You Are Here: Home » చిన్నారి » మెదడుకు మేత

మెదడుకు మేత

Food Facts
కివీ పళ్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది!
మందులు వేసుకున్న తర్వాత ద్రాక్షపళ్లు తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల మందులు పనిచేయకుండా చేసే లక్షణం వాటికుందని పరిశోధనలో తేలింది!
దాల్చినచెక్కకు ఇన్సులిన్‌ని వృద్ధి చేసే శక్తి ఉంది!
సైనస్ సమస్య ఉన్నవాళ్లు క్యాప్సికమ్ ఎక్కువ తింటే శ్వాస తేలికగా ఆడుతుంది!
కొత్తిమీర తరచుగా తినేవాళ్లకు కొలెస్ట్రాల్ కాస్త దూరంగా ఉంటుంది!
………………..
Interesting Facts

ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు కుడిచేతి వాటం ఉన్నవాళ్లకంటే తొమ్మిదేళ్లు తక్కువ బతుకుతారని పరిశోధనలో తేలింది!
అమెరికాలో యేటా నలభై వేల మందికి పైగా బాత్రూమ్‌లో జారిపడి ఆస్పత్రిలో చేరతారట!
ఆదివారంతో మొదలయ్యే నెలలో 13వ తేదీ శుక్రవారం వస్తుంది!
మాల్దీవుల్లో టూరిస్టులు ఒకటి కంటే ఎక్కువ బైబిళ్లు కలిగి ఉండటం నేరం!
సిగరెట్ తాగడం మొదలుపెట్టాక ప్రతి పదేళ్లకూ రెండేసి పళ్లు చొప్పున ఊడిపోవడం ఖాయమట!
………………
Animal Facts

పులి గాండ్రింపు దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది!
జీబ్రాలు ఆరెంజ్ కలర్‌ను గుర్తించలేవు!
గొంగళిపురుగు తలలో 248 కండరాలు ఉంటాయి!
చింపాజీ తప్ప మరే జంతువూ అద్దంలో తన రూపును తాను గుర్తించలేదు!
మొసలి జీవితకాలం దాదాపు నూరేళ్లు!
…………….
Space Facts

మిగిలిన నెలలతో పోలిస్తే మార్చిలో భూమి మెల్లగా తిరుగుతుంది!
భూమ్యాకర్షణ నుంచి తప్పించు కోవాలంటే అంతరిక్ష నౌకలు సెకనుకు ఏడు మైళ్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది!
శని గ్రహమ్మీద ఒక రోజంటే 10 గంటల 14 నిమిషాలు! అక్కడి ఒక సంవత్సరం మన ముప్ఫై సంవత్సరాలతో సమానం!
రోమన్ పురాణాల ప్రకారం నెఫ్ట్యూన్ అనేది సముద్ర దేవుడి పేరు! భూమి బరువు 6,588,000,000,000 మిలియన్ టన్నులు!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top