You Are Here: Home » భవిత » మాటే ‘మంత్రం’

మాటే ‘మంత్రం’

‘మీ మాటలు ఎదుటి వారిని ఆకట్టుకుంటాయా… నలుగురిలో గలగల మాట్లాడే మనస్తత్వమా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. వినండి.. వినిపించండి..అంటూ చురుకుగా…ఆనర్గళం చెప్పగలరా..అరుుతే మీకు అవకాశాలు కో..కొల్లలు…శ్రోతలను కట్టిపడేసే మాటల మంత్రాలు మీలో ఉంటే మీకు రేడియో జాకీ (ఆర్‌.జె) ఉద్యోగాలు రా రమ్మని ఆహ్వానిస్తున్నారుు. ఎఫ్‌ఎంల హవా పెరుగుతున్న తరుణంలో యూత్‌ వీటిలో ఆర్‌ జెలుగా రాణిస్తూ శ్రోతలను అలరిస్తున్నారు. రేడియోకు మళ్లీ వైభవం వచ్చినంతగా వీరు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.. ఈ ఆర్‌ జెల కబుర్లను ఆసాంతం విన్న నేటి యువతరం తాము కూడా ఆర్‌జె అవతారం ఎత్తాలని కోరుకుంటున్నారు. సమాజంలో తమకూ మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఉత్సాహపడుతున్నారు. ఈ తరుణంలో మాటల మాంత్రికులపై ఈ వారం ‘స్టైల్‌’ ప్రత్యేక కథనం ఇది…’

Radమీరు కాలేజీలో చలాకీగా..చురుగ్గా ఎదుటి వారిని ఆట పట్టించడంలో ముందుంటారా ? నలుగురినీ నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకుంటారా… అయితే మీలాంటి వారి కోసం రేడియో జాకీ పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. టెలివిజన్‌ ఛాన్స్‌ రాక మునుపు రేడియో అంటే ఎంతోమంది ఇష్టపడేవారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో రేడియోలు వినే శ్రోతల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయితే ఎఫ్‌ఎం స్టేషన్లు ప్రారంభం కావడంతో రేడియో స్టేషన్‌లలో యూత్‌ జోరుగా, హుషారుగా మాట్లాడుతూ పలు కార్యక్రమాలను శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఇష్టమైన నటీనటులతో ఎఫ్‌ఎం స్టేషన్‌లలో శ్రోతలు సందడి చేసే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు.

ఆర్‌జెలు కేవలం మాటలకే పరిమితం కాకుండా సమాజ సేవకు సైతం ముందుకు వస్తున్నారు. భాగ్యనగరంలో జరిగే పలు కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు శ్రోతలకు చేరవేస్తూ ట్రాఫిక్‌ జామ్‌ల వివరాలను కూడా అందిస్తున్నారు. టెలివిజన్‌ ఛానల్స్‌తోపాటు నేడు ఎఫ్‌ఎం రేడియోలు యువతరంతోపాటు అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ప్రసారాలను చేస్తున్నాయి. ఉదయం భక్తి పాటల నుంచి మొదలుకుని అన్ని వయసుల వారికి అవసరమైన ప్రసారాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

భాగ్యనగరంలో ప్రత్యేక శిక్షణ…
Raaరేడియో జాకీలుగా చేరాలనుకునే వారి కోసం భాగ్యనగరంలో ప్రత్యేక శిక్షణా సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. ఎలా మాట్లాడాలో..ఎదుటి వారిని ఆకర్షించేలా ఇందులో తర్ఫీదు ఇస్తున్నారు. హైదరాబాద్‌ పంజగుట్టలోని టోపాల్‌ బిల్డింగ్‌లో లారస్‌ అకాడమీ పేరుతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లలో పనిచేసేందుకు అవసరమైన ఆర్‌జెలు, ప్రొడక్షన్‌ సిబ్బంది కోసం అవసరమైన కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, రేడియో జాకీలైన్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ పేరిట యువతకు ప్రత్యేక బోధన కొనసాగిస్తున్నారు.

ఆర్‌జెలపై యువతరం మోజు…
తమకు ఇష్టమైన రేడియో జాకీలపై యూత్‌ ఆసక్తి చూపుతున్నారు. తమకు ఇష్టమైన అలనాటి మేటి పాటలను ఏరికోరి మరీ ప్రసారం చేయించుకుని సంగీత సాగరంలో తడిసి ముద్దవుతున్నారు. ఆర్‌జెలు కూడా యువత మనోభావాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను అనుసరిస్తూ వారి ఇష్టాఇష్టాలకు చేయూత ఇస్తున్నారు. రేడియో జాకీలు కూడా యువతీ, యువకులతో సరదాగా మాట్లాడుతూ జోక్స్‌ చెబుతూ శ్రోతలకు మరచిపోలేని అనుభూతిని కల్పిస్తున్నారు.

పెరుగుతున్న ఉపాధి అవకాశాలు…
Rada ఎఫ్‌ఎం స్టేషన్లు పెరుగుతున్న తరుణంలో యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి .ప్రస్తుతం బిగ్‌ ఎఫ్‌ఎంతోపాటు 93.5, రేడియో మిర్చి, రెయిన్‌ బో ఇలా ఏర్పాటైన రేడియో స్టేషన్లలో చాలామంది పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ తమ చదువులను ఎంచక్కా కొనసాగిస్తున్నారు. మరికొంతమంది ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఎఫ్‌ఎం రేడియోలలో వార్తలకు కూడా ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో రేడియో జర్నలిజంకు డిమాండ్‌ పెరుగుతోంది. గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ఎఫ్‌ఎం ప్రసారాలు ప్రస్తుతం చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్న తరుణంలో ఆర్‌జెలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇస్కా రాజేష్‌బాబు,
‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, శరత్‌, రమణాచారి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top