You Are Here: Home » సఖి » రుచి » ” మామిడి బొబ్బట్లు”

” మామిడి బొబ్బట్లు”

” మామిడి బొబ్బట్లు”

కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము- ఒకకప్పు, క్యారెట్‌ తురుము-రెండుకప్పులు, బీట్‌ రూట్‌ తురుము- అరకప్పు, పచ్చికోవా- రెండుకప్పులు,. మైదా- ఆరుకప్పులు, నెయ్యి-రెండు కప్పులు, పంచదార- నాలుగుకప్పులు, యాలకులపొడి- రెెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా.

తయారీవిధానం : మైదాపిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలుచేర్చి చపాతి పిండి కంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబె ట్టాలి. బాణలిలో నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేడి చేసి బీట్‌రూట్‌, క్యారెట్‌ తురు ములను పచ్చి వాసన పోయేదాకా వేయిం చాలి. దాంట్లోనే మామిడి తురుము కూడా చేర్చి మరికా సేపు వేయించాలి.పదినిమిషాలయ్యాక అందులో పంచదార, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి ముద్దగా అయిన తరువాత పచ్చి కోవా, యాలకుల పొడి చేర్చి కలియబెట్టి స్టౌ ఆపి దించే యాలి.ఇప్పుడుమైదా పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్‌ కవర్‌పై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీల్లా వత్తాలిఅందులో మామిడి మిశ్రమాన్ని ఉంచి, చుట్టూ పిండితో మూసివేసి, మళ్లీ నూనె అద్దుతూ బొబ్బట్లు మాదిరిగా వత్తాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని, పెనంపై తగినంత నెయ్యి వేస్తూ దోరగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి మామిడి బొబ్బట్లు తయార్‌, వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top