You Are Here: Home » ఇతర » మానని గాయం

మానని గాయం

1993 మార్చి 12. ఆ రోజు శివరాత్రి. దేశం మెుత్తం పండుగ జరుపుకుంటోంది. ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నారుు. ముంబయ్‌ నగరం కూడా ఇదే వాతావరణంలో ఉంది. సరిగ్గా సమయం మధ్యాహ్నం 1.30 అరుుంది. ఓ చోట బాంబు పేలింది. పదులు సంఖ్యలో ప్రజలు చనిపోయారు… ఎందరో విగతజీవులుగా మారారు. సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో పేలుడు.. దాని వెనుక ఇంకో పేలుడు…ఇలా 13 చోట్ల బాంబులు పేలారుు. ముంబయ్‌ చెల్లాచెదురరుుంది. జన రద్దీ ప్రాంతాల్లో బాంబులు పేలడంతో మృతులు సంఖ్య పెరిగింది. ఘటన మెుత్తం మీద 257 మంది చనిపోగా, 1400 మంది క్షతగాత్రులుగా మారారు. ఇప్పటికీ ఎందరో వికలాంగులుగా మారి నాటి సంఘటనను తలుచుకుని కన్నీరు పెట్టడమే కాదు.. వారి కళ్లల్లో ఇంకా భయం కనిపిస్తుంది. ఇది జరిగి నేటి రెండు దశాబ్దాలు… ముంబయ్‌ నగరంపై మానని మచ్చగా ఇది మిగిలిపోరుుంది.


bomబొంబాయ్‌(ప్రస్తుత ముంబయ్‌)లో 1993 మార్చి 12న పదమూడు చోట్ల బాంబులు పేలాయి. భారత దేశ చరిత్రలోనే ఇంత పెద్ద దాడి గతంలో, తరువాత ఎప్పుడు జరగలేదు. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోగా, సుమారు 1400 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలో తీవ్రవాదంతో దారుణంగా దెబ్బతిన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఇరాక్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నిలిచాయని ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదంపై సమా చారాన్ని సేకరించే గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ వెల్లడించింది. 1993 ముంబై పేలుళ్ల నుంచి ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడుల్లో 1300 మందికి పైగా చినిపోయారు.1993 మార్చి 12న మధ్యాహ్నం 13 ఆర్‌డిఎక్స్‌ బాంబులను ముంబై నగరంపై తీవ్రవాదులు ప్రయోగించారు. ఈ సంఘటన జరిగి నేటికి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సహా పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు.

అల్లర్లతో ఆరంభం
Bombay1992 డిసెంబర్‌ నుంచి జనవరి 1993 వరకు బాబ్రీ మసీద్‌ కూల్చివేత, రామ మందిర నిర్మాణంపై హిందు సంస్థల గొడవలు, అలర్లు జరిగాయి. ఎన్ని అల్లర్లు జరిగినా ముంబయ్‌లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఐదేళ్ల తరువాత మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 900 మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయపడ్డారు. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఇబ్బందులు పడ్డారు. మత పరమైన అల్లర్లకు కారణమైన గుల్లు అనే వ్యక్తిని సరిగ్గా బాంబు పేలుళ్లకు మూడు రోజుల ముందు అంటే 9 మార్చి 1993న పోలీసులు అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్‌లో గుల్లు ప్రముఖ పాత్రదారి. దీనికి నేల ముందు ఫిబ్రవరిలో గుల్లు, టైగర్‌ మీనన్‌ ఇద్దరూ దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌ చేరుకుని అక్కడ కారు బాంబు పేల్చడంలో శిక్షణ పొందారు. అల్లర్లను చూపించి కొందరు మతోన్మాదులను తమవైపు తిప్పుకున్నారు.

బాంబుల ఏర్పాటు
Bombay-(శిక్షణ ముగిసిన తరువాత 4 మార్చి 1993న దుబాయ్‌ మీదుగా గుల్లు ముంబయ్‌కు వచ్చేశాడు. స్మగ్లరైన గుల్లు దొరకకపోవడంతో అతని సోదరులను నిర్బంధించారు పోలీసులు. గుల్లు సరెండర్‌ కావాల్సిందిగా సమాచారం అందజేశారు. అతని సోదరుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో 9 మార్చి 1993న పోలీసులకు లొంగిపోయాడు గుల్లు. అల్లర్లలో తన పాత్ర నుంచి పాకిస్తాన్‌లో శిక్షణ, బాంబులు పెట్టడం అంతా పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే పోలీసులు ఈ బాంబులు పెట్టిన ఉదంతాన్ని నమ్మలేదు. గుల్‌ మహ్మద్‌ అరెస్టుతో మీనన్‌ మరింత రెచ్చిపోయాడు. 12 మార్చి 1993 శివరాత్రి రోజున పేలుళ్లు జరిపేందుకు అంతా రెడీ చేశాడు.

