You Are Here: Home » సఖి » అందం » మరకలు పోయి మెరవాలంటే!!?

మరకలు పోయి మెరవాలంటే!!?

శుచి, శుభ్రత మనకే కాదు బట్టలకు కూడా కావాలి.

  • బట్టలకంటిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యా లి. తర్వాత శుభ్రత అదే వస్తుంది. లేక నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.
  • జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద పడే లిప్‌స్టిక్‌ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్‌ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకాలి.
  • శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి.
  • దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్క ను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది.
  • దుస్తులమీద సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.
  • షిఫాన్‌ చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్‌ చల్లి మడత పెట్టండి. వారం తర్వాత పౌదరు దులిపివేయండి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top