You Are Here: Home » ఇతర » మలంలో రక్తం పడుతుంటే జాగ్రత్త!

మలంలో రక్తం పడుతుంటే జాగ్రత్త!

మలంలో రక్తం పడుతుంటే నిర్లక్ష్యం కూడదు. సాధారణంగా మలం పసుపు రంగులో ఉంటుంది. కొన్ని సార్లు రక్తపు చారికలు కనిపిస్తారుు. జీర్ణ వ్యవస్థలో ఉండే చిన్న పాటి ఇబ్బందులే కారణం అని సరిపెట్టేసుకొంటారు. ఇది క్రమం తప్పకుండా జరుగుతుంటే ఎక్కడో సమస్య ఉందని గుర్తుంచుకోవాలి. మలంలో రక్తం ఎరుపు రంగులో పడుతుంటే అప్పటికప్పుడు తాజా రక్తం పడుతున్నట్లు అన్నమాట. ఒకో్కసారి రక్తం నిల్వ ఉండి నలుపు రంగులో పడుతుంది. ఇది కూడా ప్రమాదకరమే. శరీరంలో ప్రవహించాల్సిన రక్తం మలంలో కలుస్తోందంటే జీర్ణ వ్యవస్థలో ఎక్కడ నుంచో ఇది బయటకు లీక్‌ అరుుందని గుర్తించుకోవాలి. అంటే ఆ ప్రదేశంలో అనారోగ్యం సోకినట్లు చెప్పవచ్చు.

21Feafరక్తంలో మలం పడుతుంటే ఇతర అనారోగ్య లక్షణాలు కూడా బయట పడతాయి. వాస్తవానికి రక్తంలో శక్తికారకమైన పదార్ధాలు ఉంటాయి. ఇవి బయటకు పోతుండటంతో నీరసంవచ్చేస్తుంటుంది. అనీమిక్‌గా తయారవుతారు. బరువు తగ్గిపోవటంతో పాటు కడుపులో నొప్పి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ అన్ని వయస్సుల వారికి వస్తుంటాయి. కానీ, మధ్య వయస్సు, ఎక్కువ వయస్సు వారికి మరింత ఎక్కువ గాఉంటాయి. రక్తం పడటం, తదుపరి నీరసంతో చిరాకు పెరిగిపోతుంది. ఇది కోపంగా మారుతుంటుంది.మలంలో రక్తం పడటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మలం అనేది జీర్ణ క్రియ పూర్తయ్యాక ఏర్పడే పదార్థం. ఆహారంలో శక్తి వంతమైన పదార్థాల్ని శరీరంలోకి శోషించుకొన్నాక మిగిలిన వ్యర్థ పదార్థాలు మలంగా మారి పురీష నాళంలోకి చేరతాయి.

ఆహారం నోటిలో ప్రవేశించి జీర్ణవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. అక్కడ కొంత జీర్ణం అయ్యాక ఆంత్రమూలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ కాలేయ స్రవించే పైత్యరసం, క్లోమం స్రవించే క్లోమరసంతో లుస్తుంది. అక్కడ కొంత జీర్ణం అయ్యాక శేషాంత్రికంలోకి చేరి.. అక్కడ పూర్తిగా జీర్ణ ప్రక్రియం సాగుతుంది.ఆ తర్వాత పెద్ద పేగులోకి చేరాక శోషణ ప్రక్రియ పూర్తయ్యాక పురీష ంలోకి చేరును. ఈ క్రమంలో ఎక్కడ ఇన్‌ ఫెక్షన్‌ సోకిందో గుర్తించాలి. ఎగువ ఆహార వాహికలో కానీ, దిగువ ఆహార వాహికలో కానీ సమస్య ఉండవచ్చు.నిల్వ ఆహారం, చెడిపోయిన ఆహారం, అపరిశుభ్ర ఆహారం లేక తాగునీటిని తీసుకొన్పప్పుడు ఎశ్చరీషియా కొలై వంటి బ్యాక్టీరియాలు విజ్రంభిస్తాయి. ఎంటమీబా హిస్టాలిటికా వంటి ప్రోటోజోవన్‌ లు కూడా ఆహారాన్ని విషతుల్యం చేస్తుంటాయి. ఇటువంటి పరాన్నజీవుల కారణంగా విరోచనాలు జరుగుతుంటాయి. ఇటువంటప్పుడు మలంలో రక్తపు చారికలు కనిపిస్తుంటాయి.పురీష నాళంలో క్యాన్సర్‌ తలెత్తినప్పుడు రక్తం పడుతుంటుంది. దీన్ని కొలరెక్టల్‌ క్యాన్సర్‌అని పిలుస్తారు.

