You Are Here: Home » సఖి » అందం » ముఖ సౌందర్యానికి…

ముఖ సౌందర్యానికి…

ముఖ సౌందర్యానికి…
ఆరు టీ స్పూన్ల నారింజరసంలో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద కింద నుంచి పైకి మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయాలి. సుమారు పదిహేను నిముషాలు బాగా ఎండిన తరవాత ముఖాన్ని చన్నీటితో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి చెక్కుతో ముఖమంతా రబ్ చేయాలి. దానికున్న గుజ్జు ముఖానికి అంటుకుంటుంది. దానిని సుమారు పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసి వదిలేయాలి. గాలికి దానంతట అదే ఆరనివ్వాలి. ఇవి చేయటం వల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా అవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top