You Are Here: Home » ఇతర » మానసిక ఒత్తిడి తగ్గాలంటే… ఏం చేయాలి!?

మానసిక ఒత్తిడి తగ్గాలంటే… ఏం చేయాలి!?

శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా మరింత వేగంగా పనిచేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి తాత్కాలికమయితే పర్వాలేదు కానీ ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయితే ఆ హార్మోనులు శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని కలిగిస్తాయి. కనుక మీపెై గల ఒత్తిడిని తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఇంకా కొన్ని సూచనలు పాటిస్తే ఒత్తిడిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు.

What-is-stress

  • కాఫీ, టీలు తాగడం తగ్గించి మంచినీరు ఎక్కువగా సేవించాలి.
  • అలసట, మానసిక ఒత్తిడులతో బాధపడే వారితి తేనె దివ్యౌషధం. పాలలో కానీ, నిమ్మరసంలో కానీ కలుపుకుని తాగినా, అలాగే తీసుకున్నా తేనె ఎంతో ఉపశాంతినిస్తుంది.
  • మంచి పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి. సరదాగా నవ్వుతూ ఉండాలి. ముఖంపెై చిరునవ్వు చెరగనివ్వదు.
  • ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. రాత్ర త్వరగా నిద్రపోవాలి.
  • మధ్యాహ్నం వీలుంటే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. నిద్రపోకూడదు.
  • జీవితంపెై ఆశాభావం పెంచుకోవాలి. ప్రకౄఎతిలో సాన్నిహిత్యం పెంచుకోవాలి.
  • మొక్కలను నాటి వాటి పెరుగుదలను ప్రతిరోజూ గమనిస్తూ ఉండాలి.
  • మీ సమస్యలను, సంతోషాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించాలి.
  • చివరగా మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇష్టం లేనివి చేయవద్దు. చిన్న చిన్న రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌, యోగ, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top