You Are Here: Home » ఇతర » మా సాటివారు ఏచోట లేరు

మా సాటివారు ఏచోట లేరు

కొన్ని సంస్థలు ేకవలం మహిళల అనితర కృషి వల్ల ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారుు. అందుకు వారు చూపించిన ప్రజ్ఞాపాటవాలు కూడా వెలుగులోకి వచ్చి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారుు. ‘పట్టరాదు పట్టి విడువరాదు’ అన్న చందంగా మహిళలు కనబరిచే పట్టుదల చెప్పనలవికాదు. నిత్యం మనం వినియోగించే వస్తు ఉత్పత్తుల రంగాల్లో కూడా వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. అలాగే ెటల్‌ మేనేజ్‌మెంటులోను, మీడియా రంగంలోను, ప్రకటనల రంగాల్లో కూడా మాదే పైచేరుు అంటున్నారు నేటి మహిళలు.

కలనిజమాయెగా…
14dheeraపురుషుడు బ్రతకటానికి పనిచేయాలి. అదే స్ర్తీ విషయంలో ఆమె కలలను సాకారం చేసుకోవాలి. అవి పగటి కలలు కాకూడదు. జీవితంలో అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకుంటానంటుంది. లీలాహోటల్స్‌ అండ్‌ రిసార్‌‌ట్స జనరల్‌ మేనేజర్‌, పి.ఆర్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత మిధుబాసు. ఆమె గతంలో ఆర్టిస్‌‌ట, కాపీరైటర్‌, ఆర్‌‌ట డైరెక్టర్‌, ప్రజా సంబంధాలలో తన ప్రతిభను చాటుకుంది. తన కాళ్లపై నిలబడటమే గర్వంగా వుంటుందంటుంది. మిధు.

ఎన్నడూ మరొకరి దయాదాక్షిణ్యాలకై వెంపర్లాడదు. ఎప్పుడూ సొంత ఆలోచనలే. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా ధైర్యంగా తట్టుకుంది. తన కంటూ ప్రత్యేకతను చాటుకుంది. ముందుగా తాను ’అబల’ అనే బలహీనతకు తావీయ కుండా, పనిలో శ్రద్ధ కనిపించి లక్ష్యసాధనతో దూసుకుపోవాలంటుంది. సాధారణంగా ప్రజలు భావించేదేమంటే స్ర్తీలు ఆఫీసులకే అంకితం అవ్వాలనే సిద్ధాంతాన్ని విభేదిస్తుంది. ఏదైనా సమతౌల్యం పాటిస్తేనే, అటు ఇంటిలోనూ, ఆఫీసులోనూ నెగ్గుకురాగలమని విశ్వశిస్తుంది. లీలా రిసార్‌‌ట్సను దేశంలో ఉన్నత స్థాయిలో వుంచటానికి మిధుకృషి అపారం.

మీడియా ఏజెన్సీలో అగ్రగామి
14dheera0మీడియా ఏజెన్సీని నడపటమంటే కత్తిమీద సామే. జెనిత్‌ ఆప్టిమీడియా అధినేత అంబికా శ్రీవాత్సవ వ్యాపారంలో బహుముఖ పోటీని ఎదుర్కొంటుంది. మీడియా వ్యాపారాన్ని ఓ సవాల్‌గా స్వీకరించింది. ఆమె ఈ సంస్థను ఆవిష్కరించినప్పుడు కంప్యూటర్లులేవు. మీడియా రిసెర్‌‌చ ఇంకా మొగ్గతొడగలేదు. కేవలం లాజిక్‌, విషయపరిజ్ఞానంతో వ్యాపారాన్ని నిర్వహించే వారు. మీడియా ఏజెన్సీలో నిత్యనూతనం, వైవిధ్యం గోచరించాలి. సృజనాత్మకత వుండాలి. బ్రాండుల నుండి రోజూ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో నిత్య విద్యార్థిని. ఒక్కో బ్రాండ్‌ అభివృద్ధికి ఒక్కో ప్రణాళికను రూపొందించాలి, ప్రజల నాడిని అనునిత్యం గమనించి, వారి అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించాలి.

జెనిత్‌ ఆప్టి మీడియాను మార్కెట్‌లో అత్యుత్తమమైనదిగా రూపుదిద్దాలని అంబిక ఆకాంక్ష. ప్రతి ఉద్యోగి తన సంస్థలో పనిచేయడానికి గర్వపడేట్లు చేయాలన్నదే ఆమె సంకల్పం. ఎప్పుడైతే ఆశయ సిద్ధికోసం శ్రమిస్తామో, అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయంటుంది. వ్యక్తిగతంగా ఎప్పుడైతే రాణిస్తామో, అప్పుడే ఆఫీసులో కూడా తనదైన ముద్ర వేస్తానంటుంది అంబిక.

నిదురించే తోటలోకి….
14dheera1ఆకలి రుచెరుగదు, నిద్ర సఖం ఎరుగదు అంటారు. అయినా నిద్రపోవడానికి మంచి అనుకూలత ఉంటే ఎవరుమాత్రం వద్దంటారూ! అందుకే షీలాగ్రూప్‌ సంస్థ అధినేత నమితాగౌతం భర్త రాహుల్‌ గౌతంతో కలిసి ‘స్లీప్‌వెల్‌’ బ్రాండ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఆమె ఈ సంస్థను ఓ కూతురులా భావించింది. కుమార్తెల అభీష్టం మేరకు నడవటమే తల్లికి పరమావధి ‘‘స్లీప్‌వెల్‌ మా బేబీ, మాకెంతో గర్వంగా వుంది’’ అంటుంది నమితా. షీలాగ్రూప్‌ కుటుంబ సంస్థ కనుక, కంపెనీ ఒత్తిడులను ఇంటికి మోసుకుపోదు.

