You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » మానవాళికి శాంతి బహుమతి -బీనా సెబాస్టిన్‌

మానవాళికి శాంతి బహుమతి -బీనా సెబాస్టిన్‌

బీనా సెబాస్టియన్‌ జీవిత చిత్రాన్ని గమనిస్తే.. ఎలాంటి ప్రత్యేక అర్హత లేని ఒక సాధారణ మహిళ కూడా తగిన కృషి చేసి తన చుట్టూ ఉన్న కొన్ని వేల మంది జీవితాల్లో సరికొత్త వెలుగును తీసుకురావడానికి ప్రయత్నించవచ్చో తెలసుకోవచ్చు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా కొత్తగా ఉంటారుు. ప్రత్యక్షంగా సేవ చేస్తేనే గుర్తింపు ఉంటుంది అనేది చాలా మంది భావన. కానీ ఎలాంటి గుర్తింపు ఆశించకుండా మానవతా దృక్పథంతో పని చేయడమే కొందరి లక్ష్యం , జీవితాశయం. స్ర్తీసాధికారత కోసం కృషి చేసిన అధికారులకు, పోలీసు, న్యాయవాదులను తాను స్థాపించిన సంస్థ తరపున అవార్డులు అందిస్తుంది బీనా.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: బీనా సెబాస్టిన్‌
పుట్టిన సం	        : 1959
జన్మస్థలం   	: కొట్టాయమ్‌ ( కేరళ)
వృత్తి 		: సామాజికి సేవకురాలు
కీర్తి 		: నోబుల్‌ శాంతి బహుతికి 
		  నామినేట్‌ కావడం

Beenaమహిళాభ్యుదయానికి కృషి చేసిన వారికి అవార్డులను అందిచే ప్రోత్సాహాక వాతావరణాన్ని సృష్టిం చడం వల్ల కేరళలో పరిస్థితితులు, ప్రజల ఆలోచనా సరళి మారడం ప్రారంభమయ్యాయి. మహిళ లపై లైంగిక దాడులు, అకృత్యాల సంఖ్య తగ్గాయి. వివక్షతకు, అకృత్యాలకు గురైన ఎంతో మంది మహిళలకు ఆశ్రయాన్నివ్వడంతో పాటు వృత్తి విద్యలను నేర్పిం చడం, గతం గాయాలను దాటి సరికొత్త ప్రపంచంలో ప్రవేశించడం కోసం వారికి అవసరమైన సరికొత్త వాతావర ణాన్ని వారికి అందించారు. అన్యాయానికి గురైన వారికి న్యాయం అందించేందుకు కోర్టువరకు తోడుంటారామె. మహి ళలపై దాడులను తగ్గించేలా చర్యలు తీసుకునేందుకు అక్కడి రక్షణ సిబ్బందితో కలిసి పనిచేస్తుంటుంది

న్యాయం కోసం…
అనేక సంవత్సరాల నుంచి మహిళలపై జరుగుతున్న దుష్కృతా లను న్యాయస్థానానికి తీసుకెళ్లడంలో ఆమె చేసిన కృషి ఎం దరో స్ర్తీల జీవితంలో వెలుగును ప్రసాధించింది. ఆమె అభి ప్రాయం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు అని కాకుండా అన్ని రంగాల సంస్థలలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారు. ఏ దేశమైనా అత్యుత్తమ రాజ్యంగా ఎదగాలనుకుంటే మహిళల స్థితుగతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అంతర్జాతీయ శాంతి కోసం కృషి చేస్తున్న ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ రికన్సిలేషన్‌, కల్చరల్‌ ఆకాడమీ ఫర్‌ పీస్‌ వంటి సంస్థలలో సభ్యురాలిగా కీలక పాత్రపోషిస్తున్నారామె.

చిన్ననాటి సేవా దృక్పథమే…నేటికీ!
బీనా సెబాస్టిన్‌ కొట్టాయమ్‌ (కేరళ)లో 1959లో ఒక ఆశ్రమం లో జన్మించింది. ఈ ఆశ్రమాన్ని ఆమె తండ్రి స్థాపించాడు. 1950కు ముందు ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ రికన్సిలేషన్‌ సంస్థలో సభ్యుడిగా చేరిన తరువాత ఆయన వివక్షతకు గురైన, సొంతవారి ఆప్యాయతకు నోచుకోని మహిళల కోసం ఈ ఆశ్ర మాన్ని స్థాపించారు. చిన్ననాటి నుంచే ఆశ్రమ వాతావరణంలో పెరిగిన బీనా సేవలోనే ఎక్కువ సమయాన్ని గడిపేది.

విద్యతోనే మార్పు
వివాహానంతరం కోచికి మకాం మార్చినా ఆమె జీవిత లక్ష్యం మారలేదు. భర్త సహకారంతో స్థానిక మహిళలో ఆర్థిక, సామా జిక చైతన్యం కలిగించడానికి కృషి చేయడం ప్రారంభించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలనుంచి వచ్చే మహిళలు, యువతుల లో వృత్తి నైపుణ్యం పెంచడానికి 1990లో ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఆ తరువాత కొన్ని ప్రాజెక్టును చేపట్టడం స్థాని కుల సహాకారంతో వాటిని పూర్తి చేశారు. బైక్‌లలో వినియో గించే బ్యాటరీలను తయారు చేసే విధానాన్ని వివరించడం చేశారు.

శాంతియుత జీవన కోసం
Bee3కల్చరల్‌ అకాడమీ ఫర్‌ పీస్‌ (సిఎపి) అనే లాభాపేక్ష లేని సం స్థను స్థాపించి మహిళలతో పాటు వారి పిల్లల బాగోగులను కూడా చూసుకుంటుంది. వసతి నుంచి న్యాయస్థానం వరకు అన్ని విషయాలలో సహాయకారిగా నిలుస్తూ కొన్ని వేలమంది జీవితాలను సరికొత్త దిశానిర్ధేశాన్ని చేసింది బీనా. ఆ తరువాత ఆమె కార్యకలపాలు అంతర్జాతీయ గుర్తింపు సాధించాయి. యునెస్కో, భారత ప్రభుత్వంలో కలిసి అనేక సేవాకార్యక్రమాల ను కూడా నిర్వహించింది. 2005లో నోబుల్‌ శాంతి బహుమతి కోసం నామినేటైన 1000 మంది మహిళల్లో బీనా సబాస్టిన్‌ కూడా ఒకరు కావడం విశేషం.

అనేక సంవత్సరాల నుంచి మహిళలపై జరుగుతున్న దుష్కృతాలను న్యాయస్థానానికి తీసుకెళ్లడంలో ఆమె చేసిన కృషి ఎందరో స్ర్తీల జీవితంలో వెలుగును ప్రసాధించింది. ఆమె అభిప్రాయం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు అని కాకుండా అన్ని రంగాల సంస్థలలో మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు.భర్త సహకారంతో స్థానిక మహిళలో ఆర్థిక, సామాజిక చైతన్యం కలిగించడానికి కృషి చేయడం ప్రారంభించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలనుంచి వచ్చే మహిళలు, యువతులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి 1990లో ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఆ తరువాత కొన్ని ప్రాజెక్టును చేపట్టడం స్థానికుల సహకారంతో వాటిని పూర్తి చేశారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top