You Are Here: Home » విశేషం » మహా రాణులు

మహా రాణులు

మహా రాణులు

 

చాలా మంది రాజరికపు పాల అంతరించిందని భావిస్తున్నారు. కానీ నేటికీ బ్రిటన్‌ భుటాన్‌, సౌదీ అరేబియా, బ్రూనే, జోర్డాన్‌ వంటి దేశాల్లో ఈ వ్యవస్థ అమలులో ఉంది. బ్రిటన్‌కు మహారాణిగా ఎలిజబెత్‌ ఇటీవలే 60 వసంతాలను పూర్తి చేసుకున్నారు కూడా. సౌది అరేబియా రాణి ఫాతిమా కుల్సువ్గు, భుటాన్‌ రాణి ఆషీ, జోర్డాన్‌ దేశ క్వీన్‌ రానియా వంటి మహారాణులు తమ దేశాల ప్రజల మద్దతు, అభిమానాలతో నేటికీ మహారాణి ెదాలో ఉన్నారు. వీరిలో కొందరైతే అందాల రాశులుగా కూడా గుర్తింపు సాధించారు.
మహా రాణులుఇంగ్లాండ్గ మహారాణి ఎలిజబెత్‌ అలె గ్జాండర్‌ మ్యారి విన్డ్‌సర్‌ 2011లో మంచి పాపులారిటీని సంపాదిం చారు. బ్రిటన్‌ వాసుల సపోర్ట్‌ ఆమెకు పెరిగినట్టు ఒక సర్వే తెలి పింది. ఈ ఏడాది మహారాణిగా ఆమె 60 ఏళ్లను పూర్తి చేసుకోను న్నారు. ఆ సర్వే ప్రకా రం రాజకు టుంబంపై బ్రిటన్‌ వాసులకు మంచి అభిమానం ఉంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులలో అందాల రాణిగా ఫాతిమాను చెప్పుకోవచ్చు. సౌది అరేబియా మహారాణిగా ఉన్న ఆమె గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన వారి సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు.

ఇంగ్లాండ్‌
క్వీన్‌ ఎలిజబెత్‌
queedఇంగ్లాండ్‌ మహారాణి ఎలిజబెత్‌ అలెగ్జాండర్‌ మ్యారి విన్డ్‌సర్‌ 2011లో మంచి పాపులారిటీని సంపాదించారు. బ్రిటన్‌ వాసుల సపోర్ట్‌ ఆమెకు పెరిగినట్టు ఒక సర్వే తెలిపింది. ఈ ఏడాది మహారాణిగా ఆమె 60 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ఆ సర్వే ప్రకారం రాజకుటుంబంపై బ్రిటన్‌ వాసులకు మంచి అభిమానం ఉంది. 85 ఏళ్ళ ఈ మహారాణి ఇద్దరు మనవల్లు వివాహం చేసుకోవడంతో ఈ ఘనత సాధ్యం అయ్యింది. అంతేకాకుండా ఐర్లాండ్‌ దేశానికి అమె చారిత్రాత్మకమైన టూర్‌కు వెళ్లడం, 90 ఏళ్ళ ప్రిన్స్‌ ఫిలిఫ్స్‌ ఆసుపత్రికి వెళ్ళడం వంటి అనేక విషయాల వల్ల 2011లో ఆమె హైలైట్‌గా నిలిచారు.‚ ఆమె ్రపస్తుతం 16 సౌర్వభౌమ దేశాలకు మహారాణి.1947లో ఆమె ప్రిన్స్‌ ఫిలిప్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన ఎడిబర్గ్‌ దేశానికి డ్యూక్‌.వారిరువురికి నలుగురు సంతానం చార్లెస్‌, అన్నే, ఆండ్య్రూ, ఎడ్వార్డ్‌లు. అయితే ఈ వివాహం కొన్ని వివిదాలకు కారణం కూడా అయ్యింది. ఫిలిప్‌ కుటుంబానికి సంబందించి కొంత వివాదం జరిగింది.

సౌది అరేబియా
ఫాతిమా కుల్సువ్గు జోహర్‌ గొడాబరి
fatiప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులలో అందాల రాణిగా ఫాతిమాను చెప్పుకోవచ్చు. సౌది అరేబియా మహారాణిగా ఉన్న ఆమె గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన వారి సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. ఇన్నాళ్లు ఆమె ఎలా ఉంటుందో అనే అంశంపై అనేక ఊహాగానాలు జరిగాయి. కానీ ఇటీవలే విడుదలైన ఆమె ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆమె ఫోటోలను చూసిన యువకులు మనసును అదుపులోకి పెట్టుకోలేకపోయారు. ఆమెను ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవంతమైన స్ర్తీగా పోల్చడం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో, బ్లాగ్స్‌లో అమె ఫోటోలను తెగ డవున్‌లోడ్‌ చేశారు. పై ఫోటోలను చూస్తే వారు ఇలా ఎందుకు చేశారో మీకే అర్ధమౌతుంది.

జోర్డాన్‌
క్వీన్‌ రానియా
Quజోర్డాన్‌ దేశానికి మహారాణి రానియా అల్‌ అబ్దుల్లా. ఆమె కేవలం రాజభనానికే,కుటుంబానికే పరిమితమవ్వకుండా పాలనా వ్యవహారాలలోనూ పాలుపంచుకుంటారు. జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు ఆమె సతీమణి. లౌకిక జ్ఞానం ఉన్న మహారాణి రానియా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని మంచి పేరుంది. దేశంలోని బాలబాలికలకు విద్యాభ్యాసాన్ని అందించాలని, దీంతో భవిష్యత్తులో దేశం అభివృద్ధి పథంలో మిగితా దేశాలకు సాటిగా దూసుకెళ్లగలదని ఆమె నమ్మకం.కువైట్‌లో జన్మించిన రానియా అక్కడే ప్రాధమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఉన్నత విద్యాభ్యాసాన్ని ఈజిప్ట్‌లో పూర్తి చేశారు. అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశాక అమాన్‌లోని సిటిబ్యాంక్‌, ఆపిల్‌ సంస్థలో ఉద్యోగం కూడా చేశారు. హార్పర్స్‌ అండ్‌ క్వీన్స్‌ మ్యాగజైన్‌ 2005లో ఆమెను మూడవ అత్యంత సౌందర్యవంతమైన మహిళగా పేర్కొంది.

భూటాన్‌
ఆషి జెట్సూన్‌ పెమా
Buభూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ సతీమణి, భుటాన్‌ మహారాణి ఆషి జెట్సూన్‌ పెమా గతేడాది ప్రపంచం దృష్టిని తన వైపు లాక్కుంది. రాజకీయ చరిత్ర కలిగిన జన్మించిన ఆషి రాజుతో వివాహం చేసుకోవడం విశేషమే. ఆషి థింఫూలో 1990 జూన్‌ 4న జన్మించారు. ఆమె తండ్రి ధోండుప్‌ పూర్వికులు రాజకీయంలో ఉన్నత స్థానాలలో పదవి బాధ్యతలను నిర్వహంచారు. 2011 మే 20 న ప్రారంభమైన భుటాన్‌ పార్లమెంట్‌ సభలో రాజు జిగ్మే..ఆషిని వివాహమాడనున్నాననే వార్తను ప్రపంచానికి తెలియజేశారు. కొన్ని నెలలు గడిచాక వారి వివాహం సాంప్రదాయ బద్దంగా జరిగింది. వివాహానంతరం ఈ జంట భారతదేశానికి సందర్శించి ప్రేమకు చిహ్మమైన తాజ్‌ మహల్‌ను సందర్శించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top