అంతా రెండు గంటల్లోనే
mumbaiblastసరిగ్గా మధ్యాహ్నం 1.30గంటలకు అత్యంత శక్తివం తమైన కారు బాంబు ముంబయ్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ వద్ద పేలిం ది. దీంతో బిల్డింగ్‌ తీవ్రంగా దెబ్బతింది. దీని పక్కనున్న అనేక భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. 50మంది అక్కడిక్కడే మృతిచెందారు. సరిగ్గా 30నిమి షాల తరువాత మరో బాంబ్‌ పేలింది. అలా 1.30 నుంచి 3.40 రెండు గంటల పది నిమిషాల వ్యవధిలో 13చోట్ల బాంబులు పేలాయి. వీటిలో ఎక్కువ కారు బాంబులే. మిగతా చోట్ల స్కూటర్లలో అమర్చారు.

తరువాత
ఈ పేలుళ్ల కారణంగా దాదాపు 257మంది మృతిచెందగా, 1400 మంది గాయపడ్డారు. చాలా రోజుల తరువాత ముంబయ్‌ రైల్వే స్టేషన్‌లో పేలకుండా మిగిలిన కారు బాంబులను కనుగొన్నారు. పేలుళ్ల వెనుక పాకిస్తాన్‌ తీవ్రవాద గ్రూపుల హస్తం ఉందని తేలింది. ఉగ్రవాదులతో చేతులు కలిపిన డి-కంపెనీ ఈ ఘోరకలికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. విషయం తెలుసుకునే సరికి డి-కంపెనీలోని చాలామంది దేశం విడిచి వెళ్లిపాయారు. పేలుళ్లకు ఆర్డీఎక్స్‌ను వినియోగించినట్లు విచారణలో వెల్లడయింది.

దావూద్‌ ఇబ్రహీం
dawood-ibrahim1955 డిసెంబర్‌ 27న మహారాష్టలో పుట్టాడు. డి-కంపెనీ స్థాపకుడు. ఇంటర్‌పోల్‌, సిబిఐ ఇతని కోసం వెదుకుతు న్నాయి. పోర్బ్‌‌స అత్యంత క్రిమినల్‌ జాబితాలో 3వ స్థానం పొందిన అండర్‌ వరల్డ్‌ డాన్‌. 1993లో జరిగిన బాంబు పేలుళ్లకు ఇతనే రూపకర్త అని సిబిఐ భావిస్తోంది. అయితే అంతకు ముందే ఇతను దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌ పారిపోయాడు. అతన్ని పట్టుకునే విషయమై మన ప్రభుత్వ పాకిస్తాన్‌ను పలుమార్లు విజ్ఞప్తి చేసినా తమ దేశంలో లేడంటూ దాటవేస్తోంది. ఉగ్రవాద సంస్థలతోనూ దావూద్‌కు సంబంధాలున్నాయి. ముంబయ్‌ పేలుళ్లకు ఉగ్రవాదుల సహకారం తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తు తం అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే కాదు తరువాత పలుసార్లు ఉగ్రవాదులు మన దేశ వ్యా పార రాజధానిగా పేరుపొందిన ముంబయ్‌ని టార్గెట్‌ చేశా రు. పేలుళ్లకు పాల్పడ్డారు. అయినా నగరవాసులు ఎప్పుటి కప్పుడు మనసు స్థిమితపరుచుకుని ప్రశాంత జీవితం గడుపుతున్నారు. తీవ్రవాదులు తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ముంబయ్‌వాసులు. ముంబయ్‌ పేలుళ్లపై పుస్తకాలు, సినిమాలు ఎన్నో వచ్చాయి. వాస్తవ కథనాలతో వచ్చిన ‘బ్లాక్‌ ఫ్రైడే’ బాగా గుర్తింపు పొందింది.

