You Are Here: Home » సఖి » అందం » మీగడతో ఫేస్‌ మాస్క్‌!

మీగడతో ఫేస్‌ మాస్క్‌!

>అందంతో పాటు ఆరోగ్యం పొందాలంటే కేవలం కొద్దిగా మీగడ మాత్రమే చాలు. బ్యూటీ పార్లర్లలకు వెళ్ళకుండానే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. వేసవిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొద్దిగా ఎండకు తిరిగితే చాలు…ముఖం వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని మార్గాలున్నాయి. పాలు బాగా కాగపెట్టి చల్లారిన తర్వాత దానిమీద ఏర్పడే మీగడ పొరను జాగ్రత్తగా చెమ్చాలో తీసి ఒక చిన్న గిన్నెలో వుంచుకోండి.

Faceఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి, మీగడను బాగా కలిపి మెత్తని పేస్‌‌టలాగా చేయండి. అద్దం ముందు కూర్చుని మీ ముఖానికి మాస్క్‌లాగా రాయండి. అది కొంచెం సేపటికి ఆవిరై గట్టిపడుతుంది.
మీగడ రాసుకున్న తర్వాత మీకు ఏమీ తోచకపోతే పేపర్‌ చదవడానికో లేదా వంట చేయడానికో ప్రయత్నించండి. ఒక అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.
మీగడ మాస్క్‌ వేసుకున్న రోజు సబ్బుతో ముఖం కడగవద్దు. మెత్తటి టవల్‌లో ముఖం తుడుచుకోండి. ఈ పని సెలవు రోజున చేస్తే మంచిది. ఈ విధంగా నాలుగు వారాలు చేస్తే మీ ముఖంలో మంచి మార్పు కనిపిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top