అలాగే ఇంటి వ్యవహారాలను ఆఫీసులో చూడదు. దేనికదే. ఆమె ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఫికి) మహిళా సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరించారు. యువతను దృష్టిలో ఉంచుకొని, వారికోసం ‘యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓ’ సంస్థను ప్రారంభించింది. దీనిలో ఇప్పుడు 500 సభ్యులున్నారు. న్యూఢిల్లీలో ఆల్‌ వుమెన్స్‌ ఇండస్ట్రీయల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను లీజుకు తీసుకున్నారు. దీనిలో 500 మంది విద్యార్థినులు వున్నారు. ’’స్లీప్‌వెల్‌’’ బ్రాండ్‌ అధినేత మత్తుగా నిద్రించదు. బిజినెస్‌ వ్యవహారాల్లో ఎప్పుడూ చురుకుగా, చలాకీగా వుంటుంది.

ఎరక్కపోయి వచ్చాను..!
rituకాఫీ ‘ఘుమఘుమలు’పెంచిన రీతు ఎడ్వర్టయిజ్‌మెంట్‌ రంగంలో పొరపాటున అడుగు పెట్టానంటుంది. రీతు రైజాడ. ఆమె చేరిన కొత్తలో గణాంకాలు చూసేది. ఆ రంగంలో అప్పుడే ’మీడియా ప్లానింగ్‌’ ప్రవేశపెట్టారు. డేటా ఎనాలిసిస్‌ ముఖ్యమైన పని. ఎంతో సవాల్‌గా వుండేది. మీడియా ప్లానింగ్‌లో రీతు ఓ దశకం పని చేసింది. తర్వాత అవకాశాలు రీతును వెతుక్కుంటూ వచ్చాయి. యుమ్‌ ఇంటర్నేషనల్‌, పిజ్జాహట్‌, కెంటకీ ఫుడ్‌ నిర్వహించేది. కెంటకీ మూత పడినతర్వాత, మరికొన్ని కంపెనీల నుండి మీడియా ప్లానింగ్‌ ఆఫర్లు వచ్చాయి.

కొత్తలో కంపెనీలు ప్రకటనల కోసమే మీడియా ప్లానింగ్‌ను ఆశ్రయించాయి. రీతూ ’నెస్లే’లో చేరిన తర్వాత అనూహ్యమైన మార్పులు చేసింది. భర్త రాహుల్‌, రీతుకు ఎప్పుడూ అండగా ఉంటారు. నెస్లే కంపెనీకి మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె నిర్థిష్టమైన ప్రణాళిక, మొక్కవోని దైర్యంతో కంపెనీని విజయాల బాటలో నడుపుతోంది. రీతూకి సంగీతం అంటే చెవికోసుకుటుంది. జలకాలాటలన్నా మక్కువే. స్విమ్మింగ్‌ (ఈత) చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది.

ఈమెది తిరిగే కాలు
సుధా నట్రాజన్‌ వింటాస్‌ మీడియా గ్రూప్‌కు అధినేత, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌. ఆమెకు ఒక రాష్ట్రం, దేశం అంటూ ఏమీలేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇట్టే భౌగోళిక పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. లక్నోలో వుంటే అవధ్‌ భోజనం, కేరళకు వెళితే ఆప్పం, మీన్‌కర్రీ, కాశ్మీర్‌లో కీమాబాల్స్‌, ఇలా అక్కడ వంటకాలను ఇష్టంగా ఆరగిస్తుంది. ఎప్పుడూ ప్రజలతో మమేకమై వారి బలం, బలహీనతలు, అభీష్టాలు తెలుసుకుంటుంది. సమాజంలో పురుషాధిక్యతా! అయితే ఎలా? ఇటువంటి ప్రశ్నలకు ఆమె చోటివ్వదు. తనకు ఇచ్చిన పనిని నిష్టతో, కష్టించి చేసి అధికారుల అభిమానాన్ని చూడగొంటుంది. ఆమె బిడ్డ సిద్ధార్థను ఇంటికొచ్చి ముద్దాడి, కౌగలించుకుంటే ఆఫీసు పనిఒత్తిడులన్నీ బలాదూర్‌ అంటుంది, ఎంత పనున్నా, ఎంతో రిలాక్స్‌గా కనిపిస్తుంది.

వ్యాపార రహస్యం
sudhaవ్యాపారం అంటే గరిటె తిప్పడంకాదు. వంటింటి చిట్కాలకు తావులేదు. బిజినెస్‌ మంత్ర ప్రయోగిస్తేనే సక్సెస్‌ అంటుంది స్మీతా నియోగి. లక్ష్యం పెట్టుకొని గురి తప్పకుండా రామభాణాన్ని సంధించా లంటుంది ‘వెస్‌‌టసైడ్‌’ అధినేత. ఫలితాలు తప్పనిసరిగా సాధించాలనే నిర్ణయంతో, సరైన టీమ్‌తో విజయబాటలో పయనించాలంటుంది. ఎప్పటికప్పుడు తన నైపుణ్యానికి పదును పెడుతుంది. వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా బిజినెస్‌లో బ్రేక్‌ పడింది. మళ్లీ ధైర్యంతో ముందడుగు వేసింది. ఇంటి పనికి, ఆఫీసుపనికి లింక్‌ పెట్టేదికాదు. ఆమె ధైర్యే సాహసే లక్షీ్ష్మ అనే సూత్రాన్ని ఆచరణలో పెడుతూ ధైర్యంతోనే ముందడుగు వేస్తుంది. వ్యాపారంలో సవాళ్లును సాహసంగా తీసుకుంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top