You Are Here: Home » ఇతర » మాట్లాడింది నేనే మాస్టారూ…!

మాట్లాడింది నేనే మాస్టారూ…!

వివేకానంద చిన్నప్పట్నుంచీ మంచి మాటకారి. ఆయన ఏం మాట్లాడినా అన్నీ మర్చిపోయి అంతా వింటూ ఉండిపోయేవారు. ఓసారి క్లాసుల మధ్య విరామంలో వివేకానంద తోటి విద్యార్థులకు కథ చెప్పడం మొదలుపెట్టాడు. విరామం అయిపోయింది. మాస్టారు వచ్చి పాఠం మొదలుపెట్టాడు. కానీ అందరూ కథ పూర్తి చేయమని పట్టుపట్టడంతో వివేకానంద మెల్లగా చెప్పసాగాడు.గుసగుసలు విన్న మాస్టారు ఒక్కొక్కర్నీ లేపి, తను ఏం పాఠం చెపుతున్నానని అడిగారు. అందరూ తెల్లముఖాలు వేశారు. కానీ ఓ పక్క మాట్లాడుతూనే పాఠం వింటున్న వివేకానంద మాత్రం టక్కున జవాబు చెప్పేశాడు. మాస్టారు వివేకానందను తప్ప, మిగిలిన వాళ్లందర్నీ బెంచీలెక్కించి నిలబడమన్నారు.
ఐతే వివేకానంద కూడా వారితోపాటు బెంచీ ఎక్కి నిలబడ్డాడు. నువ్వు కూర్చో అన్నారు మాస్టారు. దానికి వివేకానంద… అందరికంటే ముందు నేనే నిలబడాలి మాస్టారూ. ఎందుకంటే… అసలు మాట్లాడింది నేనే అన్నాడు. అతని నిజాయితీకి మాష్టారు మెచ్చుకున్నారు. ఆ నిజాయితీనీ వివేకానంద తన జీవితాంతం విడిచిపెట్టలేదు. కావున పిల్లలూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా… నిజాయితీగానే వుండాలి. నిజాయితీ ఒక్కోసారి అప్పటికప్పుడు సమస్యలు తెచ్చిపెట్టినా… తరువాత ఆ నిజాయితీనే మీకు జీవితంలో ఎల్లవేళలా తోడ్పాటునందిస్తుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top