You Are Here: Home » ఇతర » మీ ముఖానికి సరైన జోడు

మీ ముఖానికి సరైన జోడు

5wqఅందం సంగతి ఎలావున్నా అసలు కళ్ళు కనిపించాలంటే కళ్ళద్దాలు తప్పదు. చత్వారమో, తలనొప్పో వచ్చి డాక్టర్‌ దగ్గరకి వెడితే కళ్ళజోడు రాసిస్తాడు. అందులో అందం వెతుక్కోవడంలో అర్థం లేదుకానీ, నూటికి 99 శాతం కళ్ళజోడు కొనుక్కోవడానికి ఎన్నో తంటాలు పడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఏ ఫ్రేము ముఖానికి సూటవుతుందా అని అదిమార్చి అదీ, అది మార్చి ఇదీ పెట్టుకుని చూసేసుకుంటూ ఉంటారు. కాబట్టి కళ్ళజోడు గురించి చెప్పక తప్పదు. కళ్ళజోడు ధరించేవారు ఎలాంటిది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి కళ్ళజోడు బాగా కనిపించేదిగా ఉండాలి. రెండోది కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందం పెరగాలి గానీ తగ్గిపోకూడదు. మూడు, ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి కళ్ళజోడును ఎంపిక చేసుకోవాలి. దీనితోపాటు మీ ముఖాకృతిని బట్టి సెలక్షన్‌ ఉండాలి.

గుండ్రటి ముఖం: బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్‌ ఉన్న కళ్ళజోడును ధరించాలి .
కోల ముఖం: చక్కటి ముఖమంటే కోలముఖమే అంటారు కదా. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్‌ ఉన్న కళ్ళజోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమును వాడకపోవడమే మంచిది.
దీర్ఘచతుర్రసాకారపు ముఖం: ఇలాంటి ముఖం ఉన్నవారు చిన్నగా మరింత, చక్కగా కనబడాలంటే దీర్ఘచతుర్రస లేదా చదరపు ఫ్రేమ్‌ ఉన్న కళ్ళజోడును ఎంచుకోవాలి.
చదరపు ముఖం: ఇటువంటి ముఖాకౄఎతి కలవారు తమ ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, కోలగా చిన్నగా ఉన్న ఫ్రేమ్‌ కళ్ళజోడును ధరించాలి.
ముఖం వజ్రంలా ఉంటే: వజ్రాకృతి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉండేవారు చాలా అరుదు. వీరికి రిమ్‌లెస్‌ ఫ్రేములు, లేదా కోలగా ఉండే ఫ్రేములు బావుంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top