You Are Here: Home » ఇతర » మే‘ఘన’ కీర్తి

మే‘ఘన’ కీర్తి

ఈ మేఘన అదిరేలా డ్రస్‌ వేయదు. తన 10 సంవత్సరాల వయసులోనే కీర్తిని కూడా పదింతలు చేసుకుంది. స్కేటింగ్‌ షూ తొడిగిందంటే ఈమె వేగాన్ని అందుకోవడం కష్టం, పతకాలు అందించడమూ కష్టమే. విశాఖ పట్నం బెధాని స్కూలులో చదువుకుంటున్న ఈ చిన్నారి రాష్టస్థ్రాయి ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొని 8-10 ఏళ్ళ విభాగంలో ఐదు బంగారు పతకాలు సొంతం చేసుకుంది.

skatingఅలాగే చాంపియన్‌షిప్‌ కూడా కైవసం చేసుకుంది. మేఘన ఫిగర్‌ స్కేటింగ్‌, ఫ్రీ స్టైల్‌, ఫైర్‌ స్కేటింగ్‌, సోలో డాన్స్‌, ఫైర్‌ డాన్స్‌ల్లో తన ప్రావీణ్యాన్ని చాటుకుంది. విశాఖ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో నాలుగు సర్ణపతకాలు, ఒక రజితం లభించాయి. ఈమె 2008లో జాతీయ స్థాయిలో కూడా రజిత పతకం, కాంస్య పతకం కూడా అందుకుంది. రాష్టస్థ్రాయిలో రెండు స్వర్ణ పతకాలు, జిల్లా స్థాయిలో మూడు స్వర్ణ పతకాలు తన ఖాతాలో జమచేసుకెఉంది. స్కూలు నిర్వహించే ఆటలపోటీల్లో కూడా రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో చెరో రెండు రజిత పతకాలు, జాతీయ స్థాయిలో మరో రజితం గెలుచుకుంది. ఈమెకి చిన్న వయసులోనే స్కేటింగ్‌ మీద ఉన్న మక్కువని తల్లిదండ్రులు గుర్తించారు. ఈమెని స్కేటింగ్‌ క్లాసులో చేర్పించి తగిన ప్రోత్సాహాన్ని అందించారు. గత 5 సంవత్సరాలుగా మేఘన 17 స్వర్ణపతకాలు, 11 రజిత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top