టైగర్‌మీనన్‌
tiger-menonఇబ్రహీం ముస్తాక్‌ అబ్దుల్‌ రజాక్‌ నదీమ్‌ మీనన్‌ అందరూ టైగర్‌ మీనన్‌ అని పిలుస్తారు. 1993లో జరిగిన ముంబయ్‌ పేలుళ్లలో ప్రధాన నిందితుల్లో ఒకడు. ఇప్పటికీ ఇతని జాడ కోసం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌, ఇంటర్‌పోల్‌ వేట సాగిస్తున్నాయి. డి-కంపెనీలో సభ్యుడు. లీడర్‌ దావూద్‌ ఇబ్రహీంకు నమ్మినబంటు. రోడ్డుపై కారును మెరుపు వేగంతో పరిగెత్తించగల దిట్ట. డ్రగ్స్‌, ఆయుధాలను స్మగ్లింగ్‌లో సిద్ధహస్తుడు. అందుకే ఇతన్ని టైగర్‌ అని పిలుస్తారు.

పేలుళ్లు జరిగిన ప్రాంతాలు…
మత్స్యకారుల కాలనీ
జవేరి బజార్‌
సెంచురీ బజార్‌
కథా బజార్‌
సీ రాక్‌ హోటల్‌
సహార్‌ విమనాశ్రయం
ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌
జుహు సెంటర్‌ హోటల్‌
ప్లాజా థియేటర్‌
లక్కీ పెట్రోల్‌ బంక్‌
బాంబే స్టాక్‌ ఎక్చేంజ్‌ బిల్డింగ్‌
సన్తా క్రజ్‌
పాస్‌పోర్టు కార్యాలయం

అరెస్టులు
Bombay-(1)మాఫియా గ్రూపులతో సంబంధం ఉన్న వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. 2006లో దాదాపు 100మందిని నిందితులుగా పేర్కొంటూ టెరరిస్ట్‌ అండ్‌ డిస్ట్రెపెటీవ్‌ యాక్టివిటీస్‌(టాడా) కోర్టులో హాజరుపరిచారు. టైగర్‌ మీనన్‌, దావూద్‌ ఇబ్రహీంతో పాటు ఇంకా కొందరు పరారీలో ఉన్నారు. అయితే పేలుళ్ల తరువాత టైగర్‌ సోదరుడు యాకుబ్‌ మీనన్‌ కుటుంబ సభ్యులను తీసుకుని ఎప్పుడో దేశం దాటిపోయాడు. వీరంతా పాకిస్తాన్‌లోనే ఆశ్రయం పొందినట్లు మన ప్రభుత్వం ఆధారాలు చూపిస్తున్నా పాక్‌ మాత్రం తోచిపుచ్చుతూ వస్తోంది. 1994లో టైగర్‌ తప్ప మిగతా అతని కుటుంబ సభ్యులు సిబిఐ ముందు లొంగిపోయారు. అదేవిధంగా నిందితుల జాబితాలో ఉన్న మహ్మమద్‌ ఉమర్‌ కత్లాబ్‌, బాద్‌షా ఖాన్‌లు అప్రూవర్స్‌గా మారిపోయారు. దావూద్‌ నేరుగా ఆల్‌ ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌తో, లష్కర్‌ ఎ-తోయిబాతోనూ సంబంధాలున్నట్లు లొంగిపోయినవారు వివరించారు.

యాకుబ్‌ మీనన్‌, యూసుఫ్‌ మీనన్‌, రుబినా మీనన్‌లు అరెస్టయినవారిలోఉన్నారు. 2007, జులైలో కొందరికి కోర్టు ఉరిశిక్ష విధించింది. వారిలో సోయబ్‌, అజ్గర్‌, షహనాజ్‌, అబ్దుల్‌ ఘని, పర్వేజ్‌, మహ్మద్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ యూసుఫ్‌, ఫారుక్‌, ముస్తాక్‌లు ఉన్నారు. సోయబ్‌ గాన్సర్‌ జావేరి బజార్‌ వద్ద స్కూటర్‌ బాంబ్‌, అజ్గర్‌ ప్లాజా సినిమా వద్ద వ్యాన్‌లో బాంబ్‌, అబ్దుల్‌ ఘని సెంచురీ బజార్‌ వద్ద, పర్వేజ్‌ కథా బజార్‌ వద్ద, మహ్మద్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ యూసుఫ్‌ సహార్‌ విమాశ్రయం వద్ద బాంబు పేల్చిన వారు. వీరితో పాటు మరికొందరికి జీవిత ఖైదు కూడా విధించింది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top