఉండే ఎత్తుని బట్టి, అవి సూర్య కాంతిని పరావర్తనం చెందించే విధానాన్ని బట్టి వాటి రంగు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి సిర్రస్ మేఘాలు సముద్ర మట్టానికి సుమారు 8 కిలో మీటర్ల ఎత్తులో ఉంటాయి. అంత ఎత్తులో ఉండే మేఘాలు కేవలం నీటిఆవిరి నుంచి తయారైన మంచు స్ఫటికాలతోనే ఏర్పడి ఉంటాయి. ఈ మంచు స్ఫటికాలు సూర్యకాంతిని పరావర్తనం చెందించడం వల్ల ఆ ఎత్తులో ఉన్న మేఘాలు ప్రకాశవంతమైన తెలుపు రంగులో కనిపిస్తాయి. అన్ని మేఘాలూ తెల్లగా ఉండకపోవచ్చు. తుఫాను మేఘాలు అంత్యంగా దట్టంగా ఉండే మేఘాలు. ఇవి సూర్యకాంతిని పైవైపుకి పరావర్తనం చెందిస్తాయి. అవి కింది నుంచి చూస్తే ముదురు రంగులో కనిపిస్తాయి. ఒకవేళ మనం ఆ మేఘాల పైనుంచి వాటిని చూడగలిగితే మాత్రం తెలుపు రంగులోనే కనిపిస్తాయి. మనకు దట్టంగా, ముదురు రంగులో కనిపించే మేఘాలలో కొన్ని సూర్యకాంతిని ఎక్కువ భాగం శోషించుకోవడం వల్ల అలా కనిపిస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top