You Are Here: Home » చిన్నారి » మీకు తెలుసా?

మీకు తెలుసా?

శివుడికి అనంతకోటి పేర్లున్నాయి. శంకరుడు, నిటలాక్షుడు, ఫాలాక్షుడు, శ్మశానవాసి, దిగంబరుడు ఇలా…
శం అంటే మంచి, కరుడు అంటే చేసేవాడు అని అర్థం. అందుకే ఆయన శంకరుడయ్యాడు. నిటలాక్షుడు… నిటలం అంటే నుదురు, అక్షము అంటే కన్ను అని అర్థం. నుదుటన కన్ను కలిగిన వాడు కనుక నిటలాక్షుడయ్యాడు. అలాగే ఫాలాక్షుడు… ఫాలము అంటే కూడా నుదురే.

అలా ఫాలాక్షుడయ్యా డు. దిక్ అంటే దిక్కులు. అంబరం అంటే వస్త్రం. దిక్కులే వస్త్రంగా కలిగిన వాడు కనుక దిగంబరుడయ్యాడు. గరళకంఠుడు, శ్రీకంఠు డు అనే పేర్లు కూడా ఉన్నాయి. గరళం, శ్రీ… ఈ రెండు పదాలకీ విషం అని అర్థం. కంఠుడు అంటే గొంతుకలవాడు అని అర్థం. గొంతులో విషం ఉన్న వాడు కనుక ఈ పేర్లు వచ్చాయి. ముక్కంటి అనే పేరు కూడా ఉంది. మూడు కన్నులు ఉన్నవాడు శివుడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top