You Are Here: Home » ఇతర » మళ్లీ తెరపైకి తీహార్‌

మళ్లీ తెరపైకి తీహార్‌

ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ జైలు పేరు వింటేనే ఖైదీకు వణుకుపుట్టేది. కరుడుగట్టిన నేరస్తులను మాత్రమే అక్కడికి తరలిస్తారని, శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయని పేరు. ఎవరినైనా తీహార్‌ జైలుకు తరలిస్తున్నారంటే వాడి పని అరుుపోనట్లే అని భావించేవారు. కానీ 1984 నుంచి ఈ జైలులో సంస్కరణలు ప్రారంభమయ్యారుు. కిరణ్‌బేడీ జైళ్ల శాఖ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌గా రావడంతో దీని దశ తిరిగింది. ఖైదీలకు సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. టి.జె.(తిహార్‌ జైలు) అనే బ్రాండ్గ నేవ్గుతో ఉత్పత్తులను తయారీ ప్రారంభించారు. చదువు నేర్పడం, మెడిటేషన్‌, ఆటలు ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చారుు.

ఇక్కడ శిక్షణ పొందిన ఓ ఖైదీ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సివిల్‌ సర్వీస్‌కు ఎంపికవడం జైలు పనితీరుకు అద్దంపడుతోంది. ఇలాంటి మార్పులతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో ప్రముఖులను అరెస్టు చేసినప్పుడు ఈ జైలు తరలించడం ఆనవారుుతీగా మారింది. ఎ.రాజా, కనిమెుళి, అన్నా హజారే, అరవింద్‌ ేకజ్రీవాల్‌, సురేష్‌ కల్మాడి, ఓం ప్రకాశ్‌ చౌతలా వంటి పెద్దలంతా ఇక్కడికి వచ్చినవారే కావడం విశేషం… తాజాగా పన్నేండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డవారిలో కీలక నిందితుడు అఫ్జల్‌ గురును శనివారం ఇక్కడే ఉరితీశారు. ఈ సందర్భంగా తీహార్‌ జైలుపై నేటి కలర్స్‌…

10Colఅఫ్జల్‌గురు… కరుడుగట్టిన తీవ్రవాదానికి ఆకర్షితుడై.. కుట్రలకు కుతంత్రాలకు పాల్పడిన వారికి చేయూతనిచ్చిన కాశ్మీర్‌ముస్లిం. వైద్యవిద్య అభ్యసించినా ప్రయోజనం లేని తీవ్రవాదానికి లొంగిన వ్యక్తి. పార్లమెంట్‌పై దాడికి తెగబడినవారికి సాయపడి… చట్టానికి చిక్కి… 12 సంవత్సరాలుగా ప్రాణాన్ని కాపాడుకున్న ‘గురు’ చివరకు తీహార్‌ జైలులో ఈ ఉదయం ఉరికంబం ఎక్కాడు. మృతదేహం ఖననం కూడా జైలులోనే జరిగింది. ఒకప్పుడు కరుడుగట్టిన నేరగాళ్లను వణికించే జైలుగా పేరుగాంచిన తీహార్‌ ఇప్పడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. శిక్షపడిన పేరుమోసిన నేరగాళ్లు… ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులు… అవినీతి సామ్రాట్టులతో కిక్కిరిసిన తీహార్‌ జైలు ఓ దశాబ్దం నాటికి.. ఇప్పటికీ ఎంతో మారింది. మారవలసింది ఖైదీలు.. నేరగాళ్లు. అందుకు తగిన వాతావరణం అక్కడుంది.

Afzalఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటుంటారు. జైలు చుట్టూ ఉన్నది హరినగర్‌ ప్రాంతం. 1957లో నెలకొల్పిన ఈ జైలులో ఇప్పుడు 6251 మంది ఖైదీలకు సరిపోయేలా పూర్తి సౌకర్యాలు ఉన్నాయి. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడంలో తీహార్‌ జైలు విన్నూత రీతులను పాటిస్తోంది. వారి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టే వరకు వారికి పలు రంగాల్లో శిక్షణ, చదువు చెప్పించడం, చట్టాన్ని గౌరవించడం లాంటి వాటిని నేర్పిస్తారు. పనిని నేర్చుకోవడానికి వారు ఏ రంగానై్ననా ఎంచుకోవచ్చు. ఖైదీలకు సంగీతంలో శిక్షణ ఇచ్చి వారితో కచేరీలు ఇప్పించమే గాక సంగీత వైద్యం కూడా చేయిస్తారు. తీహార్‌ జైలులో తయారైన వస్తువులకు ప్రత్యేక బ్రాండ్‌ కూడా ఉండడం గమనార్హం. 6251 మంది సరిపోయే ఈ జైలులో ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపులో ఖైదీలు ఉండటం విమర్శలకు తావిస్తోంది.

ప్రత్యేకత…
kitan-bedi_003గతంలో పంజాబ్‌ రాష్ట్రంలో అత్యంత కట్టుదిట్ట భద్రత మధ్య నడుస్తున్న జైళ్లలో తీహార్‌ ప్రముఖమైంది.1966లో దేశ రాజధాని ఢీల్లీ పరిధిలోకి తీసుకొచ్చారు.1984లో జైలుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి తీహార్‌ జైలుగా మార్చారు.కిరణ్‌ బేడీ జైళ్ల శాఖ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌గా పనిచేసిన సమయంలో తీహార్‌లో ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు.జైలు పేరును కూడా మార్చి ఆశ్రమంగా నామకరణం చేశారు. జైలు సిబ్బందితోపాటు ఖైదీలకు నిత్యం మెడిటేషన్‌ చేయించేవారు.ఎస్‌.ఎన్‌.గోయంకా ఈ క్లాస్‌లను క్రమం తప్పకుండా నిర్వహించేవారు. ఇక్కడ శిక్షణ పొందిన ఓ ఖైదీ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సివిల్‌ సర్వీస్‌కు ఎంపిక కావడం జైలు పనితీరుకు నిదర్శనం.

విఐపిల ‘కారాగారం’….
shobraj

 • మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు.
 • 1986 మార్చి 16న క్రిమినల్‌ చార్లెస్‌
  శోభరాజ్‌ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయితే అతి త్వరలోనే మళ్లీ దొరికిపోయాడు. అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినం దుకు మరో పదేళ్లు అదనపు శిక్ష పడింది. దీం తో 17 ఫిబ్రవరి 1997 వరకు ఊచలు లెక్క బెట్టాల్సి వచ్చింది.
 • అస్సాం మాజీ విద్యాశాఖామంత్రి రిపున్‌ బోరా డానియల్‌ టాప్‌నో హత్యకేసులో ప్రధాన నింది తుడు. 3 జూన్‌ 2008న సిబిఐ బోరాను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
 • డిఎంకె ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, ఎం.కె.కని మొళి, వినోద్‌ గోయంకా, షాహిద్‌ బల్వా, సంజయ్‌ చంద్రా లను 2జీ కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు.
 • ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్‌ కల్మాడీని 2010లో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు.
 • అవిశ్వాసం సమయంలో డబ్బు ఎర చూపి ఎంపిలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్‌ వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇదే జైలులో ఉండాల్సి వచ్చింది.
 • అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు.
 • హర్యాన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతలా, అతని కుమారుడు అజయ్‌ చౌతలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు.
 • లోపాలు…సమస్యలు….
  tihar-(1)విచారణ నిర్వహించే వికలాంగ ఖైదీల కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు.
  ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిల్‌, టెస్టింగ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం తీహార్‌ జైలులో ఉన్న 6 నుంచి 8 శాతం మందికి హెచ్‌ఐవి పాజిటివ్‌గా నమోదయింది. ఇది మన దేశంలో ప్రస్తుతం హెచ్‌ఐవి ఉన్న వారి శాతం కంటే ఎక్కువ.

  ఉత్పత్తుల తయారీ…

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top