You Are Here: Home » ఇతర » ముత్యాలకు కూడా ఎండపడదు

ముత్యాలకు కూడా ఎండపడదు

ఎండ అనగానే ముచ్చెమటలు ముందే పడతాయి. అందులోను ఎండకన్నె రుగని సుకుమారులు చారిత్ర కాలం నుంచీ నేటివరకూ కూడా ఉన్నారు. అయినా వాళ్ళుకూడా ఎప్పుడో ఒకప్పుడు ఎండలోకి రాకతప్పదు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు గొడుగులు వేసుకుని తిరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. వంటినిండా చక్కగా ఆభరణాలు వేసుకుని ఎండలో వెడుతుంటే వాటి ధగధగలు చూపరులని ఆకట్టుకుంటాయి.

3fwqఅసలే ఆభరణాలు అంటే మహిళలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా బంగారు, వెండితో పాటు ముత్యాల నగలపై మహిళలలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే ముత్యాల నగలను ధరించేవారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే. ముత్యాల నగల విషయం లో స్ర్తీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముత్యాల నగలను పొరపాటు నీటిలో నాననివ్వకూ డదు. వీటిని నీటితో కడిగితే నగలకు అంటించిన ముత్యాలు రాలిపడే అవకాశం ఉంది. ముత్యాల నగలను ఎప్పుడు పడితే అప్పుడు ధరించడం మంచిది కాదు. చలికాలంలో చర్మానికి చెమటపట్టదు. కాబట్టి ఆ సీజన్లో ధరించవచ్చు. వీటిని శుభ్రపరచాలంటే దూదిని ఉపయోగించడం మంచిది. ముత్యపు ఆభరణాలను కాటన్‌ ఊలు సంచిలో జాగ్రత్త చేయాలి.

ఒక చెమ్చా బై కార్బొనేట్‌ పొడిని మరో చెమ్చా సర్ఫ్‌ పొడిని పావులీటరు నీటిలో కరిగించుకుని ఆ ద్రవంలో వజ్రాల్ని ముంచి మెత్తని బ్రిజిల్స్‌ వున్న పాత బ్రష్‌లతో శుభ్రం చేసుకోవచ్చు. అలా శుభ్రపరిచిన ఆభరణాల్ని ఎండలో ఉంచకుండా కాటన్‌ క్లాత్‌తో తుడవాలి. ముత్యాలను విడివిడిగా సాటిన్‌ లైనింగ్‌వున్న పెట్టెలో ఉంచండి. ముత్యాలు మంచివా కావా? అని అనుమానం వచ్చినప్పుడు పళ్ళకి రుద్దండి. అవి రఫ్‌గా కనిపిస్తే మంచి ముత్యాలను గ్రహించండి. ముత్యాలు క్లీన్‌ చేయాలంటే దుప్పిచర్మంతో తుడవండి లేదా మెత్తని తడిబట్టలతో శుభ్రపరచండి.

తలకురాసుకునే నూనె తగిలినా లేదా సువాసనగల సెంటు తగిలినా ఎక్కువ చెమటకు తడిపినా ముత్యాలు కాంతిని కోల్పోతాయి. ముత్యాలను తేమలేనిచోట పెట్టాలి. ముత్యాలను ఒక బాక్స్‌లోపెట్టి బీరువాలో ఉంచి చాలాకాలం తీయకుండా ఉండకూడదు. ముత్యాలు ధరించిన తర్వాత చెమటవాసన పోవడానికి మెత్తని బట్టతో తుడవడం వల్ల ముత్యాలు కాంతివంతంగా మెరుస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top