You Are Here: Home » ఇతర » మానవ కంప్యూలర్‌ రామానుజన్‌

మానవ కంప్యూలర్‌ రామానుజన్‌

భారత్‌కు, గణితశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రపంచదేశాలకు తీసిపోని విధంగా ఇక్కడ ఎందరో గణిత శాస్త్రవేత్తలు ఆ రంగానికి వన్నె తెచ్చారు. 6,7 శతాబ్దాలలో ఆర్యభట్ట, బ్రహ్మ గుప్తా వంటి గణిత మేధావులు ఆల్జీబ్రా, ఆస్ట్రానమీలలో విశేష ఖ్యాతిని తీసుకువచ్చారు. 12వ శతాబ్దంలో భాస్కరాచార్య., తన కూమార్తె పేర రాసిన ‘లీలావతి’ అనే పుస్తకం అల్జీబ్రా, అర్థమెటిక్‌ల అధ్యయనానికి కీల కంగా తోడ్పడింది. గణితశాస్త్రంలో విప్లవంగా భావిం చేస్తున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట భారతీయుడు. ప్రస్తు తం ప్రపంచ దేశాలను శాసిస్తున్న కంప్యూటర్‌ రంగా నికి నాంది మన దేశీయులు కనిపెట్టిన గణితమే.

తిరుగులేని…

తమ తమ రంగాలలో నిష్ణాతులెై, విశిష్టత పెంపొందిం చుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి ‘గొప్పతనం’’ సాధిం చినవారెందరో ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొన్న ప్రతిబం ధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భం దాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనబరిచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాల బాటలో… భారతదేశ గణిత శాస్త్ర రంగానికీ, సంస్థాగత పరిశోధనలకు అభివృద్ధికి పునాది వేసి ప్రపంచంలోనే అత్యున్నత గణితశాస్త్ర సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్ధి అనేక అగ్రశ్రేణి గణితజ్ఞు లను తన శిష్య, ప్రశిష్య రూపేణా లోకానికి అందించిన మహానుభావుడు శ్రీనివాస రామానుజం. రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యా తలు గడించిన ఓ సహజ గణితశాస్త్ర మేథావి. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించింది.

జీవితంలో మలుపు
రామానుజం జన్మించింది 1887 డిసెంబర్‌ 22న దక్షిణ భారత్‌లోని కుంభకోణానికి సమీపంలోని ఈరోడ్‌లో. కుంభకోణాన్ని దక్షిణ ప్రయోగగా అభివర్ణి స్తారు. తండ్రి చిన్న దుకాణంలో పనిచేసేవాడు. పేదరి కంతో సహవాసం. అటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా చిన్నతనంలోనే తన కిష్టమైన గణితంలో అత్యంత ప్రతిభ కనబరచడమే కాకుండా, 8వ తరగతిలోనే త్రికోణమితిని అవపోసన పట్టాడు. అదే సమయంలో 1880లో బ్రిటన్‌కు చెందిన కార్‌ రాసిన సినాప్సిస్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ రూల్స్‌ ఇన్‌ అప్లైడ్‌ అండ్‌ ప్యూర్‌ మ్యాథమెటిక్స్‌ పుస్తకాన్ని చదవడం తటస్థిం చింది.

గణితంలోని వివిధ విభాగాలకు చెందిన 6వేల ఫలితాలను ఈ పుస్తకంలో రాసారు. ఆ పుస్తకమే రామానజంపెై తీవ్ర ప్రభావం చూపింది. అందులో ఫలి తాలు ఉండి రుజువులు లేకపోవడం కారణం. రామా నుజం జీవితాన్ని సమున్నత ప్రస్థానం వెైపునకు మర లించిన కీలకమైన మలుపు కూడా ఇదే. ఎందుకంటే కార్‌ పుస్తకంలో పేర్కొన్న ఫలితాలకు, రుజువులను ఆయన స్వంతంగా కృషిచేసి కనుగొన్నాడు. వి.రామ స్వామి అయ్యర్‌ అనే ఆయన 1907లో ఇండియన్‌ మ్యాథమెటికల్‌ సొసైటీని స్థాపించాడు. నిజానికి ఆయన దీన్ని స్థాపించి ఉండకపోతే రామానుజం ఆయన్ను కలవడం ఎన్నటికీ సాధ్యపడకపోవడమే కాదు… అతని జీవితంలోని తర్వాతి ఉన్నత ఘట్టాలు చోటు చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యేది కూడా కాదు. రామానుజం 1909 వరకూ స్వతం్త్రంగా గణిత శాస్త్రంపెై దృష్టి కేంద్రీకరించాడు.

