మహిళలు – యోగాభ్యాసం
మహిళలు – యోగాభ్యాసం
యోగాభ్యాసం ప్రారంభించిన మహిళలు ప్రారంభంలో తేలిక ఆసనాలు వేయాలి. తర్వాత పెద్ద ఆసనాలు వేయాలి. అలా వేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాకుండా నైపుణ్యం సంపాదించి ఇతర మహిళలకు కూడా నేర్పించి మంచి మార్గం చూపించగలరు.
స్ర్తీలు యోగాభ్యాసం చేసేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి
పిరియడ్స్ అయ్యే సమయంలో యోగాభ్యాసం చేయకూడదు. ఆ మూడు నాలుగు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
- సామాన్య పద్ధతిలో ప్రసవించిన స్ర్తీ, ప్రసవించిన 45 రోజుల తర్వాత నుంచి తేలిక ఆసనాలు ప్రారంభించవచ్చు.
- ఆపరేషన్ జరిగి ప్రసవించిన స్ర్తీలు మూడు, నాలుగు మాసాల వరకు యోగాభ్యాసం చేయకూడదు. అయితే ఇంట్లో, అటు ఇటు బాగా తిరుగుతూ ఉండాలి. ఆ తర్వాత యోగాభ్యాసం చేయవచ్చు.
- సూర్య నమస్కారాలు మహిళలకు టానిక్‌గా పని చేస్తాయి. శరీర అవయవాలు శక్తిని పుంజుకుం టాయి. పిరియడ్స్ అయినప్పుడు, గర్భం ధరించినప్పుడు వారు సూర్య నమస్కారాలు చేయకూడదు.
- గర్భిణి స్ర్తీలు తేలిక ఆసనాలు మాత్రమే వేయాలి. ఆరో మాసం నుంచి సూక్ష్మ యోగ క్రియలు మాత్రమే చేయవచ్చు.