You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » మృదువ్ఞగా చేసుకోవచ్చు

మృదువ్ఞగా చేసుకోవచ్చు

NewsListandDetailsపొడిబారిన ముఖానికిఎన్ని క్రీములు రాసినా చర్మం ఎప్పుడూ పొడిబారినట్టుగానే ఉంటుంది కొంతమందికి. దీనికోసం బ్యూటీపార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్‌లతో మీ చర్మాన్ని మృదువ్ఞగా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
్య  పొడిబారిన చర్మం ఉన్నవారు ముల్తాని మట్టిని పచ్చిపాలు, కొద్దిగా తేనెతో కలిపి ఫేస్‌పాక్‌లా వేసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
్య  అరటిపండు గుజ్జును మొహానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మెత్తబడి, కాంతులీనుతుంది.
్య  రాత్రి పడుకునే ముందు పాలమీగడతో ఒళ్లంతా మర్దనా చేసుకుని, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మంలో నిగారింపు వస్తుంది.
్య  ప్రతిరోజూ రెండు లేదా మూడు లీటర్ల మంచినీళ్లు తాగాలి.
్య ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
్య  రక్తం శుద్ధిచేసే టానిక్స్‌ తీసుకోవడం మంచిది.
్య  కోల్డ్‌ క్రీముతో గానీ, వెన్నతో గానీ శరీరాన్ని మర్దన చేసి, గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే శరీరంలో తేమ శాతం పెరుగుతుంది.
్య  ద్రాక్ష, క్యారట్లు, అరటిపళ్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటి గుజ్జు శరీరానికి పట్టించి ఆరిన తరువాత నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
్య ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కమిలిన చర్మానికి టమాటా రసం రుద్ది 10 నిమిషాల తరువాత కడిగితే చర్మం తేమగా తయారవుతుంది.
్య మిగలపండిన అరటిపండుకు 2 చెంచాల క్యారెట్‌ గుజ్జు, పచ్చిపాలు కలిపి ఓ గంట నానబెట్టి తర్వాత ఆ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే చర్మం మెరుస్తూ ఉంటుంది.
్య ఆల్మండ్‌ ఆయిల్‌ లేక పాలమీగడ చర్మానికి రుద్ది 15 నిమిషాలు మర్దన చేసి శనగపిండి, రోజ్‌వాటర్‌లో 4 చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమంతో బాగా రుద్దుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
్య  50 గ్రాముల కొబ్బరి నూనెలో 2 హరతి కర్పూరపు బిళ్లలు వేసి శరీరానికి పట్టించి సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పొడిబారినట్టుగా ఉండదు.
్య  ఆలివ్‌ ఆయిల్‌తో క్లే లేదా ‘అవకోడోను కలిపి తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి వేసుకొని 10 నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
్య  ఎక్కువసార్లు పాలను ముఖానికి పట్టించి నీటితో కడుగుతుండాలి.
్య  గులాబీ రేకులు ఎండబెట్టి పొడిచేసి సున్నిపిండితో కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం నునుపుగా ఉంటుంది.
్య  కోడిగుడ్డు తెల్లసొన, ఒక చెంచా మీగడ, ఒక చెంచా సుద్ద, ఒక చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే పొడిచర్మం కలవారికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
్య మాయిశ్చరైజర్‌ని కొద్దిగా తీసుకుని చర్మంపై మృదువుగా రాసుకుంటే మాయిశ్చరైజర్‌ చర్మంలోకి ఇంకి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
్య  ప్రతిరోజు పరగడుపున గ్లాసుడు నీళ్లలో సగం కాయ నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top