You Are Here: Home » చిన్నారి » మానవ శరీరంలో ఫిల్ట్రమ్ ఎక్కడ ఉంటుంది?

మానవ శరీరంలో ఫిల్ట్రమ్ ఎక్కడ ఉంటుంది?

ఫిల్ట్రమ్ అనే భాగం మనిషి ముఖంలో ఉంటుంది. కళ్లు, పెదాలు, ముక్కు, నోరు లాంటి భాగాలను అందరూ గమనిస్తారు. కానీ ఈ ఫిల్ట్రమ్‌ను సరిగా పట్టించుకోరు. ఎందుకంటే అది చేసే పనేమీ ఉండదు కాబట్టి.

మన ముఖంలో ముక్కు కింద నుండి పై పెదవి వరకు సరిగ్గా మధ్య భాగంలో ఉండే చిన్న గుంటలాంటి భాగమే ఫిల్ట్రమ్. మనుషుల్లోనే కాకుండా అనేక క్షీరదాల్లో కూడా ఈ భాగం స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల్లో ఈ భాగాన్ని ‘ఇన్‌ఫ్రా నేసల్ డిప్రెషన్’ అని కూడా అంటారు. ఈ భాగం ఏర్పడే ప్రక్రియలోని లోపాల వల్ల కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే పెదవుల్లో చీలికలు వస్తుంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top