Dig-(1)అక్కడ అవాంఛనీయ కణజాలం పేరుకుపోయి కణితి మాదిరిగా ఏర్పడుతుంది. ఇక్కడ ఒత్తిడి కలిగినప్పుడల్లా రక్తం బయటకు స్రావితం అవుతుంది. సాధారణంగా ఇది ఎక్కువ వయస్సు వాళ్లలో కనిపిస్తుంది.ఎగువ ఆహార వాహికలో ఇన్‌ ఫెక్షన్‌ సోకినప్పుడు రక్త స్రావం జరుగుతుంది. ఇక్కడ రక్త నాళాలు చిట్లినప్పుడు రక్తం విడుదల అవుతుంది. ఇటువంటప్పుడు అనీమియా, ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవటం వంటి లక్షణాల్ని కూడా గమనించవచ్చు. కొన్ని సార్లు అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.కడుపులో అల్సర్‌లు ఉంటే అప్పుడప్పుడు రక్తం కారుతుంది. జీర్ణాశయంలో కానీ, జీర్ణ వాహికలో కానీ ఇవి ఏర్పడతాయి. వీటికితోడు హెలికోబ్యాక్టర్‌ పైలోరి ఇన్‌ ఫెక్షన్‌ కలిస్తే ప్రమాదం. కడుపులో క్యాన్సర్‌ తలెత్తినా రక్త స్రావం కనిపిస్తుంటుంది.ఇదంతా ఒక ఎత్తయితే, కడుపులో ఇన్‌ ఫ్లమేటరీ బౌల్‌ డిసీజ్‌ మరో ఎత్తు. జీర్ణ వాహికలో పొరలు చిట్లడం వలన సమస్య తలెత్తుతుంది. కడుపులో నొప్పి, రక్తపు విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి.

కేవలం పెద్ద పేగు, పురీష నాళం లో ఇన్‌ ఫెక్షన్‌ సోకితే దాన్ని అల్సరేటివ్‌ కొలిటిస్‌ గా వ్యవహరిస్తారు. ఆహార వాహికలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌ ఉంటే క్రోన్స్‌ డి సీజ్‌ గా చెబుతారు.
విరోచనంలో రక్తం పడుతుంటే సమస్య ఏమిటో గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. కొన్ని సార్లు రక్తం తక్కువ మొత్తంలో ఉంటే అది పెద్దగా కనిపించదు. అటువంటప్పుడు ఫీకల్‌ అక్కల్టు టెస్టు తో దీన్ని తెలసుకొన వచ్చు. ఆహార వాహిక ఎగువ భాగంలోనా, లేక దిగువ భాగంలోనా సమస్య ఉన్నది గుర్తించాలి. ఇందుకు నాసో గ్యాస్ట్రిక్‌ లావేజ్‌ టెస్టును ఉపయోగిస్తారు. ముక్కు ద్వారా ట్యూబు పంపించి ఇన్‌ ఫెక్షను ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు యత్నిస్తారు.

Dig-(2)సాధారణంగా మొలలు తలెత్తినప్పుడు రక్తం పడుతుండటం సాధారణ లక్షణం. కారం, వేపుడు, మసాలా పదార్థాలు ఎక్కువగా తినే వారిలో ఈ సమస్య గుర్తించవచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాని స్థితిలో ఉన్నప్పుడు ఇది తలెత్తుతుంది. దీని వలన మల విసర్జన సరిగ్గా జరగదు. అటువంటప్పుడు పురీష నాళంలో ఉన్న మలాన్ని బయటకు నెట్టేందుకు పాయువు దగ్గర గట్టిగా ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ ఉండే రక్త నాళాలు పగిలి రక్తం విడుదల అవుతుంది. ఇది మలంలో కలుస్తూ ఉంటుంది. కొన్ని సార్లు మల విసర్జన తర్వాత మొలలు చేతికి తగులుతూ ఉంటాయి కూడా. మల విసర్జన సమయంలో కొన్ని సార్లు నొప్పి గా ఉన్నట్లుగా అగుపిస్తుంది.ఎండోస్కోపీ విధానంలో చిన్నపాటి కెమెరాను కడుపులోకి పంపిస్తారు. దీన్ని ఈసోఫాగో గ్యాస్ట్రో డుయోడినోస్కోపీ అని వ్యవహరి స్తారు.

