You Are Here: Home » ఇతర » ముగ్గు ముచ్చట

ముగ్గు ముచ్చట

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రంగవల్లుల సందడీ మెుదలైరుు్యంది. అంటే తెలుగు లోగిళ్లు రంగురంగల ముగ్గులతో ముస్తాబైయ్యారుు. చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఇక మన ఇంటి ఆడపచులు రోజూ ఉద యాన్నే లేచి ఇంటిముందు కళ్లాపి చల్లుతారు. ఈ కళ్లాపి అంటే మామూలు నీటితో కాకుండా ఆవుపేడను నీళ్లల్లో కలిపి ఆనీటిని ఇంటి ముందంతా కళ్లాపిగా చల్లుతారు. తరువా త బియ్యంపిండితోగానీ, ముగ్గు పిండితో కానీ అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆ రంగవల్లులమీద ఆవుపేడతో చేసిన ముద్ద నుంచుతారు. వీటిని గొబ్బెమ్మ లు అంటారు. ఈ గొబ్బెమ్మ లను కుంకుమ, పసుపుతో అద్ది పైన ఒక గుమ్మడిపూవుతో అలంకరించి అందమైన ముగ్గుపై పెట్టి అలంకరిస్తారు.
Untitl36ఇలా రోజూ సంక్రాంతి పండగ వరకూ మహిళలు తెల్లవారుఝా మునే కోడికూచే వేళ లేచి అందమైన రంగవల్లులను పోటీపడి మరీ వేస్తారు. ఈ పోటీలో రోజుకొక అందమైన రంగవల్లిని వేస్తూ తోటివారితో ఆ రంగవల్లుల గురించి చర్చలు కూడా చేస్తారు. తమ ముగ్గే అందరూ చూడాలనే తపన, ముగ్గు బాగుందని మెచ్చుకోలు కోసం పోటీ పడతారు. ఈ పోటీ కూడా మంచి సహృదయతతో ఉంటుంది. ఈ పోటీలో కోపతాపాలకు తావుండదు. ఇలా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆడవారిలో చాలా ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
అయితే ఈ ముగ్గులలో కూడా రకరకాల ముగ్గులున్నాయి.
చుక్కలముగ్గు : చుక్కను పెట్టి కలుపుతూ వేసే ముగ్గు చుక్కలముగ్గు. దీన్ని ఆడవాళ్లు చాలా సులభంగా వేస్తారు.
మెలిక ముగ్గు : చుక్కకూ చుక్కకూ మెలికతిప్పుతూ చివరికి మొదటి చుక్క దగ్గరికి వస్తుంది. అంటే మొదలుపెట్టిన దగ్గరి నుంచీ చివరి వరకూ ఒకే లైనును కలుపుతూ వేస్తారు. కొద్దిగా లైను మారిందంటే ముగ్గంతా తప్పుగా మారి మొట్టమొదటి చుక్కదగ్గరికి రాలేము. అం దుకే మన ఇళ్లల్లో మహిళలు భోజనాలైనాక అందమైన ముగ్గులను గంటలకొద్దీ ప్రాక్టీసు చేస్తారు.
రంగవల్లికలు : రంగుల ముగ్గును వేసి ఆ ముగ్గు భాగంలో డిజైన్‌గా రంగులను అద్దు తారు. వీనినే రంగవల్లిక ముగ్గులు అంటారు.
గీతల ముగ్గు : గీతల ముగ్గంటే రథం ముగ్గును కూడా గీతల ముగ్గుగా చెప్పవచ్చు. రథం ముగ్గులో నిలువు గీతలను వరుసలలో వేస్తారు. పైన రెండవ వరుసలో గీతలు కింది వరుసలోని మధ్యమధ్యకు వేస్తారు. ఇలా చివరి పైవరుసకు వచ్చేసరికి ఒకే గీతల వరుస ఉంటుంది. ఇలా వేసిన రథం ముగ్గులో కింది వరుస గీతలను పైవరుసకు కలుపుకుంటూ చివరికి రథం ఆకారంలో రంగవల్లిని పూర్తిచేస్తారు. ఇపుడు రథం ముగ్గు తయారైపోతుంది.

ఈ రథానికి కింద రెండు చక్రాలను కూడా దిద్దుతారు. దీంతో అందమైన రథంముగ్గు తయారౌతుంది. ఈర థాని కి తాడులా ముగ్గువేసి పక్కింటి వారి రథానికి కలుపుతారు. ఇపుడు రథం ముగ్గుపై పసుపు, కుంకుమను చల్లి పూలతో అలంకరిస్తారు. ఈ రథం ముగ్గును సంక్రాంతి చివరి రోజునవేస్తారు. దీనితో సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల సందళ్లు ముగుస్తాయి.
రంగవల్లుల్లో ఆరోగ్యం : ముగ్గుల్లో కూడా ఈ సంక్రాంతి రోజులలో ఆరోగ్యం ఇమిడి ఉంది. ఇంటిముందు ఆవుపేడతో కలిపిన నీళ్లను చల్లడం వలన మనకు అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాదని అంటారు. ఆవు మనకు పూజనీయమైనది. ఆవు మూత్రం, ఆవుపేడ, ఆవుపాలు మనకు ఆరోగ్యాన్ని స్తాయి. అందుకే మనం నిత్యజీవితంలో ఆవును పూజిస్తాము. అలాగే మన గ్రామీణ వాతావరణంలో మహిళలు ముగ్గును వేయడానికి బియ్యంపిండిని వాడతారు. ఈ ఆచరణలోకూడా జీవ వైవి ధ్యం మనకు స్పష్టంగా కన్పిస్తుంది.

Unti3 ఈ ముగ్గు పిండిగా వాడే బియ్యం పిండిని చీమలు, చిన్నచిన్న పురుగులు ఆహారం గా తీసుకుంటాయి. తోటి జీవులకు ఆహారాన్నివ్వడం మనసంస్కృతిలో ఒక భాగ మైంది. అంతేకాదు ఈనాటికీ రైతులు పంటరాగానే వరి కం కుల్ని ఇంటి ముందు గుత్తిగా చేసి కట్తారు .ఎందుకంటే పిచ్చుకలు, చిన్నచిన్న పిట్టలకు ఆహారాన్ని ఇవ్వడం కూడా చూస్తుంటాము.
ముగ్గుల్లో గణితం : ఇక ముగ్గుల్లో కూడా గణితం కూడా ఇమిడి ఉంది. ఎం దుకంటే చుక్కలు పెట్టేప్పుడు ఒక లెక్క ప్రకారం పెట్తారు. అలా పెట్తేనే ముగ్గు అందంగా వస్తుంది. అంటే చుక్కలుగానీ, గీతలు కానీ లెక్కగా పెడితేనే ముగ్గు సరి గా అందంగా వస్తుంది. ఆ చుక్కలు పెట్టే లెక్కలు సరిగా లేకుంటే ముగ్గు అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మన సంస్కృతి, సంప్రదా యాలలో అందం,ఆరోగ్యంతోపాటు గణితం కూడా ఇమిడి ఉన్నాయనేది నిర్వివాదాంశం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top