వివాహం
1909 జూలెై 14న జానకీ అమ్మాళ్‌ను (32వ ఏట రామానుజం చనిపోయిన తర్వాత ఆయన భార్య జానకీ అమ్మాళ్‌ చెన్నైలో 1994 వరకూ జీవించింది.) వివాహం చేసుకోవడంతో భుక్తికోసం ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే రామానుజం ఉద్యో గం కోసం రామస్వామి అయ్యర్‌ను కలిసారు. మద్రా సు పోర్టు ట్రస్టులో క్లర్క్‌ ఉద్యోగంలో చేరారు. తరు వాత మద్రాసు యూనివర్శిటీలో రెండు సంవత్సరాల పరిశోధనలు చేశారు. తరువాత కేంబ్రిడ్జి యూనివర్శి టీలో చేరారు.

చివరి రోజులు
అక్కడ నుండి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తనవ చివరి రోజుల్లో చేసిన పరిశోధనలకు సంబంధించిన పత్రాలపెై, ఆండ్రూస్‌ మరింతశోధించి గణితశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విశ్లేషణలు చేశారు. చివరకు 1920 ఏప్రిల్‌ 26న మద్రాసుకు సమీపంలోని చెట్‌పేట్‌లో తుదిశ్వాస విడిచారు.

సహచరుడు
Ramanశ్రీనివాస రామానుజన్‌ కేంబ్రిడ్జి సహచరుడు, నాటి గణితజ్ఞులలో మేటి కొమరవోలు చంద్రశేఖరన్‌. ఈయన 1957లో టిఐఎఫ్‌ ఆర్‌ ద్వారా ‘‘నోట్‌ బుక్స్‌ ఆఫ్‌ శ్రీనివాస రామానుజన్‌’’ ప్రచురించి ఆ ఉపజ్ఞుడు రచించిన గ్రంథాలను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇక కొమరవోలు రచనలు గణితశాస్త్రంలో ఆనిముత్యాలే.

అలాంటివాడే
ఒక్కసారి కంప్యూటర్‌ స్క్రీన్‌పెై చూసి మరు నిమిషంలో 132 అంకెల సంఖ్యను అప్పజెప్ప డం ద్వారా అద్భుతమైన ప్రతిభను చూపిన 13 సంవత్సరాల కుర్రాడు నిశ్చల్‌ నారా యణన్‌. ఈ అరుదెైన మోథోప్రక్రియను చేయడం ద్వారా ఒక నిమిషంలో అత్యంత పెద్ద అంకెలు గల సంఖ్యాశ్రేణిని గుర్తుంచుకని అప్పజెప్పిన ఘనతను నిశ్చల్‌ సొంతం చేసుకున్నాడు.

నూటికి నూరు
మృత్యు పకిష్వంగంలోకి వెళుతూ కూడా గణితంలో అత్యున్నత క్రమానికి చెందిన పరిశోధనలు జరప డానికి కావలసిన మేథస్సు భగవంతుడు ఆయనకిచ్చిన వరం. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హార్డీ… గణితశాస్త్రవేత్తలకిచ్చే రేటింగ్స్‌లో రామానుజా నికి నూటికి నూరు పాయింట్లు ఇచ్చి తన స్థాయిని 25 పాయింట్లకే పరిమితం చేసుకోవడం రామానుజం ప్రతిభకు… హార్డీ విశాల దృక్పదానికి నిదర్శనం. గణిత శాస్త్రంలో ఉద్దండులెైన లిటిల్‌వుడ్గకు 30, హిల్‌బర్ట్‌కు 80 రేటింగ్స్‌ ఇవ్వడమంటే రామానుజం ఏస్థాయి గణిత మేధావో అర్థంకాక మానదు.

Raman-(3) నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ ఇయర్‌గణితశాస్త్రంలో రామానుజం సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డేగా జరుపుకోవాలని 2011లో ప్రకటించింది. ఈ సంవత్సరాన్ని నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ ఇయర్‌గా చేస్తున్నారు. తమిళనాడు రాష్ర్టం ప్రతిసంవత్సరం డిసెంబర్‌ 22ను రాష్ర్ట ఐటి దినంగా పాటిస్తుంది. వర్థమాన దేశాల్లో యువ గణిత శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కోసం ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ యూనియన్‌లు రామానుజం పేరిట ఒక బహుమతిని అందజేస్తున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top