You Are Here: Home » ఇతర » ముసురుతున్న ముసుగులు

ముసురుతున్న ముసుగులు

ఈ రోజుల్లో యువతులు ముఖానికి గుడ్డలు చుట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా పరిణమించింది. ఒకందుకు ఇది పొల్యూషన్‌ బారిన పడి ముఖం కాపాడుకోవడానికి అనే ఒక వాదం ఉన్నప్పటికీ, చాలామంది యువతులు తమ బాయ్‌ ఫ్రెండ్స్‌తో తిరిగేటప్పుడు తమ వారు గుర్తుపట్టకుండా ఉండేందుకు అలా చేస్తున్నారన్న అపప్రథ కూడా ఎక్కువగానే ఉంది. ఇలా స్కార్ఫ్‌ ముఖా నికి చుట్టుకోవడాన్ని ‘స్టోల్‌’ అంటారు.

Masaరోడ్ల మీద వెళ్ళే టప్పుడు ట్రాఫిక్‌లో ఇతర వాహ నాల వల్ల, వాతావరణ కాలు ష్యం వల్ల జుట్టు రాలడం, కళ్ళు మంటలు పుట్టడం, ముఖం మీద చర్మం నల్లబడ టం వంటి సమస్యలు రాకుం డా ఉండేందుకు ఈ స్టోల్‌ వాడతారు. అంతేకాకుండా సూర్యరశ్మి నుంచి ఉత్ప న్నమ య్యే ఆల్ట్రావైలెట్‌ కిరణాల నుంచి కూడా రక్షణ కోసం ముఖానికి ఈ విధంగా ఒక గుడ్డ చుట్టుకోవడం సమంజసమే. అయినా చాలామంది యువ తులు దీనిని ఆసరాగా తీసుకుని తమ సొంత కార్యకలాపాల్లో ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తపడే నేపథ్యంలోనే ఇలా ముఖానికి స్టోల్‌ వాడటం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

కొందరు యువతులు ముఖానికి ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా కూడా తిరుగుతున్నారు. వారు మామూలుగానే ఉంటున్నారు. మనం గమనిస్తే ఎక్కువ మంది యువతులు బైక్‌ మీద బాయ్‌ ఫ్రండ్‌తో వెళ్ళేవారే ఇటువంటి ముసుగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉద్యోగం చేసే ఆడవారు సింగిల్‌గా వవాహనం నడుపులూ వెళ్ళే వారు కూడా స్టోల్‌ ధరిస్తున్నారు. కానీ, వీరి వెనుక మగవాళ్ళు ఎవరూ ఉండరు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కాలుష్యం కోసం ముఖానికి స్కాఫ్‌ చుట్టుకుంటున్నారన్నది వాస్తవం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top