269698నోటి నుంచి పేగు దాకా అన్ని ప్రాంతాల్ని పరిశీలించి ఫలితాన్ని తీసుకొంటారు. కొన్ని సార్లు బయోప్పీ ద్వారా చిన్న పాటి కణజాలాన్ని తీసుకొని పరీక్షిస్తారు. ఎండోస్కోపీ పరీక్షను పురీషం ద్వారా చేస్తే దాన్ని కొలనోస్కోపీ గా వ్యవహరిస్తారు. పెద్ద పేగు, పురీషనాళంలో సమస్యను గుర్తించేందుకు ఇది ఉపయోగిస్తుంది. చిన్న పేగుమీద ద్రష్టిని కేంద్రీకరించి ఎండోస్కోపీ నిర్వహిస్తే ఎంటెరోస్కోపీ అంటారు. దీంతో పాటు ఎక్సు రే, స్కానింగ్‌, యాంజియో గ్రఫీ, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు అవసరం అవుతాయి.సమస్య ఎక్కడ ఉన్నదీ గుర్తించాక చికిత్స మొదలు పెడతారు. సమస్య ప్రాథమికంగా ఉంటే మందులతో చికిత్స అందిస్తారు. కొన్ని సార్లు ఎండోస్కోపీ ద్వారా బ్లీడింగ్‌జరిగేచోటకు మందుల్ని పంపిస్తారు. అవసరమైనప్పుడు కీమో థెరపీ చేయాల్సి ఉంటుంది. వ్యాధి ముదిరితే మాత్రం శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.గతంలో ఇటువంటి శస్త్ర చికిత్సలకు ఎక్కువ సమయం పట్టేది. ఆధునాతన టెక్నాలజీ ద్వారా ఒక్క రోజులోనే ఆపరేషన్‌ పూర్తి చేసే పరిస్థితి అందుబాటులోకి వచ్చింది. అప్పటికప్పుడు ఆపరేషన్‌ ఛేసి సాయంత్రానికి ఇంటికి పంపించే వె సులుబాటు కలిగింది. సమస్యను గుర్తించినప్పుడు నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే సమగ్రమైన చికిత్సను అందించగలుగుతారు.

Dig-(3)పెద్ద పేగు, పురుష నాళంలలో పరాన్నజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శరీరంలోని అంతర్గత వ్యాధి నిరోధక శక్తి వాటిని అణచివేస్తుంది. ఒక్కోసారి ఈ అణచివేత ఎక్కువ గా ఉన్నప్పుడు అది గోడల మీద ఒత్తిడిని పెంచుతుంది. అటువంటప్పుడు రక్త నాళాలు చిట్లి రక్త స్రావం ఏర్పడుతుంది. దీన్ని అల్సరేటివ్‌ కొలిటిస్‌ గా వ్యవహరిస్తారు. మలంలో రక్తం పడటం, డయేరియా, దిగువ భాగంలో నొప్పి ద్వారా దీన్ని గుర్తు పట్టవచ్చు. తీవ్రమైన కేసుల్లో రోజుకి15-20 సార్లు విరేచనాలు అయిపోతాయి. ఈ లక్షణాలు ఒకేసారి బయట పడవచ్చు. లేదా లక్షణాలు దఫదఫాలుగా బయట పడవచ్చు. ఇది పెద్ద పేగు క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.

ఆహార వాహికలో రక్త స్రావం జరుగుతుంటే దాన్ని క్రోన్సు వ్యాధిగా పరిగణించవచ్చు.
సాధారణంగా చిన్న పేగు చివరలో పెద్ద పేగు మొదట్లో దీన్ని గుర్తిస్తారు. లేదంటే ఏ ప్రాంతంలో అయినా ఇది బయట పడవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉంటే, మిగిలిన వారిలో కూడా గమనించే చాన్సు ఉంది. దిగువ లో నొప్పి తో పాటు రక్తపు విరేచనాలు గమనించదగిన లక్షణాలు. బరువు తగ్గటం తో పాటు పుండ్లు పడుతుంటాయి. ఈ సమస్య సుదీర్ఘకాలం కొనసాగే
అవకాశం ఉంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top