You Are Here: Home » ఇతర » మాంటిస్సోరి పాఠశాల వ్యవస్థాపకురాలు కొమర్రాజు అచ్చమాంబ

మాంటిస్సోరి పాఠశాల వ్యవస్థాపకురాలు కొమర్రాజు అచ్చమాంబ

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సోదరి, 1905లో అకాల మరణం చెందినపుడు ఆమె మీద గల అపార మమకారంతో లక్ష్మణరావు ఆమరుసటేడు గుంటూరులో 1906 అక్టోబరు 6న జన్మించిన తన కుమార్తెకు అచ్చమాంబ అని పేరు పెట్టారు. తల్లి రామ కోటమాంబ. ఆమె బాల్యమంతా చెన్నైలో గడచి పోయింది. ఆనాడు రాష్ట్రోద్యమంలో, జాతీయోద్యమంలో కృషిచేస్తున్న ఆచంట లక్ష్మీపతి, రుక్మిణీ దేవి దంపతులు వారి కుటుంబానికి మిత్రులు. కనుక చదువుకొనే రోజులలో జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు.

2aomarవిదేశీ వస్తు బహిష్కరణ చేశారు. నూలు వడికారు. ఖద్దరు ధరించారు. 1923 లో తనను తీర్చిదిద్దే తండ్రి లక్ష్మణరావు మరణించారు. జీవితంలో ఒక గమ్యం ఉండా లనే ఉద్దేశంలో ఆమె మెడికల్‌ కాలేజీలో చేరారు. అయిన జాతీయోద్యమ ప్రభావం ఆమెను వెన్నంటుతూనే ఉంది. సైమన్‌ కమీషన్‌పై వ్యతిరేక నినాదాలు చేశారు. రుక్మిణీదేవి స్థాపించిన యూత్‌ కమిటీలో చేరారు. తల్లితో సహా ఉప సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. తుపాకీ దెబ్బలు తిన్న క్షతగాత్రులకు సేవలు అందించారు. 1931 నాటికి ఆమెకు మెడిసన్‌లో డిగ్రీ చేతికి వచ్చింది. ఆ తరువాత శిశు సంరక్షణ, ప్రసూతి శాస్త్రాలు అధ్య యనం చేశారు. పేదలకు వైద్యసేవలు అందించాలనే సత్సంకల్పంతో విజయవాడలో 1936లో స్థిరపడ్డారు. పేదలకు అమూల్యమైన సేవలను అందించారు.

ఇందు ఉచితంగా సేవ అందుకొనే వారే ఎక్కువ. వామపక్ష సిద్ధాంతం వైపు, హేతువాద భావాలవైపు బాగా ఆకర్షితులయ్యారు. ఆ సంబంధ ఉద్యమాలలో పాల్గొంటూ వచ్చారు. పైగా ఆదినాలలో మహిళలకు చదువుకొనే అవకాశాలు తక్కువ. వారికి చదివే ఆసక్తి తక్కువ. మహిళలలో ముందుగా సామాజిక స్పృహ పెంచేందుకు వాడవాడలా మహిళా సంఘాలు ప్రారంభించారు. స్ర్తీలలో విజ్ఞాన వికాసం కలిగించాలనే ఉద్దేశంతో ప్రసూతి – శిశుపోషణ అనే అంశాన్ని రాశారు. బాగా సులభశైలిలో రాసినందున ఈ గ్రంథం బహుళ ప్రచారాన్ని పొందింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్తలు యుద్ధంలో మరణిిస్తే, వారి భార్యలకు మహిళా సంఘాల ద్వారా తగిన సాయం చేశారు. స్ర్తీలకు ఆత్మరక్షణ పోరాటాలను నేర్పారు.

తెలంగాణా ప్రాంతంలోనూ మహిళలకు శిక్షణ శిబిరాలు నిర్వహించి వారిలో చైతన్యం పెంచారు. క్రమంగా ప్రజలకు సన్నిహితులైనారు. కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖ కార్యకర్త వఝుల వెంకటరామ శాస్ర్తిని 1940లో వివాహం చేసుకున్నారు. పిల్లలకు క్రమబద్ధమైన విద్య అందించాలనే ఉద్దేశంతో విజయవాడలో మాంటిస్సోరి పాఠశాల 20 మంది పిల్లలతో ప్రారంభించారు. నేడు ఆ పాఠశాల సర్వతోముఖంగా విస్తరించి, పలుశాఖ లుగా విరాజిల్లుతోంది. ఏ కారణం చేతయినా స్ర్తీకి అక్రమసంతానం కలిగితే వారిని అక్కున చేర్చుకుని ఆదరించేవారు. ఆశ్రయం ఇచ్చేవారు. సుఖ ప్రసవానికి తోడ్పడేవారు.

తల్లులు ఆ బిడ్డలను అవసరం లేదంటే తానే పెంచేవారు. అభాగ్య స్ర్తీలకు చట్టబద్ధంగా వివాహాన్ని జరిపించేవారు. ఇలా పలురీతుల మహిళలను ఆదుకొని వారికి మహోపకారం చేశారు. 1938లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నపడు 10 మాసాలు రాయవేలూరులో కారాగారశిక్ష అనుభవించారు. జీవితాంతం మహిళా ఉద్యమానికి కృషిచేస్త్తు 1964 అక్టోబరు 20న, విజయవాడలో కన్ను మూశారు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top