You Are Here: Home » ఇతర » మాల్‌ఫర్‌ ఆల్‌ ఫ్యాషన్‌

మాల్‌ఫర్‌ ఆల్‌ ఫ్యాషన్‌

వస్త్రప్రియులకు సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులను అందించేందుకు భాగ్యనగరంలో సరికొత్త షోరూమ్‌లు అందుబాటులోకి వస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌ దుస్తులను ఫ్యాషన్‌ప్రియులు కోరుకుంటున్నారు. దీంతో షోరూమ్‌ల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు వాటిని అందించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ తరుణంలో మరో కొత్త షోరూమ్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘ద ఫ్యాషన్‌ మాల్‌ ఫర్‌ ఆల్‌’ లోగోను సినీనటుడు అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొత్తపేటలలో త్వరలో ఆవిష్కరించనున్న ఈ ‘నెంబర్‌ 6 ఫ్యాషన్‌ మాల్‌’ లోగో ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆహూతులకు కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో క్యాజువల్‌, ఎథినిక్‌ దుస్తులతో మోడల్స్‌ సందడి చేశారు. ద ఫ్యాషన్‌ ఫర్‌ ఆల్‌ ప్రమోటర్లు రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌, శ్రీధర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top