You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » మరపురాని గాయని స్వర్ణలత

మరపురాని గాయని స్వర్ణలత

మరపురాని గాయని స్వర్ణలత

 

మనం మరిచిపోరుున మధురగాయని ఆమె… వైవిధ్యగీతాలు పాడినా హాస్యగీతాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టారుు. అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో ‘కాశీకి పోయాను రామాహరి’ పాటను తెలుగు సినిమా ప్రేక్షకుడు అంత తేలిగ్గా మర్చిపోలేడు. ఆ చిత్రంలో గిరిజ నటనకు ఆమె పాడిన పాట ప్రేక్షకులకు థియేటర్లలో నవ్వులు కురిపించింది. ఆమె ఎవరో కాదు హాస్య గీతాల గాయని స్వర్ణలత. తొలిచిత్రం ‘మాయారంభ’ అరుునా ఆమె పాడిన ‘పరమానందయ్య శిష్యూలు’ తొలుత విడుదలరుుంది. ఆమె జయంతి మార్చి 10…అదే రోజున కొందరు దుండగులు జరిపిన దాడిలో ఆమె తన ప్రాణాలు కోల్పోరుున రోజు కావడం విచారం. స్వర్ణలత స్మతికి నివాళిగా ఆమె గురించి నేటి తరం పాఠకులు తెలుసుకోవాలని ఆశిస్తూ…
Swarnalatha1అలనాటి మేటి చిత్రాలలో హీరో హీరోయిన్లతో పాటు హాస్యాన్ని జోడించడానికి హాస్య జంట తప్పని సరి. వీరికి కూడా ప్రత్యేక గీతాలను ఆయా చిత్రాలలో ఇనుమడిం పచేసేవారు. ఆయా హాస్య గీతల రచనకు రచయితలు, వాటిని ఆలపించడానికి గాయనీగాయకులు ప్రత్యేకంగా వుండేవారు. వారిలో స్వర్ణలతకు ప్రత్యేక స్థానం వుంది. ఈమె హాస్యగీతాలగాయనిగా అందరిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, మొదలగు భాషల్లో పాడిన ఈమె 10 మార్చి1928న జన్మించారు.ఈమె అసలు పేరు మహాలక్ష్మి. ఈమె పరమానందయ్య శిష్యులు చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయినప్పటికీ మొదట విడుదలైన చిత్రం ఎన్టీఆర్‌ తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన మాయారంభ.

స్వర్ణలత జన్మదినం, మరియు మరణించిన రోజు కూడా 10 మార్చి కావడం విషాదకరం. స్వర్ణలత కుమారుడు ప్రముఖ నటుడు అనీల్‌ రాజ్‌ ప్రతీ సంవత్సరం 10 మార్చిన గాయనీగాయకులను తన వంతుగా సత్కరిస్తూ తల్లి ఆత్మకు శాంతిని కలుగజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గాయని స్వర్ణలతకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, వీరిలో ఒక కుమార్తె కూడా గాయనే. ఆమె పేరు కూడా స్వర్ణలత. కాగా ఆమె ఇటీవల ఓ ప్రమాదంలో మరణించారు. సినిమా పాటలు పాడే గాయనీ గాయకులు అన్ని రకాల, నవ రసాల పాటలూ పాడతారు.. పాడగలరు. మధుర గాయకులు అనిపించుకున్నవారు కూడా హాస్యగీతాల్లాంటివి పాడారు.

Swarnalatha2కానీ, ఒక్క స్వర్ణలతకి మాత్రం ‘హాస్యగీతాల గాయని’గా ముద్రపడింది. చిన్నతనంలో ఎనిమిదేళ్లపాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుంది. నాట్యం కూడా అభ్యసించింది. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించింది. గాత్రకచేరీలు చేసింది. అయినా తొలిసారి సినిమా కోసం పాడిన పాట హాస్యనటుడితో పాడడం వల్ల కాబోలు అలా ముద్ర పడిందనిపిస్తుంది. ఆ సినిమా ‘మాయా రంభ’ (1950). ఆ పాట కస్తూరి శివరావుతో కలిసి పాడిన ‘రాత్రీ పగలనక…’. ఆనాటి సినిమా కథా సంప్రదాయం ప్రకారం నాయికానాయకులతోపాటు హాస్యజంటకు కూడా పాటలుండేవి. పురాణ, జానపద, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఇలాంటి పాటలు వినిపిస్తాయి. చాలా పాటలు జనాదరణ పొందాయి ఒక్కసారి స్వర్ణలత పాటలు గుర్తుకు తెచ్చుకుంటే- ‘కాశీకి పోయాను రామా హరీ’, ‘ఓ కొంటె బావగారూ’ (అప్పుచేసి పప్పుకూడు: 1959), ‘అంచెలంచెలు లేని మోక్షము’ (శ్రీకృష్ణార్జున యుద్ధం: 1963), ‘తడికో తడికో’ (అత్తా ఒకింటి కోడలే: 1958) వంటి పాటలు మచ్చుతునకలు మాత్రమే.

Swarnalatha4పిల్లలు : 6 కొడుకులు 3 కూతుర్లు (ఒక కొడుకు సినీ నటుడు ఆనంద్‌రాజ్‌. నలుగురు కొడుకులు అమెరికాలో డాక్టర్లు. ఇంకొక కొడుకు డ్యాన్సర్‌ నటరాజ్‌ (ఇప్పుడు అనిల్‌రాజ్‌). ఒక కూతురు అమెరికాలో డాక్టరు. ఇంకొక కూతురు స్వర్ణలత – ఆమె పేరే పెట్టుకున్నారు’’ అని ఒకసారి చెప్పారు స్వర్ణలత. కూతురు స్వర్ణలత కూడా గాయని. (’భారతీయుడు’లో ’మాయామశ్ఛీంద్రా’, ’ప్రేమికుడు’లో ’ముక్కాల ముక్కాబులా; ’’కలిసుందాం రా’’లో ‘నచ్చావే పాలపిట్ట’; ‘చూడాలని వుంది’లో ’రామ్మాచిలకమ్మా’ మొదలెన పాటలు పాడారు. విడిగా ఆడియోలో క్రైస్తవ భక్తిగీతాలు పాడారు. ఈమె కూడా ఇటీవలే కన్నుమూశారు.

స్వర్గీయ స్వర్ణలత పాడిన అపురూప గీతాలు

  • రాత్రి పగలనక–మాయారంభ
  • కాశీకి పోయాను రామా హరీ ,
  • ఓ కొంటె బావగారూ — అప్పుచేసి పప్పుకూడు
  • అంచెలంచెలు లేని మోక్షము శ్రీక్రిష్ణార్జున యుద్ధం
  • తడికో తడికో — అత్తా ఒకింటి కోడలే(1958)
  • ఏమయ్యా రామయ్యా — బొబ్బిలి యుద్ధం (1964)
  • రుక్మిణమ్మా రుక్మిణమ్మా — ఉయ్యాల జంపాలా (1965)
  • భలే భలే హిరణ్యకశిపుడరా’ (గురువును మించిన శిష్యుడు:
  • డివ్వి డివ్వి డివ్విట్టం (దాగుడు మూతలు:1964)
  • ఆడ నీవూ ఈడ నేనూ’ (హరిశ్చంద్ర: 1965)
  • ఏమిటి ఈ అవతారం’ (చదువుకున్న అమ్మాయిలు:
  • ఆశా ఏకాశ’ (జగదేక వీరుని కథ:
  • ‘విన్నావా..యశోదమ్మ’ (మాయాబజార్‌’ (1957)లో
   పి.లీల, స్వర్ణలత కలిసి పాడినది).
   ప్రొఫైల్‌

 

పేరు 	: స్వర్ణలత 
అసలు పేరు : మహలక్ష్మి 
భర్త 	: డా.అవరాథ్‌ (1956లో వివాహం )
ఊరు 	:చాలగమర్రి గ్రామము 	-కర్నూలు జిల్లా
నివాసము 	: మద్రాస్‌ 
పుట్టిన తేది : 10 మార్చి 1928 
మరణం	: 10 మార్చి 1977
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top